PM Modi (Image Source: Twitter)
జాతీయం

PM Modi: నా తల్లిని తిట్టారు.. నన్ను అవమానించారు.. ప్రధాని ఎమోషనల్

PM Modi: బిహార్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ.. అక్కడి మహిళలను ఉద్దేశించి వర్చువల్ గా మాట్లాడారు. ఈ సందర్భంగా చనిపోయిన తన తల్లి గురించి ప్రస్తావించిన మోదీ.. రాహుల్ నాయకత్వంలోని కాంగ్రెస్, తేజస్వీ యాదవ్ అధినేతగా ఉన్న ఆర్జేడీ పార్టీలపై సంచలన ఆరోపణలు చేశారు. కాంగ్రెస్ – ఆర్జేడీ ఆధ్వర్యంలో నిర్వహించిన సభలో తన తల్లిని దూషించారంటూ ప్రధాని మోదీ ఆవేదన వ్యక్తం చేశారు. అదే సమయంలో తనను దుర్బాషలాడారని పేర్కొన్నారు.

‘ప్రతీ తల్లి, చెల్లిని అవమానించారు’
20 లక్షల మంది బిహార్ మహిళలతో ప్రధాని వర్చువల్ మాట్లాడుతూ ‘బిహార్‌లో కాంగ్రెస్ – ఆర్జేడీ వేదిక నుంచి నా తల్లిపై దుర్భాషలు వాడారు. ఈ దూషణలు నా తల్లినే కాదు దేశంలోని ప్రతి తల్లి, చెల్లిని అవమానించాయి. ఈ విషయాన్ని విన్న తరువాత మీరు కూడా నా అంతే బాధపడతారని తెలుసు’ అని మోదీ అన్నారు. తన తల్లి హీరాబెన్ మోదీ పేదరికంతో పోరాడి తనను, సోదరులను పెంచిందని మోదీ అన్నారు. ‘నా తల్లి అనారోగ్యంగా ఉన్నప్పుడూ పని చేసేది. మాకు కొత్త బట్టలు కొనేందుకు ప్రతి పైసా పొదుపు చేసేది. మన దేశంలో కోట్లాది తల్లులు అలానే ఉన్నారు. తల్లి స్థానం దేవుళ్లకన్నా గొప్పది’ అని ప్రధాని అన్నారు.

‘నాపై వాడిన దుర్భాషల జాబితా పెద్దది’
కాంగ్రెస్–ఆర్జేడీ వేదికపై వాడిన దుర్భాషలు తన తల్లినే కాదు, కోట్లాది తల్లులు, చెల్లెళ్లకు సంబంధించినవేనని మోదీ అన్నారు. ‘రాజవంశాల్లో పుట్టిన యువరాజులు పేద తల్లుల కష్టాలు, వారి పిల్లల పోరాటాలు అర్థం చేసుకోలేరు. వీళ్లు బంగారం – వెండి చెంచాలతో పుట్టారు. బిహార్‌లో అధికారం వారి కుటుంబానికే చెందాలని భావిస్తున్నారు. కానీ మీరు పేద తల్లి కుమారుడిని ఆశీర్వదించి ప్రధాన మంత్రిని చేశారు. దానిని నామ్‌దార్లు జీర్ణించుకోలేకపోతున్నారు’ అని రాహుల్ గాంధీ, తేజస్వీ యాదవ్‌లను ఉద్దేశిస్తూ ప్రధాని పరోక్షంగా విమర్శించారు. ‘నాపై వారు వాడిన దుర్భాషల జాబితా పెద్దది. నన్ను నీచ్ (తక్కువ స్థాయి వాడు), గందినాళీ కీడా (అసహ్యమైన పురుగు), పాము అని సంభోదించారు. ఇప్పుడు రాహుల్ గాంధీ సభలో నన్ను తూ అని అన్నారు’ అని మోదీ ఆరోపించారు.

మోదీ తల్లిని నిజంగానే తిట్టించారా?
బిహార్‌లోని దర్బంగా జిల్లాలో రాహుల్ గాంధీ, తేజస్వి యాదవ్ ఫొటోలు ఉన్న వేదికపై నుంచి కొందరు యువకులు మోదీని, అతడి తల్లిని దూషిస్తున్న వీడియో ఇటీవల తీవ్ర దుమారం రేపింది. కొంతమంది కాంగ్రెస్ కార్యకర్తలు సైతం ఆ వీడియోలో కనిపించారు. దీంతో ఈ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించింది. ‘ఇది రాజకీయాల్లో దిగజారుడుతనానికి కొత్త ఉదాహరణ. అవమానం, ద్వేషం, నీచత్వానికి పరాకాష్ట. రాహుల్, తేజస్వీ 1000 సార్లు క్షమాపణలు చెప్పినా బిహార్ ప్రజలు క్షమించరు. ఇది అత్యంత అవమానకరం’ అని బీజేపీ ఎక్స్‌లో పేర్కొంది. తాజాగా ఇదే విషయాన్ని ఉద్దేశిస్తూ మోదీ ప్రసంగించడం గమనార్హం.

కాంగ్రెస్ రియాక్షన్
అయితే ప్రధాని మోదీపై యువకులు చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ నేత పవన్ ఖేరా సైతం ఖండించారు. ‘బీజేపీ ఏజెంట్లు కాంగ్రెస్ సభలోకి వచ్చి దుర్భాషలు మాట్లాడారు. మా యాత్ర వల్ల వారు విసుగుచెందారు. దృష్టి మళ్లించేందుకు ఇలా చేస్తున్నారు’ అని అన్నారు. యువకులు మాట్లాడుతున్నప్పుడు కాంగ్రెస్, ఆర్జేడీ నాయకులైన రాహుల్ గాంధీ, తేజస్వీ యాదవ్ వేదికపై లేరని పేర్కొన్నారు. బీజేపీ రాజకీయ లాభం కోసం ఈ అంశాన్ని పెద్దదిగా చేసి చూపుతోందని ఖేరా మండిపడ్డారు.

Also Read: Kavitha Suspended: పెను సంచలనం.. బీఆర్ఎస్ నుంచి కవిత ఔట్.. అధికారిక ప్రకటన విడుదల

‘ఓట్ల కోసం తల్లి ప్రస్తావన’
ఆర్జేడీ నేత మృత్యుంజయ్ తివారీ మాట్లాడుతూ ‘ప్రధాని ఓటు కోసం తన తల్లి పేరును వాడుతున్నారు. తల్లి పేరుతో రాజకీయాలు చేయకూడదు. ప్రధాని తల్లిని గౌరవిస్తాం. కానీ రాజకీయ ప్రయోజనాల కోసం వాడకూడదు. రాహుల్ గాంధీ తల్లిని అవమానించినప్పుడు ఎందుకు మౌనం వహించారు?’ అని అన్నారు. కాంగ్రెస్ నేత ఉదిత్ రాజ్ కూడా ‘ప్రధాని తన తల్లిని రాజకీయాల కోసం వాడుకుంటున్నారు’ అని ఆరోపించారు.

Also Read: Uttar Pradesh: బాలికను వెంటాడుతున్న పాము.. 40 రోజుల్లో 9 సార్లు కాటు.. అంతుచిక్కని మిస్టరీ!

Just In

01

Kurnool Bus Accident: కర్నూలు బస్సు ప్రమాద ఘటనలో ట్విస్ట్.. చనిపోయిన వ్యక్తిపై కేసు.. ఏం జరగబోతోంది?

Drinking Culture: మందు బాబులు మద్యం సేవించిన తర్వాత ఎందుకు ఎక్కువగా తింటారో తెలుసా?

Bigg Boss Telugu 9: సంజన నోటికి లాక్.. క్లౌడ్ గేమ్ షురూ.. మేఘం వర్షిస్తేనే సేఫ్, లేదంటే?

Biggest Scams in India: భారతదేశాన్ని కుదిపేసిన అతిపెద్ద స్కామ్స్ ఇవే..

Napoleon Returns: జంతువు ఆత్మతో కథ.. ‘నెపోలియన్ రిటర్న్స్’ టైటిల్ గ్లింప్స్ అదిరింది