Mahesh Kumar Goud (imagecredit:swetcha)
నార్త్ తెలంగాణ

Mahesh Kumar Goud: సంక్షేమం అభివృద్ధి రెండు కళ్లలాంటివి.. మహేష్ కుమార్ గౌడ్

Mahesh Kumar Goud: వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 100 సీట్లు గెలిచి మళ్ళీ అధికారంలోకి వస్తుందని, పీ సీ,సి,అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్,జిల్లా ఇన్చార్జి మంత్రి వివేక్ వెంకటస్వామి లు పేర్కొన్నారు. మెదక్ జిల్లా కేంద్రంలో బీజేపీ, బిఆర్ఎస్ పార్టీల నుండి పలువురు నేతలు కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో పీసిసి,చీఫ్, మహేష్ కుమార్ గౌడ్, మంత్రి వివేక్ వెంకటస్వామి మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో 100 సీట్లు గెలిచి మళ్ళీ తానే అధికారం అధికారంలోకి వస్తామని పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు. వివిధ పార్టీల నుండి కాంగ్రెస్ పార్టీలో చేరిన అనంతరం ఆయన మాట్లాడారు. తెలంగాణలో భూములను దోచుకుంది కేసీఆర్ ఫ్యామిలీ అన్నారు. ఏడున్నర లక్షల కోట్లు అప్పుచేసి ఖజానా ఖాళీ చేసి ఫామ్ హౌస్ లో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నిద్రపోతున్నాడని ఎద్దేవ చేశారు.

రాష్ట్రాన్ని ఇచ్చింది సోనియాగాంధీ 
నెలకు ఆరున్నర వేల కోట్లు అప్ప కడుతున్నామని చెప్పారు బనకచర్లను హరీష్ రావు తాకట్టుపెట్టి, కాంగ్రెస్ మీద నిందలు పెడుతున్నారని దుయ్యబట్టారు. బనకచర్లపై అసెంబ్లీలో చర్చిద్దాం అంటే టిఆర్ఎస్ నేతలు రావడంలేదని అన్నారు బనకచర్ల నీటి వాటాలో ఒక్క చుక్క వదిలేయమని చెప్పారు. సోనియాగాంధీ మాట ఇచ్చి తెలంగాణ ఇస్తే అధికారంలోకి రాగానే కెసిఆర్ అప్పుల పాలు చేశారని దయ పెట్టారు మెదక్ జిల్లా ఇందిరా గాంధీ జిల్లా కాంగ్రెస్ పార్టీకి అడ్డా అని అన్నారు ఇచ్చిన మాట ప్రకారం తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది సోనియాగాంధీ అన్నారు స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు ఖాయం అన్నారు స్థానిక నేతలు గ్రామాల్లో కలిసిమెలిసి పనిచేసి విజయానికి దోహదం పడాలని సూచించారు. రాష్ట్రంలో ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి, ఆధ్వర్యంలో అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళల నడుస్తుందని అన్నారు. వేల కోట్ల రూపాయలతో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ముఖ్య ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొనసాగిస్తున్నారని చెప్పారు.

Also Read: Hyderabad Metro: మెట్రో ప్రయాణికులకు శుభవార్త.. మరో 10 ట్రెయిన్‌లు

మోసం చేసిన మోడీ
10 ఏళ్లు కేంద్రంలో అధికారం ఉండి బిజెపి తెలంగాణకు ఏం చేసిందని మహేష్ కుమార్ గౌడ్ ప్రశ్నించారు కులం మతం దేవుళ్ళ పేరిట బిజెపి రాజకీయాలు చేస్తుందని మండిపడ్డారు దేశాన్ని ఆదాని అంబానీ లకు మోడీ తాకట్టు పెడుతున్నారని దుయ్యబట్టారు ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలని మోసం చేసిన మోడీ అని ధ్వజమెత్తారు రాహుల్ గాంధీ పేదల కష్టాలు తెలుసుకునేందుకు జోడి యాత్ర చేసిండని చెప్పారు. పదేండ్ల టిఆర్ఎస్ పాలనలో కవిత ఏం చేసిందని ఆయన ప్రశ్నించారు బీసీల రిజర్వేషన్ గురించి కవితకు ఏం సంబంధం అని మహేష్ కుమార్ గౌడ్ ప్రశ్నించారు 42 శాతం రిజర్వేషన్లు తాము ఇస్తామంటే లిక్కర్ రాని తన వల్లే ఇచ్చారని అంటుందని విమర్శించారు. దేశమంతా రాహుల్ గాంధీ వైపు చూస్తుందని అన్నారు. గతంలో 33% బీసీలకు రిజర్వేషన్ ఇస్తే దానిని 22% తగ్గించింది టిఆర్ఎస్ పార్టీని మహేష్ కుమార్ గౌడ్ ధ్వజమెత్తారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు ఖాయం అన్నారు మెదక్ ఎమ్మెల్యే డైనమిక్ ఎమ్మెల్యే అని మెదక్ అభివృద్ధికి అనేక నిధులు కేటాయిస్తున్నామని చెప్పారు.

మెదక్ ప్రజల ప్రేమ మర్చిపోలేనిది
కాంగ్రెస్ పార్టీ వచ్చే ఎన్నికల్లో స్వీప్ చేస్తుందని జిల్లా ఇన్చార్జి మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట నిలబెట్టుకుంటుందని అన్నారు. ఉచిత బస్సు సన్నబియ్యం రుణమాఫీ ఇందిరమ్మ ఇండ్లు ఇస్తున్నామని మంత్రి పేర్కొన్నారు. 60 వేల కోట్ల అప్పులు ఉన్న తెలంగాణ రాష్ట్రాన్ని 7 లక్షల కోట్ల అప్పులకోపిలోకి కేసీఆర్ తీసుకెళ్లారని విమర్శించారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా సన్నబియ్యం కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తుందని పేదలకు ఇందిరమైన్లు 40 లక్షల రేషన్ కార్డులు ఇస్తున్నామని మంత్రి తెలిపారు వచ్చే ఎన్నికల నాటికి బీ అర్ ఎస్ పార్టీ ఉండదని అన్నారు. సంక్షేమ, అభివృద్ధి,పై ముందుకు సాగుతున్నామని అన్నారు.

ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏడుపాయల చర్చి అభివృద్ధికి కోట్ల రూపాయలు నిధి నిచ్చారని పేర్కొన్నారు. గతంలో ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ ఏడుపాయల దర్శనానికి అసలే రాలేదని విమర్శించారు. బీజేపీ నియోజక వర్గ ఇన్చార్జి పంజా విజయ్,మోహన్ నాయక్,తో పాటు వివిధ పార్టీల నుంచి కాంగ్రెస్ లో చేరారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతా రావు,నియోజక వర్గం నేతలు తదితరులు పాల్గొన్నారు.

Also Read: TG Govt: ఎంపీటీసీలు 5,773 జెడ్పీ స్థానాలు 31.. అధికారిక ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం

 

Just In

01

O Cheliya movie song: ‘ఓ.. చెలియా’ సినిమా నుంచి పాటను విడుదల చేసిన మంచు మనోజ్..

Khairatabad Ganesh 2025: గంగమ్మ ఒడికి.. ఖైరతాబాద్ మహా గణపతి.. భారీగా తరలివచ్చిన భక్తులు

Ponguleti Srinivasa Reddy: అభివృద్ధి సంక్షేమాన్ని ముందుకు తీసుకెళ్లడమే మా లక్ష్యం: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

Donald Trump: భారత్‌పై ట్రంప్ యూటర్న్.. మోదీ ఎప్పటికీ ఫ్రెండే అంటూ.. దగ్గరయ్యేందుకు తాపత్రయం!

SIIMA Awards 2025: సైమా 2025 విజేతలు ఎవరంటే?.. ఖుషీ అవుతున్న ఆ హీరోల ఫ్యాన్స్