Mahabubabad Waterfalls: మహబూబాబాద్ జిల్లాలోని జలపాతాలు పర్యాటకులకు కనువిందు చేస్తున్నాయి. గత నాలుగు రోజులుగా వరుసగా కురుస్తున్న భారీ వర్షాలకు ఎగువ ప్రాంతంలోని వర్షపు నీరుతో జలపాతాలు జాలు వారుతున్నాయి. పరవళ్ళు తొక్కుతున్న జలపాతాలకు సందర్శకులు ఉబ్బి త తబ్బిబ్బవుతున్నారు. పరవళ్ళు తొక్కుతున్న జలపాతాలతో పచ్చటి అడవుల లోగిల్లు ఆనందపు పారవశ్యంలో మునిగి తేలుతున్నాయి.
Also Read: Students Protest: ముక్తాపూర్‌లో టీచర్ కోసం రహదారిపై ధర్నా చేపట్టిన చిన్నారులు
పెద్ద ఎత్తున వరద నీరు
గూడూరు మండలంలోని భీముని పాదం, గంగారం మండలం బయ్యారం మండలాల మధ్య లో ఉన్న ఏడు బావుల జలపాతం ఎత్తైన కొండల నుంచి కిందకు జాలువారుతోంది. మూడు రోజుల నుంచి బయ్యారంతోపాటు పక్కనే ఉన్న కొత్త కూడా గంగారం ఏజెన్సీ ప్రాంతాల్లో భారీగా కురుస్తున్న వర్షాలకు పెద్ద ఎత్తున వరద నీరు కొండలపై నుంచి కిందికి జాలువారుతున్నాయి. దీంతో ఏడు బావుల జలపాతం కిందికి దుముకుతున్న జలపాతాలు సందర్శకులను కనుల విందు చేస్తుంది. ఏడు బావుల తెలపాతం వద్దకు ఎడతెరిపి కురుస్తున్న భారీ వర్షాల కారణంగా పర్యాటకులను అధికారులు వెళ్లేందుకు అనుమతించడం లేదు.
Also Read: Nagarkurnool district: నాగర్‌కర్నూల్ జిల్లాలో నయా మోసం.. అధికారులపై వేటు!
