Government Hospital: ప్రభుత్వ ఆసుపత్రిలో కలకలం
Government Hospital (imagecredit:swetcha)
నార్త్ తెలంగాణ

Government Hospital: ప్రభుత్వ ఆసుపత్రిలో కలకలం.. బతికుండగానే మార్చురీలో వ్యక్తి..!

Government Hospital: మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో బుధవారం రాత్రి చోటు చేసుకున్న ఘటన కలకలం సృష్టించింది. తీవ్ర అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరకుండా బయటే ఉన్న వృద్ధుడిని, డ్యూటీ సిబ్బంది మృతి చెందాడనే భావనతో శవాలను భద్రపరిచే మార్చురీలో ఉంచారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. చిన్న గూడూరు(Chinna Guduru) మండలం, జయ్యారం గ్రామానికి చెందిన ఎల్ది రాజు(Raju) (50) రెండు రోజుల క్రితం అనారోగ్యంతో ఆసుపత్రికి వచ్చాడు. అయితే, ఆధార్ కార్డు లేదనే కారణంతో సిబ్బంది ఆయనకు ఓపీ ఇచ్చి చికిత్స అందించలేదు.

ఘటనపై విచారణ..

తీవ్ర అనారోగ్యంతో ఆసుపత్రి(Hospital)లోనే స్ట్రెచర్‌పై అపస్మారక స్థితిలో ఉన్న రాజును, భారీ వర్షం కారణంగా బుధవారం రాత్రి 10 గంటల సమయంలో మృతి చెందాడని భావించి సిబ్బంది మార్చురీలో పెట్టారు. గురువారం ఉదయం మార్చురీ వద్ద శుభ్రం చేయడానికి వచ్చిన స్వీపర్‌, భద్రపరిచిన రాజు కదలడం, శబ్దం రావడం గమనించింది. ఆమె వెంటనే వైద్యులకు సమాచారం అందించగా, హుటాహుటిన స్పందించిన వైద్యులు రాజుకు అత్యవసర చికిత్స అందిస్తున్నారు. రీజినల్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ జగదీశ్వర్(Dr. Jagadishwar) ఈ ఘటనపై విచారణ చేపట్టి, బాధ్యులైన వారిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు.

Also Read: Chhattisgarh: మావోయిస్టులకు భారీ షాక్.. బీజాపూర్ ఎస్పీ డాక్టర్ జితేంద్రకుమార్ ఎదుట 51 మంది సరెండర్

వార్తలు అవాస్తవం..

కాగా, బతికి ఉన్న వ్యక్తిని మార్చురీలో పెట్టారంటూ వస్తున్న వార్తలు అవాస్తవమని ఆసుపత్రి సూపరింటెండెంట్ ఖండించారు. రోడ్డుపైన, వర్షంలో నడవలేని స్థితిలో పడి ఉన్న బెగ్గర్‌ను మానవత్వంతో మార్చురీ సెక్యూరిటీ సిబ్బంది దగ్గర్లో ఉన్న బెంచ్‌పైకి చేర్చి, అక్కడి నుంచి వార్డుకు షిఫ్ట్ చేశారని వివరించారు. ఈ విషయాన్ని వక్రీకరించి కొంతమంది ప్రభుత్వ హాస్పిటల్‌(Govt Hospital)పై బురదజల్లే కుట్ర చేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

Also Read: Cyclone Montha: రాష్ట్రంలో వర్ష బీభత్సం.. డిప్యూటీ సీఎం వీడియో కాన్ఫరెన్స్.. అధికారులకు కీలక ఆదేశాలు

Just In

01

Maoists surrender: వనం నుంచి జనంలోకి.. నలుగురు మావోయిస్టులు లొంగుబాటు!

Allu Arjun: తమిళ దర్శకులు అల్లు అర్జున్ కోసం ఎందుకు క్యూ కడుతున్నారు?.. రీజన్ ఇదే..

Medaram Jatara 2026: మేడారంలో భారీగా ట్రాఫిక్ జామ్.. కట్టలు తెంచుకుంటున్న భక్తుల ఆగ్రహం!

Municipal Elections: కాంగ్రెస్‌కు మున్సిపల్ ఎన్నికలు టెన్షన్ .. ఈ ఫలితాలే రాజకీయ దిశను నిర్ణయిస్తాయా?

BRS Party: మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఒంటరి పోరు.. పొత్తులు లేకుండా గెలుపు సాధ్యమా?