Chhattisgarh ( image credit: swetcha reporter)
జాతీయం

Chhattisgarh: మావోయిస్టులకు భారీ షాక్.. బీజాపూర్ ఎస్పీ డాక్టర్ జితేంద్రకుమార్ ఎదుట 51 మంది సరెండర్

Chhattisgarh: మావోయిస్టులకు మరో భారీ షాక్ తగిలింది. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లా ఎస్పీ డాక్టర్ జితేంద్ర కుమార్ యాదవ్ సరెండర్ అయ్యారు. ఇందులో తొమ్మిది మంది మహిళలు ఉన్నారు. ఆరుగురుపై రూ. 8 లక్షల రివార్డు, 13 మందిపై రూ. 66 లక్షల రివార్డ్ ఉందని పోలీసులు తెలిపారు. మావోయిస్టు సిద్ధాంతాలకు దూరంగా ఉండాలని సీనియర్ కేడర్ తో అంతర్గత కారణంగా మావోయిస్టులు లొంగిపోయినట్లు పోలీసులు పేర్కొన్నారు. లొంగిపోయిన వారికి పునరావాసం కల్పించేందుకు ప్రత్యేక చర్యలను చేపడుతున్నామని పోలీసులు పేర్కొన్నారు.

Also Read: Chhattisgarh: హిడ్మా సరెండర్ కాబోతున్నాడా? ఏటూరు నాగారం, తుపాకులగూడెం అడవుల్లో సంచరిస్తున్నాడా?

కేంద్ర కమిటీ సభ్యులు లొంగిపోవడం కలకాలం

గత నెల రోజులుగా మావోయిస్టుల లొంగుబాటు ప్రక్రియ పరంపర కొనసాగుతూనే ఉంది. రోజురోజుకు మావోయిస్టు పార్టీ అంతరించిపోయే దిశగా పయనిస్తుంది. పార్టీలో కొంతమంది కేంద్ర కమిటీ సభ్యులు మృతి చెందడంతో మరికొంతమంది సీనియర్ మావోయిస్టులు కేంద్ర కమిటీ సభ్యులు లొంగిపోవడం కలకాలం రేపుతోంది. పలుమార్లు అధిక సంఖ్యలో మావోయిస్టులు లొంగిపోతున్న ఘటనలతో ఆ పార్టీ ఉక్కిరి బిక్కిరి అవుతోంది. ఈ ప్రక్రియ అంతా మావోయిస్టు పార్టీలో రెండు వర్గాల మధ్య విభేదాల కారణం, అదేవిధంగా వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు లొంగిపోయిన మావోయిస్టులకు పునరావాసం కల్పించడం, రివార్డులు ఉన్నవారికి నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లోకి మళ్లించడం వంటి కార్యక్రమాలకు ఆకర్షితులైన మావోయిస్టులు లొంగుబాటుకు లైన్ లు కడుతున్నారు.

మరో 468 మంది మావోయిస్టులు అరెస్టు

2025లో ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో ఇప్పటివరకు 138 మంది మావోయిస్టులు ఎదురుకాల్పుల్లో మృతి చెందారని పోలీసు వర్గాలు వెల్లడిస్తున్నాయి. అదేవిధంగా జనవరి నుంచి నేటి వరకు 1410 మావోయిస్టులు లొంగిపోయారని, మరో 468 మంది మావోయిస్టులు అరెస్టు అయినట్లుగా బీజాపూర్ ఎస్పీ డాక్టర్ జితేంద్ర కుమార్ వెల్లడించారు. లొంగిపోయిన వారిలో డి వి సి ఎం కమిటీ సభ్యులు నలుగురు, ఏసియన్ సభ్యులు 9 మంది, పార్టీ మెంబర్స్ ఎనిమిది మంది తోపాటు వివిధ కేడర్లలో పనిచేసే వారితోపాటు మొత్తం 51 మంది లొంగిపోయారు. ఏకే 47 రైఫిల్స్ 3, ఎస్ ఎల్ ఆర్ రైఫిల్స్ 4, ఇన్సాస్ రైఫిల్స్ 2, 303 రైఫిల్స్ 5, 315 బోర్ రైఫిల్ ఒకటి, సింగిల్ షాట్ 2 లతోపాటు మొత్తం 18 ఆయుధాలను పోలీసులకు మావోయిస్టులు అప్పగించారు.

Also ReadChhattisgarh: చరిత్రలోనే మావోయిస్టులు అత్యధికంగా.. ఒకే రోజు 120 మంది లొంగుబాటు

Just In

01

Naveen Chandra: ‘అరవింద సమేత’ బాల్‌రెడ్డి తర్వాత మళ్లీ ఇదే..

Bhanu Bhogavarapu: ‘మాస్ జాతర’.. రవితేజ 75వ చిత్రమని తెలియదు

Tollywood: టాలీవుడ్‌లో పవన్ నామ స్మరణ.. వారికి వరమా? శాపమా?

Telugu Indian Idol S4 Finale: మన సినిమాకు ఎప్పుడు పాడుతున్నావబ్బాయ్.. న్యూ సింగర్‌కు రవితేజ బంపరాఫర్!

Jubilee Hills Bypoll: కాంగ్రెస్‌కే మద్ధతు.. జూబ్లీహిల్స్‌లో సీఎం రేవంత్‌కు మైనార్టీల హామీ