Drunk and Drive (imagecredit:swetcha)
నార్త్ తెలంగాణ

Drunk and Drive: ప్రమాదాల నివారణే లక్ష్యం.. దొరికితే లైసెన్స్ రద్దుకు సిఫార్సు

Drunk and Drive: మద్యం సేవించి వాహనాలు నడిపే వారికి జరిమానా జైలు శిక్ష తప్పవని ములుగు జిల్లా ఎస్పీ డాక్టర్ శబరీష్(SP Dr. Shabarish) హెచ్చరించారు. ములుగు(Mulugu) జిల్లా వ్యాప్తంగా గత నెల(జూలై)లో 456 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు చేసినట్లు తెలియచేశారు. ఇకపై కేసులు నమోదు చేయడం తో పాటు నిందితులకు శిక్ష విధించడంపై కూడా ప్రత్యేక చర్యలు తీసుకుంటామని తెలిపారు. గడిచిన వారంలో వివిధ పోలీస్ స్టేషన్(Police Station) పరిధిలలో మద్యం సేవించి వాహనాలు నడుపుతూ పట్టుబడిన 17 మంది మందుబాబులకు వారి కుటుంబ సభ్యుల సమక్షంలో కౌన్సెలింగ్ నిర్వహించి కోర్ట్ ద్వారా అట్టి 17 మందికి 2 రోజుల జైలు శిక్షతో పాటు 2వేల రూపాయల జరిమానాలు విధించామన్నారు.

కుటుంబ ఆర్థిక పరిస్థితులు
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ.. మద్యం సేవించి వాహనం నడిపి ప్రమాదాలకు కారణం అయితే వారిపై కేసులు నమోదు చేయడం జరుగుతుందని, జిల్లాలో ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రతి రోజూ డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్(Drunk And Drive Test)లు, వాహన తనిఖీలు నిర్వహించడం జరుగుతుందని, తరచు డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తూ పట్టుబడిన వ్యక్తుల డ్రైవింగ్ లైసెన్స్(Driving license) తీసుకొని ఆ లైసెన్స్ రద్దుకు సంబంధిత రవాణా శాఖ అధికారులకు సిఫారస్సు చేస్తున్నామన్నారు. తాగి వాహనాలు నడపవద్దని తద్వారా జరిగే ప్రమాదాలను, కుటుంబ ఆర్థిక పరిస్థితులు చితికిపోయే అంశాలపై పోలీస్ శాఖ కౌన్సిలింగ్‌ ద్వారా వివరించడం, పట్టుబడిన వారిని వారి కుటుంబ సభ్యుల సమక్షంలో కౌన్సెలింగ్ నిర్వహిస్తూ కోర్టులో హాజరు చేయడం జరుగుతుందని అన్నారు.

Also Read: Telangana: విశ్వవిద్యాలయాల అభివృద్ధి కాంగ్రెస్ ప్రభుత్వంతోనే సాధ్యం

యజమానులు బాధ్యులు అవుతారు
మద్యం సేవించి మొదటిసారి పట్టుబడిన, రెండవసారి పట్టుబడిన వారు సేవించిన మద్యం మోతాదులను బట్టి తప్పనిసరిగా శిక్షలు విధించబడతాయని తెలిపారు. రోడ్డు ప్రమాదాల నివారణ లక్ష్యంగా క్రమం తప్పకుండా డ్రంక్ అండ్ డ్రైవ్(Drunk And Drive) పరీక్షలను నిర్వహించడంతో పాటు, ట్రాఫిక్ నిబంధనలు, రోడ్డు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. అలాగే మైనర్లు(Miners) వాహనాలు నడుపుతూ పట్టుబడితే వారి తల్లిదండ్రులు, వాహన యజమానులు బాధ్యులు అవుతారని హెచ్చరించారు. ట్రాఫిక్‌ నియంత్రణపైన, మద్యం తాగి వాహనాలు నడిపేవారిపైన కఠినంగా వ్యవహరించడమే కాకుండా వారికి నిరంతరం కౌన్సిలింగ్‌లు ఇవ్వడం, సూచనలు చేయడం జరుగుతుందన్నారు.

అంతే కాక పాఠశాలలకు, కళాశాలలకు వెళ్లి విద్యార్థులతో మమేకమై పాటించాల్సిన నియమాలు వివరించడం వంటి కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందన్నారు. వాహనదారులు రోడ్డు భద్రతా నియమాలు పాటిస్తూ పోలీస్ వారికి సహకరించాలని కోరారు. గడిచిన వారంలో (27 జూలై నుండి ఆగస్టు 2 వరకు) మద్యం సేవించి పట్టుబడిన వారిలో 17 మందికి 2 రోజుల జైలు శిక్షతో పాటు రూ.2వేల జరిమానా విధించామని చెప్పారు.

Also Read: Yadadri Thermal Power: భూ నిర్వాసితుల‌కు అన్నివిధాలా న్యాయం: డిప్యూటీ సీఎం

Just In

01

Crime News: తీరుమారని గంజాయి పెడ్లర్ పై పీడీ యాక్ట్.. ఉత్తర్వులు జారీ!

Crime News: హైదరాబాద్‌లో దారుణం.. మార్ఫింగ్ ఫోటోలతో యవతికి బెదిరింపులు

Teja Sajja: టాలీవుడ్ హీరోల గురించి ఎవరికీ తెలియని విషయం చెప్పిన తేజ సజ్జా.. ఇలా కూడా ఉంటుందా?

Balapur Laddu Auction 2025: బాలాపూర్ లడ్డు సరికొత్త రికార్డ్.. ఈసారి ఎన్ని రూ.లక్షలు పలికిందంటే?

Pending Bills: పెండింగ్‌లో అద్దెవాహన బిల్లులు.. ఖజానా కోసం ఎంపీడీవోల చూపులు