District President: మున్నూరుకాపు సంఘం జిల్లా అధ్యక్షుడిగా ధర్మపురి సంజయ్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి ఉమ్మడి రాష్ట్రం నేతందరు హజరు కానున్నారు. మున్నూరుకాపు సంఘం జిల్లా అధ్యక్షుడి దివంగత మాజీ పీసీసీ అధ్యక్షుడు డీ శ్రీనివాస్(Srinivas) పెద్ద కొడుకు మాజీ మేయర్ ధర్మపురి సంజయ్(Dharmapuri Sanjay) ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈనెల 23న ప్రమాణస్వీకార కార్యక్రమాన్ని ప్రగతి నగర్ మున్నూరుకాపు సంఘంలో నిర్వహించనున్నారు.
Also Read: Delhi Blast Case: ఢిల్లీ బ్లాస్ట్ కేసులో దొరికిన సహకుట్రదారుడు.. సంచలనాలు వెలుగులోకి
మున్నూరుకాపు సంఘాలతో..
మున్నూరుకాపు సంఘం జిల్లా అధ్యక్షుడిగా మాజీ మేయర్ ధర్మపురి సంజయ్(Dharmapuri Sanjay) ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇటీవల నగరంలోని మున్నూరుకాపు సంఘాలతో జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ సందర్భంగా మాజీ మేయర్ ధర్మపురి సంజయ్ మాట్లాడుతూ.. నగరంలోని ప్రగతి నగర్ మున్నూరుకాపు సంఘంలో ఆదివారం ప్రమాణస్వీకార కార్యక్రమం జరుగనుందని తెలిపారు. మున్నూరుకాపు సంఘా సభ్యులందరూ తప్పనిసరిగా కార్యక్రమానికి హాజరు కావాలని ఆయన కోరారు.
Also Read: Local Body Elections: లోకల్ ఫైట్‌లో కాంగ్రెస్ మెగా ప్లాన్.. స్వయంగా సీఎం రేవంత్ మానిటరింగ్..!

