Students Protest( Image credit: swetcha reporter)
నార్త్ తెలంగాణ

Students Protest: ముక్తాపూర్‌లో టీచర్ కోసం రహదారిపై ధర్నా చేపట్టిన చిన్నారులు

Students Protest: సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గం ప్రేమ ఆప్యాయతతో చేసిన సేవలు ఎల్లప్పుడూ గుర్తుంటాయని ఈ సంఘటన నిరూపించింది. ఉపాధ్యాయుల అడ్జస్ట్మెంట్ లో భాగంగా ఓ ఉపాధ్యాయుడిని మరో పాఠశాలకు బదిలీ చేశారు. కాగా మా టీచర్ మాకే కావాలని ప్రధాన రహదారిపై చిన్నారులు ఆందోళన చేపట్టి కన్నీరు పెట్టుకున్న విచిత్ర ఘటన సంగారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది. సంగారెడ్డి జిల్లా(Sanga Reddy District) నారాయణఖేడ్ నియోజకవర్గం నాగలిగిద్ద మండలం ముక్టాపూర్(Muktapur)గ్రామంలో ప్రభుత్వ పాఠశాలలో రమేష్(Ramesh) అనే ఉపాధ్యాయుడు ఏడాది క్రితం చేరాడు.

Also Read: Nagarkurnool district: నాగర్‌కర్నూల్ జిల్లాలో నయా మోసం.. అధికారులపై వేటు!

తమ పాఠశాలకే రావాలి

అతను చేరిన సమయంలో పాఠశాలలో సంఖ్య అంతంత మాత్రమే ఉండేది. రమేష్(Ramesh) ప్రత్యేక చొరవతో 30 మంది విద్యార్థుల సంఖ్య నుండి 80 మంది విద్యార్థుల వరకు పెంచడం జరిగింది. ప్రైవేటు పాఠశాలలకు వెళ్లే వారిని సమదాయించి ప్రభుత్వ బడిలో చేర్పించారు. ఈ క్రమంలో ఉపాధ్యాయుల అడ్జస్ట్మెంట్ లో భాగంగా ఇటీవల రమేష్ ను మండలంలోని ఇరక్ పల్లికి బదిలీ చేశారు. ఈ క్రమంలో ఆందోళనకు గురైన చిన్నారులు, గ్రామస్తులు నారాయణఖేడ్(Narayana khed) నాగలిగిద్ద ప్రధాన రహదారిపై ఆందోళన చేపట్టారు. ధర్నా రాస్తారోకో చేశారు. తమ ఉపాధ్యాయుడు రమేష్(Ramesh) తమ పాఠశాలకే రావాలని ప్రధాన రహదారిపై విద్యార్థులు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా చిన్నారులు రమేష్ సార్ తమ పాఠశాలకు రావాలని రోదించారు. చిన్నారులు మూకుమ్మడిగా కన్నీరు పెట్టుకున్నారు. దీంతో అక్కడికి చేరుకున్న ఉపాధ్యాయుడు రమేష్(Ramesh) , నా గలిగిద్ద పోలీసులు(Police) విద్యార్థులను శాంతింపజేసి అక్కడి నుండి పంపించి వేశారు.

 Also Read: Waragal Gurukulam: గురుకుల ప్రవేశాల్లో నియమాల మాయం.. విద్యార్థులపై అన్యాయం ఎవరి బాధ్యత?

Just In

01

Ganja Racket: గంజాయి బ్యాచ్ అరెస్ట్! .. ఎలా దొరికారో తెలుసా?

Huzurabad Gurukulam: గురుకులంలో విద్యార్థులకు టార్చర్?.. ప్రిన్సిపాల్, ఓ పోలీస్ ఏం చేశారంటే?

Sujeeth Birthday: సుజీత్ బర్త్‌డే.. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ ట్వీట్ చూశారా?

Bottu Gambling: చిత్తు-బొత్తు ఆడుతున్న ఏడుగురి అరెస్ట్.. ఎంత డబ్బు దొరికిందంటే?

Mega Jathara: అసలైన మెగా జాతర సంక్రాంతి నుంచి మొదలు కాబోతోంది.. మెగా నామ సంవత్సరం!