Cyclone Montha: తెలంగాణపై మెుంథా తుపాను ప్రభావం నేపథ్యంలో అధికారులతో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. నిధులకు సంబంధించి ఎలాంటి కొరత లేదని స్పష్టం చేశారు. అవసరమైతే ఎస్డీఆర్ఎఫ్ (State Disaster Relief Fund) నిధులు వాడుకోవాలని సూచించారు. 48 గంటల ముందే సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy), కేబినేట్ మంత్రులు (Cabinet Ministers).. అధికారులను అప్రమత్తం చేశారని భట్టి గుర్తుచేశారు. రాబోయో మరో 24 గంటలు కూడా ఇదే విధంగా అప్రమత్తంగా ఉండాలని అధికారులకు స్పష్టం చేశారు.
మెుంథా తుపాను కృష్ణాజిల్లా నుంచి నల్లగొండ, ఖమ్మం జిల్లా మీదుగా వెళ్లడంతో ఉత్తర తెలంగాణలో ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడ్డాయని డిప్యూటీ సీఎం భట్టి తెలిపారు. అధికారులు అప్రమత్తమై పత్తి తడవకుండా టార్పాలిన్లు కప్పడం, గోదాముల్లోకి పత్తి పంటను షిఫ్ట్ చేయడంతో పంటను కాపాడుకోగలిగామని అన్నారు. తుఫాను నేపథ్యంలో యావత్ విద్యుత్ శాఖ సహాయ చర్యల్లో నిమగ్నమైందని భట్టి కొనియాడారు. భారీ తుఫాను వచ్చినప్పటికీ ఎక్కడా విద్యుత్ సమస్య తలెత్తకుండా చర్యలు చేపట్టారని పేర్కొన్నారు. మెుబైల్ వ్యాన్ సిబ్బంది.. ఎప్పటికప్పుడు మరమ్మత్తులు చేసుకుంటూ ముందుకు వెళ్లారని చెప్పారు.
Also Read: Bigg Boss Telugu 9 Re Enter: బిగ్ బాస్‌లో సంచలనం.. పర్మినెంట్ హౌస్‌మేట్‌గా భరణి? మరి శ్రీజ పరిస్థితేంటి?
తుఫాను కారణంగా రెండు డిస్కంలకు చెందిన 11. 33/11 కె.వి సబ్ స్టేషన్లు దెబ్బతిన్నాయని భట్టి తెలిపారు. దీని ప్రభావం ఏడు సబ్ స్టేషన్ లపై పడిందని అన్నారు. వాటిలో మూడు పునరుద్దిరంచామని.. మిగిలిన 4 సబ్ స్టేషన్లను కొద్ది గంటల్లోనే పరిష్కరిస్తామని చెప్పారు. మరోవైపు 11 KV లైన్లు 237 డామేజ్ కాగా.. ఇప్పటికే 227 లైన్లను పునరుద్ధరించారని వివరించారు. డీటీఆర్ (డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ ఫార్మర్లు) లు 171 దెబ్బతినగా 49 ప్రాంతాల్లో పునరుద్ధరించారని భట్టి అన్నారు. మరో 122 ట్రాన్స్ఫార్మర్లను కొద్ది గంటల్లో పునరుద్ధరిస్తారని డిప్యూటీ సీఎం వివరించారు. ‘638 విద్యుత్ స్తంభాలు దెబ్బతినగా 304 విద్యుత్ స్తంభాలను పునరుద్ధరించారు. మరో 334 కొద్ది గంటల్లో పునరుద్ధరిస్తాం’ అని డిప్యూటీ సీఎం తెలిపారు.
రాష్ట్రంలో విస్తారంగా కురుస్తున్న వర్షాలు, తుఫాను ప్రభావం నేపథ్యంలో ముఖ్యమంత్రి శ్రీ @revanth_anumula గారు మంత్రులు, ఉన్నతాధికారులు, కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ప్రభుత్వ యంత్రాంగం సమన్వయంతో పనిచేయడం వల్ల ప్రాణ నష్టం, భారీ ఆస్తి నష్టం నుండి రాష్ట్రాన్ని… pic.twitter.com/s51N9PcHGA— Bhatti Vikramarka Mallu (@Bhatti_Mallu) October 30, 2025
