Bigg Boss Telugu 9 Re Enter: బిగ్ బాస్ తెలుగు సీజన్ మరింత రసవత్తరంగా సాగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఎలిమినేట్ అయిన భరణి (Bharani), శ్రీజ (Srija Dhammu)లను హౌస్ లోకి తీసుకొచ్చిన బిగ్ బాస్ టీమ్.. వారిలో ఒకరికి హౌస్ లో ఛాన్స్ ఇచ్చేందుకు టాస్కులు నిర్వహిస్తోంది. ఈ క్రమంలో బుధవారం ఎపిసోడ్ లో జరిగిన రెజ్లింగ్ టాస్కులో భరణి గాయపడటం.. హౌస్ దాటి ఆస్పత్రికి వెళ్లడం.. తిరిగి ఇంట్లోకి అడుగుపెట్టడం చకా చకా జరిగిపోయాయి. ఈ క్రమంలోనే శ్రీజ, భరణిలకు మరిన్ని టాస్కులు బిగ్ బాస్ టీమ్ నిర్వహించినట్లు తెలుస్తోంది. అయితే మెజారిటీ టాస్కుల్లో గెలిచి పర్మినెంట్ హౌస్ మేట్ గా భరణి నిలిచినట్లు నెట్టింట ప్రచారం జరుగుతోంది.
శ్రీజ వర్సెస్ భరణి..
నెట్టింట జరుగుతున్న ప్రచారం ప్రకారం.. శ్రీజ, భరణిలకు పలు టాస్కులను నిర్వహించారు. బుధవారం ఎపిసోడ్ లో జరిగిన కోటను నిర్మించే టాస్కులో కాస్త గందరగోళం చోటుచేసుకున్నప్పటికీ శ్రీజ టీమ్ (గౌరవ్, డెమోన్)ను సంచాలకురాలు దివ్వెల మాధురి విన్నర్ గా ప్రకటించింది. ఈ క్రమంలో గాయపడిన భరణి.. ఆస్పత్రికి వెళ్లి తిరిగి హౌస్ లోకి అడుగుపెట్టారు. అనంతరం ఫ్లాగ్ టాస్క్ (Flag Task)ను హౌస్ లో నిర్వహించినట్లు తాజాగా విడుదలైన ప్రోమోను బట్టి తెలుస్తోంది. అయితే భరణి గాయపడిన కారణంగా అతడి స్థానంలో దివ్య.. శ్రీజతో తలపడింది. అయితే ఈ టాస్కులో దివ్య గెలిచినట్లు సమాచారం. ఆ తర్వాత శ్రీజ – భరణి మధ్య ‘అన్ లాక్ ది డోర్’ (Un Lock the Door) టాస్క్ జరగ్గా అందులో శ్రీజ గెలిచిందట. తర్వాత బ్రేకర్ టాస్క్ జరగ్గా శ్రీజ తరపున కళ్యాణ్, భరణి తరపున ఇమ్మాన్యుయేల్ తలపడినట్లు సమాచారం. వారిలో ఇమ్మాన్యుయేల్ అదరగొట్టి భరణిని గెలిపించినట్లు తెలుస్తోంది. ఇలా హౌస్ జరిగిన టాస్కుల్లో భరణి లీడ్ లో ఉండటంతో భరణిని పర్మినెంట్ హౌస్ మేట్ గా బిగ్ బాస్ ప్రకటించినట్లు కూడా బజ్ వినిపిస్తోంది.
ఓటింగ్‌లోనూ భరణి టాప్!
టాస్కుల్లోనే కాకుండా హౌస్ అడుగుపెట్టడం కోసం బిగ్ బాస్ నిర్వహించిన ఓటింగ్ లోనూ భరణి టాప్ లో దూసుకుపోతున్నట్లు సమాచారం. హౌస్ లో భరణికి మద్దతుగా తనూజ, సుమన్ శెట్టి, దివ్య, ఇమ్మాన్యుయేల్, రాము ఉన్న సంగతి తెలిసిందే. వారి అభిమానులు భరణి ఇంట్లో ఉండాలని పెద్ద ఎత్తున ఓట్లు వేస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు శ్రీజ ఇంట్లోకి అడుగుపెట్టిన వెంటనే దివ్వెల మాధురి (Divvela Madhuri)తో గొడవ పడటం, స్నేహితుడైన కళ్యాణ్ ను నామినేట్ చేయడం వల్ల నెగిటివిటీ తెచ్చుకున్నట్లు సమాచారం. మెుత్తంగా చూస్తే అటు ఓటింగ్ లోనూ శ్రీజ వెనుకబడిపోయినట్లు తెలుస్తోంది.
Also Read: Viral Accident: ఆ చిన్న రోడ్డు ప్రమాదానికి.. యావత్ దేశమే షాక్.. అంతలా ఏం జరిగిందంటే?
శ్రీజ పరిస్థితేంటి?
బిగ్ బాస్ హౌస్ మేట్ అయేషా అనారోగ్య కారణాలతో ఈ వారం ప్రారంభంలో బయటకు వచ్చేసిన సంగతి తెలిసిందే. అయితే లేటెస్ట్ బజ్ ప్రకారం ఆమె తిరిగి హౌస్ లో అడుగుపెట్టాలని భావిస్తున్నారట. వాస్తవానికి అయేషా గనుక హౌస్ లోకి రాకుంటే శ్రీజ, భరణి ఇద్దరినీ హౌస్ లోకి తీసుకోవాలని బిగ్ బాస్ టీమ్ భావించినట్లు తెలుస్తోంది. ఇప్పుడు అయేషా గనుక నిజంగానే హౌస్ లోకి అడుగుపెడితే శ్రీజకు నిరాశ తప్పదని స్పష్టమవుతోంది. మరోవైపు శ్రీజకు బిగ్ బాస్ టీమ్ అన్యాయం చేస్తోందన్న వాదనలను ఆమె ఫ్యాన్స్ బలంగా వినిపిస్తున్నారు. ప్రజల ఓట్లతో బయటకు వెళ్లిపోయిన భరణి.. వైల్డ్ కార్డ్స్ ఓటుతో ఎలిమినేట్ అయిన శ్రీజా ఒకటేనా అని ప్రశ్నిస్తున్నారు. శ్రీజను నేరుగా తీసుకొచ్చి హౌస్ మేట్ చేసి ఉంటే బాగుండేదని పేర్కొంటున్నారు. భరణి, శ్రీజను ఇద్దరిని హౌస్ లోకి తీసుకొచ్చి.. ఇంటి సభ్యుల మద్దతు ఉన్న భరణికి బిగ్ బాస్ ఫేవర్ చేశారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మెుత్తం మీద ఈ వీకెండ్ లో శ్రీజ భవితవ్యం ఏంటో తెలియనున్నట్లు అర్థమవుతోంది.
