Delhi Blast Case: ఢిల్లీ బాంబు పేలుడు కేసులో (Delhi Blast Case) షాకింగ్ విషయాలు బయటపడుతున్నాయి. 14 మందిని పొట్టనబెట్టుకున్న ఈ బాంబు పేలుడు కేసు విచారణలో భాగంగా జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ (NIA) బృందం మూడు రోజులక్రితం అరెస్ట్ చేసిన ఉగ్రవాదికి సంబంధించిన కీలక విషయాలు బయటపడ్డాయి. కశ్మీర్‌లోని (Kashmir) శ్రీనగర్‌లో జసీర్ బిలాల్ వాణీ, అలియాస్ డానిష్‌ను అనే తీవ్రవాదిని అదుపులోకి తీసుకుంది. అనంతనాగ్ జిల్లా, ఖాజీగుండ్‌కు చెందిన ఈ నిందితుడు, ఢిల్లీ దాడి వెనుక క్రియాశీలక సహ-కుట్రదారుడిగా వ్యవహరించినట్టు ఎన్ఐఏ అధికారులు గుర్తించారు. ఢిల్లీ బ్లాస్ట్‌కు పాల్పడ్డ టెర్రరిస్ట్ ఉమర్ ఉన్ నబీతో కలిసి ఉగ్రదాడిని ప్లాన్ చేయడంలో కీలకంగా వ్యవహరించాడని ఎన్ఐఏ వర్గాల సమాచారం. జసిర్ ఢిల్లీ పేలుడు కుట్రలో పాల్గొనడమే కాకుండా, ఫిదాయీన్ (ఆత్మాహుతి) దాడికి సిద్ధంగా ఉన్నాడు. ఈ మేరకు ఉమర్ నుంచి ఆదేశాన్ని పొందాడు.
Read Also- Sheikh Hasina: షేక్ హసీనాకు మరణశిక్ష.. ఢాకా కోర్టు సంచలన తీర్పు
వీరిద్దరూ కశ్మీర్‌లోని ఒక మసీదులో తొలిసారి కలుసుకున్నారని, అక్కడ డాక్టర్ ఉమర్ అతడిని బ్రెయిన్‌వాష్ చేసి ఆత్మాహుతి దాడికి సిద్ధం కావాలని ఆదేశించాడని ఎన్‌ఐఏ దర్యాప్తులో బయటపడింది. ఎర్రకోట సమీపంలో జరిగిన కారు బాంబు పేలుడుకు ముందు, డ్రోన్‌లలో మార్పులు చేయడం, రాకెట్లను తయారు చేయడానికి జసిర్ ప్రయత్నించాడు. తద్వారా ఉగ్రదాడులకు టెక్నికల్ సహకారం కూడా అందించాడని ఎన్‌ఐఏ ప్రాథమిక విచారణలో వెల్లడైంది. మూడు రోజుల క్రితం జమ్మూ కశ్మీర్ పోలీసులు జసీర్‌ను అదుపులోకి తీసుకున్నాయి. ఈ నేపథ్యంలో అతడి తండ్రి అనూహ్య రీతిలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. డ్రై-ఫ్రూట్స్ విక్రయించే ఆయన ఆదివారం కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుని చనిపోయాడు.
Read Also- Crime News: భార్య తలపై రోకలిబండతో కొట్టి చంపిన భర్త.. కారణం ఏమిటో తెలుసా?
ప్రతి లింకుపై ఆరా
ఢిల్లీ పేలుడు కుట్రలో ప్రమేయం ఉన్న ప్రతి లింకును ఛేదించేందుకు ఎన్ఐఏ అధికారులు ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగా ఎన్‌ఐఏ ఇప్పటివరకు గాయపడిన వారితో పాటు అనేకమంది సాక్షులను విచారించింది. ఢిల్లీ పోలీసులు, జమ్మూ కశ్మీర్ పోలీసులు, హర్యానా పోలీసులు, ఉత్తరప్రదేశ్ పోలీసులు, ఇతర కేంద్ర ఏజెన్సీలతో కలిసి ఎన్ఐఏ పనిచేస్తోంది. ఉగ్ర కుట్రలో దొరికిన ఇద్దరు కుట్రదారుల కంటే నెట్‌వర్క్ విస్తృతంగా ఉందని అధికారులు అనుమానిస్తున్నారు. ఈ క్రమంలోనే దర్యాప్తు ముందుకు సాగుతున్నా కొద్దీ మరిన్ని అరెస్టులు జరిగే అవకాశం కనిపిస్తోంది. ఎన్‌ఐఏ వర్గాల ప్రకారం, ప్రస్తుతం ప్రాధాన్యత ఈ దాడి వెనుక ఉన్న పెద్ద నెట్‌వర్క్‌ను గుర్తించడం. ప్రణాళిక, లాజిస్టిక్స్, నిధులు సమకూర్చిన వారిని గుర్తించడం, ఈ విధంగా బాంబు దాడికి బాధ్యులైన ప్రతి ఒక్కరినీ గుర్తించి న్యాయస్థానం ముందు నిలబెట్టాలనేది ఎన్ఐఏ లక్ష్యంగా ఉంది.
