Gadwal District: గద్వాల నియోజకవర్గ ఎన్నికల హామీలలో భాగంగా కేవలం ఆ హామీల అమలు కాగితాలకే పరిమితం కాకుండా గట్టు ఎత్తిపోతల పథకం పనులు ఎట్టకేలకు 2018లో ప్రారంభమయ్యాయి. 30% పనులు పూర్తయ్యాక మిగిలిన మెజార్టీ పనులలో జాప్యం జరగడంతో గట్టు, కేటి దొడ్డి మండలాల ప్రజల చిరకాల వాంఛ అయిన నల్ల సోమనాద్రి ఎత్తిపోతల పథకం పనుల పురోగతిపై అసంతృప్తితో ఉన్నారు. నీటి కోసం మరికొన్ని సంవత్సరాలు ఆగాల్సిందేనా అని అయోమయంలో ప్రజలు ఉన్నారు.
గట్టు ఎత్తిపోతల పథకానికి ప్రభుత్వం 580 కోట్లు
1.32 సామర్థ్యం నుంచి అదనపు సామర్ధ్యాలు పెంపు ప్రక్రియ చేపట్టడంతో పనులు నిలిచిపోయాయి. ప్రస్తుత పనుల జాప్యం నిధుల మంజూరులో ఆలస్యం అవడంతో పథకం పూర్తికి మరికొన్ని సంవత్సరాలు పట్టే అవకాశం ఉంది. గట్టు ఎత్తిపోతల పథకానికి ప్రభుత్వం 580 కోట్లతో పరిపాలన అనుమతులు ఇవ్వగా 328 కోట్లకు పథకాన్ని పూర్తి చేసేందుకు కాంట్రాక్టర్ టెండర్ దక్కించుకున్నారు. ఈ నేపథ్యంలో 2018లో అప్పటి సీఎం కేసీఆర్ గట్టు ఎత్తిపోతల పథకానికి శంకుస్థాపన చేసి రెండేళ్లలో నిర్మాణాన్ని పూర్తికి హామీని ఇచ్చారు. 1.32 టీఎంసీల సామర్థ్యంతో చేపడుతున్న జలాశయం పనులు మొదలవగా దానికి అనుసంధానంగా అప్రోచ్ పనులు సైతం కొంతమేర పూర్తయ్యాయి.
సామర్థ్యం పెంపుతో పనుల ఆలస్యం
గట్టు ఎత్తిపోతల పథకాన్ని 1.32 సామర్థ్యంతో పనులు చేపట్టగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక గత సంవత్సరం సెప్టెంబర్ లో మంత్రులు ఉత్తంకుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి గట్టు రిజర్వాయర్ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా వరదల సమయంలో కృష్ణ నీటిని జిల్లాలో సాగుపరంగా వెనుకబడిన గట్టు, కేటి దొడ్డి మండలాలలో మెట్ట పొలాలకు సాగునీరుని అందించాలని లక్ష్యంతో ఎమ్మెల్యే కృష్ణ మోహన్ రెడ్డి గట్టు రిజర్వాయర్ సామర్థ్యాన్ని పెంచేందుకు సహకరించాలని మంత్రులను కోరారు. ఈ మేరకు మూడు నుంచి ఐదు టీఎంసీల సామర్థ్యంతో స్థానిక భౌగోళిక పరిస్థితులను అంచనా వేసి డిపిఆర్ సిద్ధం చేయాలని ఇంజనీరింగ్ శాఖ అధికారులను ఆదేశించారు.
నిలిచిన పనులు
గట్టు ఎత్తిపోతల పథక పనుల పురోగతి గత కొన్ని నెలలుగా నిలిచిపోయింది. ఇప్పటికే కొద్ది మీద జలాశయం పనుల నిర్మాణంతోపాటు ఆనకట్ట అప్రోచ్ కెనాల్ పనులు చేపట్టారు. ఇటీవల మంత్రుల పర్యటన అనంతరం సామర్థ్యం పెంపు ప్రతిపాదనలు రావడంతో పనులు ఆపేశారు. గట్టు ఎత్తిపోతల పథకం రీ డిజైనింగ్ ప్రక్రియ పూర్తి కావలసి ఉండడంతో పాటు చేసిన పనులకు పెండింగ్ బిల్లులకు నిధులు మంజూరు కోసం ప్రయత్నిస్తున్నారు. ర్యాలంపాడు రిజర్వాయర్ నుంచి ఆలూరు సమీపంలో పంప్ హౌస్ నిర్మాణం ద్వారా అప్రోచ్ కెనాల్ గుండ నీటిని ఎత్తిపోతల పథకానికి తరలించే ప్రక్రియపై ఇంజనీరింగ్ అధికారులు డిపిఆర్ ను సిద్ధం చేసే ప్రక్రియను చేపడుతున్నారు. త్వరలో డిపిఆర్ సిద్ధమై సెంట్రల్ డిజైనింగ్ ఆర్గనైజేషన్ పరిశీలన అనంతరం ప్రభుత్వానికి పంపే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ప్రాజెక్టు పనులు మరింత ఆలస్యమయ్యే అవకాశం ఉందని ప్రాజెక్టుపై ఆశలు పెట్టుకున్న గట్టు, కేటి దొడ్డి మండలం ప్రజలు అభిప్రాయపడుతున్నారు.
ప్రతిపాదనలు రూపొందిస్తున్నాం : ఎస్ ఈ రహీముద్దీన్
గట్టు ఎత్తిపోతల పథకానికి సంబంధించి 1.32 టీఎంసీల సామర్థ్యంతో పనులు చేపట్టగా ఇటీవల మంత్రుల సూచనతో సామర్ధ్య పెంపుపై అంచనాలను రూపొందించే ప్రక్రియ చేపడుతున్నాం. పూర్తిస్థాయిలో అధ్యయనం తర్వాత ఎన్ని టీఎంసీల మేర సిద్ధం చేయాలనే దానిపై కసరత్తు తర్వాత ప్రభుత్వానికి నివేదిస్తాం.
Also Read: Gadwal District: షాప్ ముందు వాహనాల ఫోటో తీయొద్దన్నందుకు షాప్ యజమానిపై ఎస్సై దాడి..!
