Hyderabad Metro (imagecredit:twitter)
తెలంగాణ

Hyderabad Metro: మెట్రో ప్రయాణికులకు శుభవార్త.. మరో 10 ట్రెయిన్‌లు

Hyderabad Metro: గ్రేటర్ హైదరాబాద్ నగరంలో రోజురోజుకి పెరుగుతున్న ట్రాఫిక్ కారణంగా మెట్రోరైలుకు రోజురోజుకి ఆదరణ పెరుగుతుంది. ముఖ్యంగా ప్రయాణికుడి ప్రయాణించేందుకు వీలుగా మెట్రోకు కనెక్టివిటీగా ఇతర వాహానాలు తక్కువుగానే ఉన్నా, తక్కువ టైమ్ లో నామమాత్రపు ఛార్జీలకే గమ్యస్థానాలను చేర్చతున్న హైదరాబాద్ మెట్రో(Hyderabad Metro) రైలు కు రోజురోజుకి ప్రయాణికుల సంఖ్య పెరుగుతుంది. దీనికి తగినట్టుగా మెట్రో రైళ్లను అందుబాటులో ఉంచాలన్న విషయంపై ఎల్ అండ్ టీ మెట్రో దృష్టి సారించింది. మున్ముందు ప్రయాణికుల సంఖ్య మరింత గణనీయంగా పెరగనున్నట్లు గుర్తించిన ఎల్ అండ్ టీ (L&T) భవిష్యత్తు అవసరాలకు తగిన విధంగా మూడు భోగీలతో ఒక ట్రెయిన్ గా ఉన్న మొత్తం 10 ట్రెయిన్లను అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఈ విషయాన్ని 2023 లోనే గుర్తించిన ఎల్ అండ్ టీ మెట్రో అప్పట్లో నాగ్ పూర్ మెట్రో రైళ్లను లీజుకు తీసుకోవాలని భావించగా, కొన్ని టెక్నికల్ కారణాలతో ఈ ప్రయత్నం విఫలం కావటంతో సొంతగా సమకూర్చుకునేందుకు ఎల్ అండ్ మెట్రో కసరత్తు చేస్తున్నట్లు సమాచారం.

ఒక్క ట్రెయిన్ 70 మంది ప్రయాణికులు
ప్రస్తుతం నగరంలోని ఎల్బీనగర్ నుంచి మియాపూర్(Miyapur), నాగోల్(Nagole) నుంచి రాయదుర్గం వరకు, అలాగే సికిందరాబాద్ జూబ్లీ బస్ స్టేషన్(Jubilee Bus Station) నుంచి ఎంజీబీఎస్(MGBS) వరకు మూడు కారిడార్లలో ప్రస్తుతం 57 మెట్రో ట్రెయిన్లు రోజుకి 1050 ట్రిప్పులో ప్రయాణికులను తమ గన్యస్థానాలను చేర్చుతుంది. ప్రయాణికుల సంఖ్య పెరుగుతుండటంతో ట్రెయిన్లను కూడా పెంచేందుకు కసరత్తు చేస్తున్న ఎల్ అండ్ తొలుత 30 కోచ్ లను సమకూర్చుకునేందుకు సిద్దమైనట్లు తెలిసింది.

ప్రతి మూడు కోచ్ లతో ఒక్క ట్రెయిన్ సుమారు 70 మంది ప్రయాణికుల కెపాసిటీతో సమకూర్చుకోవాలని భావిస్తున్నట్లు, ఇందుకు సంబంధించి ఒక్కో కోచ్ తయారీకి రూ. 60 కోట్ల నుంచి రూ.70 కోట్ల మధ్య ఖర్చువుతుందన్న విషయాన్ని అంచనా వేసిన ఎల్ అండ్ టీ అదనపు ట్రెయిన్ల కోసం రూ. 650 కోట్లను వెచ్చించాలని భావిస్తున్నట్లు సమాచారం. ఈ కోచ్ ల తయారీ బాధ్యతలను బీఈఎంఎల్ అనే సంస్థకు అప్పగించాలని యోచిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే బీఈఎంఎల్ సంస్థ దేశంలోని పలు నగరాలకు మెట్రో కోచ్ లను తయారు చేసి ఇచ్చినట్లు, ఆ ట్రెయిన్ లు సక్సెస్ ఫుల్ గా రన్ అవుతున్నందున ఆ తరహా కోచ్ లనే నగరానికి తీసుకువచ్చేందుకు ఎల్ అండ్ టీ మెట్రో సిద్దమైనట్లు సమాచారం.

Also Read: Medical College Vacancies: సీనియారిటీ ఆధారంగా సిటీలో పోస్టింగ్ ఛాన్స్.. సర్కార్ స్టడీ

మళ్లీ ఒప్పందం
ప్రస్తుతం మెట్రో ఫేజ్ -1 లోని మూడు కారిడార్లలో ప్రతి రోజు అయిదు లక్షల మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చుతున్న మెట్రోరైలు ఈ రద్దీని మరో రెండింతలు పెంచి, సుమారు 15 లక్షల ప్రయాణికులను ప్రతి రోజు తమ గమ్యస్థానాలను చేర్చేలా అదనపు ట్రెయిన్లను ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం రాకపోకలు కొనసాగుతున్న ఫేజ్ -1 లోని కొన్ని ప్రాంతాల్లో కొత్తగా వచ్చే ట్రెయిన్ ల రాకపోకలను కొనసాగించాలని
భావిస్తున్న ఎల్ అండ్ టీ మెట్రో సంస్థ వీటిలోనే మరి కొన్నింటిని ఇప్పటికే సర్కారు ప్రతిపాదించి, మంజూరు చేసిన మెట్రోరైల్ ఫేజ్-2లో తిప్పాలని భావిస్తున్నట్లు, ఇందుకు సంబంధించి మరోసారి ఎల్ అండీ టీ, హైదరాబాద్ మెట్రో రైలు సంస్థల మధ్య కొత్తగా ఒప్పందం కుదుర్చుకోవాలని భావిస్తున్నట్లు సమాచారం.

కొత్త ట్రెయిన్ల విషయంలో
ముఖ్యంగా ఏడాది కాలంలో అందుబాటులోకి రానున్న మరో 10 మెట్రో ట్రెయిన్ లో ఫేజ్ -1లో తిప్పితే ఏఏ స్టేషన్లలో మెట్రో రైలు రాకపోకలకు అంతరాయం, అడ్డంకులేర్పడే అవకాశముందన్న విషయాన్ని ఎల్ అండ్ టీ స్టడీ చేస్తున్నట్లు తెలిసింది. ఈ స్టడీ కొలిక్కి వస్తే కొత్తగా వచ్చే ట్రెయిన్ లో ఎన్ని ట్రెయిన్ లను, ఏ ఏ కారిడార్ లో అందుబాటులోకి తీసుకువస్తారన్న విషయంపై క్లారిటీ వచ్చే అవకాశముంది. కొత్త ట్రెయిన్ల విషయంలో ఇప్పటికే ఓ నిర్ణయానికి వచ్చిన ఎల్ అండ్ టీ తయారీకి ఆర్డర్ ఇస్తే సుమారు 12 నెలల నుంచి 15 నెలల మధ్య కొత్త ట్రెయిన్లు అందుబాటులోకి వచ్చే అవకాశమున్నట్లు తెలిసింది. అంటే వచ్చే సంవత్సరం ఆగస్టు, లేక డిసెంబర్ లో పు కొత్త అదనపు ట్రెయిన్లు అందుబాటులోకి రానున్నాయి. పెంచేనున్న ట్రెయిన్లతో పాటు ఆయా మెట్రో స్టేషన్లలోని రాకపోకలను బట్టి డిజిటల్ సేవల విస్తరణ పై కూడా ఎల్ అండ్ టీ దృష్టి సారించనున్నట్లు తెలిసింది.

Also Read: Jangaon District farmers: మొహం చాటేసిన వర్షాలు.. ఎండుతున్న పంటలు

 

Just In

01

Ram Charan Next movie: రామ్ చరణ్ నెక్స్ట్ సినిమా దర్శకుడు ఎవరో తెలిస్తే ఫ్యాన్స్‌కు పండగే..

Swetcha Effect: స్వేచ్ఛ కథనంతో సంచలనం.. రంగంలోకి దిగిన నిఘా వర్గాలు డీఎస్పీ అరాచకాలకు తెర!

Ellamma movie: బలగం వేణు ‘ఎల్లమ్మ’ సినిమాకు సంగీత దర్శకుడు ఎవరంటే?

Liquor License: వైన్​ షాపుల లాటరీకి హైకోర్టు గ్రీన్ సిగ్నల్!

Telugu States Disasters 2025: ప్రకృతి గట్టిగానే హెచ్చరిస్తుందిగా.. లోకంలో పాపాలు ఆపకపోతే ఇలాంటి వినాశనాలు తప్పవా?