Gadwal District: గద్వాలలో డ్రంక్ అండ్ డ్రైవ్ వైన్ షాప్ సమీపంలో నిర్వహిస్తుండగా సమీపంలోని షాపుల ముందు నిలిపిన వాహనాల ఫోటోలను ఓ కానిస్టేబుల్ తీస్తుండగా పెస్టిసైడ్స్ యజమాని దుకాణం ముందు ఉన్న వాహనాల ఫోటోలు తీయొద్దన్నందుకు ఎస్సై కలగజేసుకోని దురుసుగా మాట్లాడడంతో షాప్ సిబ్బంది రోడ్డుపై ధర్నా నిర్వహించారు గద్వాల(Gadwala)లోని కొత్త బస్టాండ్ ముందున్న ఓ వైన్ షాప్ సమీపంలో పట్టణ ఎస్ఐ కళ్యాణ్ కుమార్(SI Kalyan Kumr) డ్రంక్ అండ్ డ్రైవ్(Drunk An Drive) నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో అటుగా వచ్చే వాహనాలను నిలిపి టెస్టులు నిర్వహిస్తున్నారు. అంతేగాక పక్కనే ఉన్న షాప్ ల ముందు నిలిపిన వాహనాలను ఫోటో తీయడంతో గొడవ మొదలైంది.
ఎస్సై కళ్యాణ్ కుమార్..
షాప్ కు వచ్చిన వారి వాహనాల ఫోటోలు తీయడం సబబు కాదని పెస్టిసైడ్స్ షాప్(Pesticides Shop) యజమాని ఓ కానిస్టేబుల్ కి సూచిస్తుండగా, నిబంధనల ప్రకారం తమ పని తాము చేసుకోపోతామని బదులిస్తున్నాడు. ఇలా చేస్తే కస్టమర్లు షాప్ లోకి ఎలా వస్తారని, ఓ కంపెనీ ఉద్యోగి షాప్ లో మాట్లాడుతుండగా ఇలా ఫోటోలు తీయడం సబబు కాదని ఆ కానిస్టేబుల్ తో వాదిస్తున్నాడు. గమనించిన ఎస్సై కళ్యాణ్ కుమార్ షాప్ యజమానితో తెలుసుగా మాట్లాడుతూ ఏం పీక్కుంటావో పీక్కో అని దురుసుగా మాట్లాడుతూ అతనిని తోచుకుంటూ గద్వాల పట్టణ పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ నేపథ్యంలో ఆగ్రహించిన దుకాణ సిబ్బంది రోడ్డుపై కూర్చొని నిరసన తెలిపారు. అక్రమంగా తమను దూషిస్తూ మా షాప్ యజమానిని పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లడంలో ఎస్సై అత్యుత్సాహం చూపారని, ఎందుకు ఫోటోలు తీశారని ఒక సిటిజన్ గా అడిగినందుకు ఎస్సై ఇస్టారీతిగా మాట్లాడడం శోచనీయమని సిబ్బంది వాపోయారు.
Also Read: Bill Gates cameo: ఆ సీరియల్‌లో నటించబోతున్న ప్రపంచ కుబేరుడు.. ఎందుకంటే?
విడుదల చేయాలని డిమాండ్..
పక్కనే వైన్ షాప్ ఉందని దానికి అనుబంధంగా పర్మిట్ రూమ్ ఉండడంతో ఎక్కువ వాహనాలు ఇక్కడ పార్క్ అవుతున్నాయని, వాటిని నియంత్రించకుండా రోజు రోజుకి రోడ్లను ఆక్రమించుకొని దుకాణాలు నిర్వహిస్తున్నా,చర్యలు తీసుకోకుండా తమపై అకారణంగా దాడి చేసిన ఎస్సై బేషరతుగా క్షమాపణ చెప్పి షాపు నిర్వాకుడిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు పలువురు డిఎస్పీని కలిసి జరిగిన ఘటనను వివరించారు. ఇందుకు సానుకూలంగా స్పందించిన డి.ఎస్.పి మొగులయ్య ఎస్సై తో జరిగిన ఘటనను తెలుసుకొని అదుపులోకి తీసుకున్న వ్యక్తిని పంపాలని సూచించారు. ట్రాఫిక్ నియంత్రణలో భాగంగా పోలీసులకు సహకరించాలని సూచించారు.
Also Read: Transport Department: రవాణా శాఖలో కొత్త సంస్కరణలు.. ఎన్ఫోర్స్‌మెంట్ టీంల ఏర్పాటు సిద్ధం!
