iBOMMA: ఐబొమ్మ ఇమ్మడి రవి మనస్తత్వం పై పోలీసుల విశ్లేషణ చేశారు. కాలేజీ రోజుల నుంచి పెళ్లి వరకు అతను ఎన్నో అవమానాలు పడ్డాడు. ఇక ఇలా కాదులే అని, ఎలా అయినా డబ్బు సంపాదించి అందరికీ గట్టిగా చెప్పాలని ఫిక్స్ అయ్యాడు. అలా తక్కువ సమయంలోనే ఎక్కువ డబ్బు సంపాదించాలని డబ్బు మీదే మాత్రమే ఫోకస్ పెట్టాడు.
హైక్లాస్ అమ్మాయితో 2016 లో రవి లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు. పెళ్లి తర్వాత రవి సంపాదనపై భార్య సెటైర్లు వేసింది. అసలు నీ వల్ల ఏది కాదు.. నీకు డబ్బు సంపాదించడం కూడా రాదంటూ.. భార్యతో పాటు అత్త కూడా హేళన చేసింది. ఈ అవమానాలు భరించలేక వెబ్ డిజైనర్ గా తనకున్న అనుభవంతో ఇబొమ్మను రూపొందించాడు. నా భార్య, అత్త.. వాళ్ల బాధ ఒత్తిడి చూడలేక నా వెబ్ డిజైన్ అనుభవంతో నేను ఐ బొమ్మ వెబ్ సైట్ ను ప్రారంభించాను. ఐ బొమ్మ ద్వారా సినిమా ప్రింట్లను అందులో పోస్ట్ చేసేవాడిని. 2021 రెండో కోవిడ్ సమయంలో లో నా ఐ బొమ్మ వెబ్సైట్ కు విపరీతమైన ఆదరణ వచ్చింది. ఒక సమయంలో నా మొదటి సంపాదన బెట్టింగ్ యాప్స్, లోన్ యాప్స్ ద్వారా నేను సంపాదించిన డబ్బు అక్షరాల 75 లక్షలు అని చెప్పినట్లు సమాచారం.
పోలీసులు మాట్లాడుతూ ” ఇమ్మడి రవి బ్యాంక్ అకౌంట్స్ అన్ని వెరిఫై చేశాము. ఇతనిఫొటో వేరే వాళ్ళతోటి, కొన్ని డ్రైవింగ్ లైసెన్స్ , పాన్ కార్డ్స్ తీసుకోవడం, అకౌంట్స్ ఓపెన్ చేయడం ఇలాంటివి బయటకు వచ్చాయి. అకౌంట్స్ చూస్తే.. కోట్లు ఉన్నాయి. ప్రతి నెలా 10 నుంచి 15 లక్షలు ఇతని అకౌంట్ లో క్రెడిట్ అవుతున్నాయి. రవి ట్రావెల్ హిస్టరీ చూస్తే.. ప్రతి రెండు నెలలకొకసారి యూరప్ కి వెళ్లడం, ఇతర దేశాలు తిరగడం ఇవన్నీ వెలుగులోకి వచ్చాయి. ఇక ఇతనే మెయిన్ అని ఉంటాడని మాకు అనిపించింది. ఎందుకంటే, ఇతని కన్నా మేము ముగ్గుర్ని తీసుకోవచ్చాము. అయితే, వారిలో ఇంత కీ రోల్ కనిపించలేదు. ఇక సూత్రధారి ఎవరా అని చూస్తే.. ఇమ్మడి రవి అని పలు అనుమానాలు వచ్చి అన్ని వెరిఫై చేశాము. అతను ఇక్కడ లేడు అనగానే ఎలాగా అని ఆలోచిస్తున్న సమయంలో అతనే ఇండియాకి వచ్చాడు. పైరసీ ముప్పు ఎలా ఉంటుందంటే ప్రజలు చూస్తున్న రోజులు ఇల్లీగల్ గా చాలా మంది డబ్బు సంపాదిస్తూనే ఉంటారు. ఆ పైరసీని ఆపలేము. దొంగతనాలు ఎలా జరుగుతాయో? ఇవి కూడా డిజిటల్ గా జరుగుతూనే ఉంటాయని ” చెబుతున్నారు.

