Damodar Rajanarsimha: నార్త్ తెలంగాణకు క్యాన్సర్ సెంటర్ను తీసుకొస్తామని, అదేవిధంగా అభయ మార్పిడి చేసేందుకు ఆసుపత్రుల్లో సౌకర్యాలు కల్పిస్తామని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ(Damodar Rajanarsimha) వెల్లడించారు. మహబూబాబాద్ జిల్లా(Mahabubabad District)కేంద్రంలోని స్థానిక మెడికల్ కళాశాలలో రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డి,(Pongileti Srinivas Reddy) సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, అటవీశాఖ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, డిప్యూటీ స్పీకర్, డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ జాటోత్ రామచంద్రనాయక్, మహబూబాబాద్ ఎంపీ కోరిక బలరాం నాయకులతో కలిసి 50 పడకల ఆసుపత్రి, క్రిటికల్ కేర్ యూనిట్ 50 బెడ్స్, బాయ్స్ అండ్ గర్ల్స్ హాస్టల్స్ ను వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ప్రారంభించారు. రూ. 250 కోట్లతో 350 పడకల ఆసుపత్రి నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అంతకుముందు వైద్య విద్యార్థులతో వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఇంటరాక్షన్ కార్యక్రమం నిర్వహించారు.
Also Read: PM Modi: నా తల్లిని తిట్టారు.. నన్ను అవమానించారు.. ప్రధాని ఎమోషనల్
16 నర్సింగ్ కాలేజీలు
విద్యార్థులకు ఉన్న సమస్యలను తెలుసుకొని పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా మహబూబాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ భూక్య మురళి నాయక్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో వైద్య ఆరోగ్యశాఖ మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో నిరుద్యోగ యువతుల కోసం ఉపాధి కల్పించేందుకు సీఎం రేవంత్ రెడ్డి 16 నర్సింగ్ కాలేజీలను ఏర్పాటు చేశారన్నారు. ఒక్కొక్క కళాశాలలో 60 మందికి శిక్షణ అనంతరం జపాన్, జర్మనీ, ఆస్ట్రేలియా లలో ఉద్యోగాలు పొందేందుకు రూ.100 కోట్లతో భాష ప్రావిణ్యం శిక్షణ కోసం ప్రభుత్వం ఖర్చు చేస్తుందన్నారు.గత తెలంగాణ ప్రభుత్వం మెడికల్ కళాశాలలో ప్రారంభించి అభివృద్ధిని మరిచిందని విమర్శించారు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని మెడికల్ కళాశాలలో సౌకర్యాలు ఏర్పాటు చేయడంపైనే ప్రభుత్వం దృష్టి సారించింది అన్నారు. గత ప్రభుత్వం మెడికల్ కళాశాలలో ఇలాంటి సౌకర్యాలు లేకుండానే శాంక్షన్ చేయించిందని ఆరోపించారు.
213 అంబులెన్స్లను మంజూరు
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కాంప్రమైజ్ కాకుండా అన్ని రకాల వసతులను మెడికల్ కళాశాలలో కల్పించేందుకు కృషి చేస్తుందన్నారు. సీఎం రేవంత్ రెడ్డి 213 అంబులెన్స్లను మంజూరు చేయించారని తెలిపారు. తద్వారా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అత్యవసర సేవల కోసం ప్రతి 13 నిమిషాలకు ఒకసారి రోగులకు ఆంబులెన్సులు అందుబాటులోకి వస్తున్నాయని వెల్లడించారు. జాతీయ రహదారులకు అతి సమీపంలో ట్రామాకేర్ సెంటర్ లను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం ప్రణాళిక రచిస్తోందన్నారు. వైద్యులు మానవత్వంతో రోగులకు సేవలు అందించాలని సూచించారు. గిరిజన ప్రాంతాల్లో ఉన్న ఆసుపత్రుల్లో అన్ని రకాల సౌకర్యాలను కల్పించడమే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తుందని వివరించారు.
రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ…కాంగ్రెస్ ప్రభుత్వంలో విద్యా వైద్యానికి పెద్దపీట వేస్తుందన్నారు. ప్రజలు కాంక్షించిన మేరకే ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేందుకు ప్రజా పాలన ప్రభుత్వం కృషి చేస్తుందని వెల్లడించారు. మెడికల్ కళాశాలను సాంక్షన్ చేసి నామమాత్రంగా గత ప్రభుత్వం ప్రారంభిస్తే… కాంగ్రెస్ ప్రభుత్వం మెడికల్ కళాశాలలో అన్ని రకాల సౌకర్యాలను కల్పిస్తూ పూర్తిచేసేందుకు అహర్నిశలు కృషి చేస్తుందన్నారు.
రైతులకు సహకారం చేయడమే లక్ష్యం
రాబోయే ఆరు నెలల్లో మెడికల్ కాలేజీల్లో అన్ని రకాల వసతులను అందుబాటులోకి తీసుకొచ్చి విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా తొలగిస్తామన్నారు. తెలంగాణ రైతాంగం యూరియా పెద్ద సమస్యగా భావిస్తున్నారని, సంయమనం పాటించాలని సూచించారు. 18 వందల టన్నుల యూరియా రాష్ట్రానికి దిగుమతి అవుతుందని రాష్ట్రంలో ఉన్న రైతులకు యూరియాను సరఫరా చేస్తామని హామీ ఇచ్చారు. తెలంగాణకు రావాల్సిన యూరియా కోట విషయంలో తెలంగాణ మంత్రుల బృందం కేంద్రానికి వెళ్లి విజ్ఞప్తి చేయనున్నట్లు తెలిపారు. రైతన్నలను రెచ్చగొట్టే ప్రయత్నం బీఆర్ఎస్ నాయకులు చేస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం అన్నది అన్నట్లుగా రైతులకు సహకారం చేయడమే లక్ష్యంగా పనిచేస్తుందన్నారు. అభివృద్ధి, సంక్షేమం కాంగ్రెస్ ప్రభుత్వానికి రెండు కళ్ళలాంటివన్నారు. వైద్య కళాశాలలో పోస్టింగ్స్, ప్రమోషన్స్ ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూస్తామని హామీ ఇచ్చారు.
Also Read: Mee Seva New Service: మీ సేవ పరిధిలోకి కొత్త సేవలు.. నిమిషాలలో ఈ సర్టిఫికెట్ జారీ
సీఎం సలహా దారు వేం నరేందర్ రెడ్డి మాట్లాడుతూ..హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ పై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించి అభివృద్ధి చేస్తుందన్నారు. మల్యాల లో హార్టికల్చరల్ కళాశాల నిర్మాణం కోసం మొత్తం 70 ఎకరాలకు గాను ఇప్పటికే 25 ఎకరాలను హ్యాండోవర్ చేసామన్నారు. గత ప్రభుత్వం మెడికల్ కళాశాలలో పేరుకే శాంక్షన్ చేసిందని 20 నెలల నుండి మెడికల్ కళాశాలల అభివృద్ధి కోసం ప్రభుత్వం నిర్విరామ కృషి చేస్తుందని వివరించారు. ఏడాదిలో ఫుల్ ఇన్ఫాస్ట్రక్షన్ అందుబాటులోకి వస్తుందని తెలిపారు.
అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ… అడ్డదిడ్డంగా గత బీఆర్ఎస్ ప్రభుత్వం మెడికల్ కళాశాలను సాంక్షన్ చేసి వదిలేశారని దుయ్యబట్టారు. విద్యార్థుల సమస్యలను తీర్చడంలో గత ప్రభుత్వం పూర్తిగా విఫలం చెందిందని విమర్శించారు. అరకొర వసతులతో ఉన్న మెడికల్ కళాశాలల ఇబ్బందులను గుర్తించి కాంగ్రెస్ ప్రభుత్వం వాటన్నింటిని పరిష్కరించేందుకు కృషి చేస్తుందన్నారు.మంచి వాతావరణం లో విద్యను అభ్యసించేలా కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తుందన్నారు.
డిప్యూటీ స్పీకర్ రామచంద్ర నాయక్ మాట్లాడుతూ… నీళ్లు, నిధులు, నియామకాలు పేరుతో కల్వకుంట్ల కుటుంబం తెలంగాణ రాష్ట్రాన్ని ఆర్థిక దెబ్బ కొట్టిందన్నారు. జిల్లాకు మంత్రి కాపాడుకోవాలని దురుద్దేశంతో మెడికల్ కాలేజీ లను శాంక్షన్ చేసి మరిచిందన్నారు. అభివృద్ధి చేయకుండా విద్యార్థులను అఘమ్యాగోచరంలోకి నెట్టేసి వదిలేసిందన్నారు. గిరిజన ప్రాంతంలో పీజీ వైద్య కళాశాలను మంజూరు చేసి విద్యార్థులకు వైద్య విద్యను అందించాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహకు విజ్ఞప్తి చేశారు. డోర్నకల్, మరిపెడ మండల కేంద్రాల్లో 50, 100 పడకల ఆసుపత్రులను మంజూరు చేసినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈఎన్టి, అప్తాల్మాలజి, డెంటల్ వైద్య విద్యను సైతం మెడికల్ కళాశాలలోకి అందుబాటులోకి తీసుకురావాలన్నారు. ఇంటెన్సీ కేర్ యూనిట్లను డెవలప్మెంట్ చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పాలకుర్తి కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి ఝాన్సీ రెడ్డి, జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్, ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్, అదనపు కలెక్టర్లు లెనిన్ వత్సవ్ టోప్పో, అనిల్ కుమార్, ప్రిన్సిపాల్, ఆస్పత్రుల సూపరింటెండెంట్ లు పాల్గొన్నారు.
Also Read: Khammam Rains: ఆ జిల్లాలో భారీ వర్షాలు జలమయమైన రోడ్లు.. అత్యవసరమైతే తప్పా ప్రయాణాలు చేయవద్దు