Chhattisgarh ( image credit: swetcha reporter)
నార్త్ తెలంగాణ

Chhattisgarh: చరిత్రలోనే మావోయిస్టులు అత్యధికంగా.. ఒకే రోజు 120 మంది లొంగుబాటు

Chhattisgarh: దేశ చరిత్రలోనే మావోయిస్టులు అత్యధికంగా లొంగిపోయిన ఘటన చోటుచేసుకుంది. ఛత్తీస్‌గఢ్  (Chhattisgarh)రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లాలో అబూజ్ మధ్ డివిజన్ కు చెందిన 120 మంది మావోయిస్టులు ఆయుధాలను విడిచిపెట్టి పోలీసుల ఎదుట సరెండర్ అయ్యారు. మహారాష్ట్రలోని గడ్చిరోలి లో మల్లోజుల వేణుగోపాల్ అలియాస్ సోను దాదా అలియాస్ అభయ్ తో పాటు మరో 60 మంది, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్ 50 మంది, కాంకేర్ జిల్లాలో 27 మంది మావోయిస్టులు లొంగిపోయారు. ఈ ఘటనతో మావోయిస్టులో తీవ్ర కలకలం రేపుతోంది. ఈ ఘటనలు మరువక ముందే బీజాపూర్ జిల్లాలోని అబూజ్ మడ్ డివిజన్ కి చెందిన మరో 120 మంది మావోయిస్టులు ఆయుధాలను విడిచి లొంగిపోవడంతో మావోయిస్టు పార్టీ కకావికలమైంది. దేశంలోనే ఎక్కువ మొత్తంలో మావోయిస్టులు లొంగిపోయిన అతిపెద్ద ఘటన చోటుచేసుకుంది.

Also ReadChhattisgarh: మావోయిస్టుల ఘాతుకం.. మందుపాతర పేలి జవాన్‌కు తీవ్ర గాయాలు

కేంద్ర ప్రభుత్వ వ్యూహం పలిస్తోంది

మావోయిస్టులను అణచివేసేందుకు కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న వ్యూహం ఫలిస్తుంది. మార్చి 31, 2026 వరకు మావోయిస్టు రహిత దేశంగా రూపుదిద్దేందుకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అనుకున్నట్టుగానే ఫలితాలు వస్తున్నాయి. అటు మహారాష్ట్ర, ఇటు చత్తీస్గడ్ రాష్ట్రంలో మావోయిస్టులు భారీగా లొంగిపోతున్న ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. దీంతో కేంద్ర ప్రభుత్వం అనుకున్నట్టుగానే మావోయిస్టులను మట్టు పెట్టేందుకు భద్రతా బలగాలు పూర్తిస్థాయిలో నిఘాతో వ్యవహరిస్తున్నాయి. భద్రత బలగాలు వేస్తున్న ఎత్తుగడలకు మావోయిస్టులు చిత్తుచిత్తు అవుతున్నారు.

విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు

విశ్వసనీయ వర్గముల సమాచారం మేరకు డీకేఎస్ జెడ్ సి అగ్ర మావోయిస్టు నాయకుడు, సంస్థ ప్రతినిధి రూపేష్ అలియాస్ సతీష్ అలియాస్ ఆశన్న గురువారం బహిరంగడు లో తనతో పాటు ఉన్న 120 మంది మావోయిస్టు సహచరులతో కలిసి లొంగిపోయారు. వీరిలో పలువురు మహిళా నక్సలైట్లు, ఏరియా కమిటీ సభ్యులు, సీనియర్ కేడర్లు ఉన్న మావోయిస్టులు ఉన్నట్లు సమాచారం.

ఇంద్రావతి మీదుగా

ఇంద్రావతి మీదుగా నక్సలైట్లు ఆయుధాలతో వచ్చి పోలీసులకు లొంగిపోయారు.. మడ్ డివిజన్ బృందం మొత్తం 70 కి పైగా ఆధునిక ఆయుధాలతో ఇంద్రావతి నదిని దాటి బైరం గడ్ కు చేరుకొని పోలీసుల ఎదుట లొంగిపోయారు. మావోయిస్టుల రాకను దృష్టిలో ఉంచుకొని భద్రతా బలగాలు ఇంద్రావతి నది నుంచి బహిరంగడు వరకు గట్టి బందోబస్తు నిర్వహించారు.

Also ReadTelangana BJP: జూబ్లీహిల్స్ అభ్యర్థిపై తేల్చుకోలేకపోతున్న బీజేపీ.. ఇంకా టైం పట్టనుందా..!

Just In

01

CCI Cotton Procurement: పత్తి కొనుగోళ్లలో అవకతవకలు జరగొద్దు.. పినపాక ఎమ్మెల్యే

Kavitha Janam Bata: కేసీఆర్‌కు ఆ అవసరం లేదు.. నిజామాబాద్ ప్రెస్‌మీట్‌లో కవిత ఆసక్తికర వ్యాఖ్యలు

Kurnool Bus Accident: కర్నూలు బస్సు ప్రమాద ఘటనలో ట్విస్ట్.. చనిపోయిన వ్యక్తిపై కేసు.. ఏం జరగబోతోంది?

Drinking Culture: మందు బాబులు మద్యం సేవించిన తర్వాత ఎందుకు ఎక్కువగా తింటారో తెలుసా?

Bigg Boss Telugu 9: సంజన నోటికి లాక్.. క్లౌడ్ గేమ్ షురూ.. మేఘం వర్షిస్తేనే సేఫ్, లేదంటే?