Jangaon District farmers: ముందు మురిపించిన వర్షాలు మొహం చాటేయడంతో వేసిన పంటలకు సాగు నీరు అందక పంటలు ఎండుతున్నాయని జనగామ జిల్లా(Jangaon District) బచ్చన్నపేట రైతులు ఆవేదన చెందుతున్నారు. వర్షాకాలం ప్రారంభమై రెండు నెలలు గడిచిన ఆశించిన వర్షాలు కురవడం లేదు. ఈ సారి మే చివరి మాసంలోనే వర్షాలు(Rains) పడడంతో కాలం కలిసి వస్తుందని భావించి కోటి ఆశలతో రూ. వేళల్లో పెట్టుబడి పెట్టీ పంటలు సాగు చేశారు. ఇప్పటికే పత్తి మొక్కజొన్న, వరి పంటలు సాగు చేశారు రైతులు. తీవ్ర వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో అడపదడపా కురిసే చిరు కొంత పత్తి మొక్కజొన్న పాటలు బాగున్న నీళ్లు ఎక్కువ అవసరం అయ్యే వరి పొలాలు ఎండిపోయి నేర్రెలు బారాయి.
ఎండుతున్న వరి పంటలను చూసి రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇంకా వర్షాలు కురవకుంటే వరి పంటలు(Crops) పూర్తిగా ఎండిపోయే ప్రమాదం ఉందని రైతులు ఆవేదన చెందుతున్నారు. ఇప్పటికే వందలాది ఎకరాల్లో పంట ఎండిపోయింది. సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మండలంలోని ఐనాపూర్ తపాసుపల్లి రిజర్వాయర్, దేవాదుల ప్రాజెక్ట్(Devadala Project) ద్వారా మల్లన్నసాగర్ నుంచి సాగునీటిని విడుదల చేస్తే చేర్యాల, కొమురవెల్లి, మద్దూరు, ధూళిమిట్ట, బచ్చన్నపేట ప్రాంతాల్లోని సుమారు 1.2 లక్ష ఎకరాలకు సాగునీరు అందుతుంది. ప్రభుత్వం వెంటనే స్పందించి నీటిని విడుదల చేయాలని చెరువులు, కుంటలు నీటితో నింపి మా పంటలు కాపాడాలని రైతులు కోరుతున్నారు. నీటిని విడుదల చేయాలని అనేక సార్లు అధికారులకు విన్నవించినా పట్టించుకోవడం లేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Also Read: Kota And Naga Babu: ఎప్పుడు ఉంటాడో.. ఎప్పుడు ఊడిపోతాడో తెలియదు దారుణంగా అవమానించిన నాగ బాబు
మా గోడు వినే నాధుడే లేడా!
మండలంలోని చెరువు కుంటల్లో నీళ్లు లేక వందల ఎకరాల్లో పంటలు ఎండిపోయి తీవ్ర ఇబ్బంది పడుతున్న మా గోడును పట్టించుకునే నాధుడే లేడు. పోయిన పదేళ్ల గడువు కాలంలో ఈ పరిస్థితి ఎప్పుడూ రాలేదని ఇప్పుడు ఏ అధికారులకు చెప్పిన ఏ నాయకునికి విన్నవించుకున్న చెరువులు కుంటలు నింపుతున్నామని ఫోటోలకు ఫోజులు ఇయ్యడమే తప్ప చేసింది ఏమి లేదు. ఇటు వర్షాలు లేక అటు నీళ్ళు రాక తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. ఇప్పటికైనా మా గోడు అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోవాలని కోరారు.
కామెడీ శ్రీనివాస్ రెడ్డి
చేసిన కష్టం పెట్టిన పెట్టుబడి పోతుంది. ప్రభుత్వం నీళ్లు విడిచాం రైతులకు ఏ ఇబ్బంది లేకుండా చేస్తున్నాం అని చెబుతున్న క్షేత్ర స్థాయిలో మా పంట పొలాలకు నీళ్లు రావడం లేదు. నా మూడు ఎకరాల పొలం ఎండిపోతుంది. చేసిన కష్టం, పెట్టిన పెట్టుబడి మునిగే రోజులు వచ్చాయి. వెంటనే ప్రభుత్వం నీటిని విడుదల చేయడంలో నిర్లక్ష్యం వహించిన అధికారులపై చర్యలు తీసుకుని మాకు పంట నీరు ఇచ్చి ఆదుకోవాలని అన్నారు.
వోడుమాడ్ల దుర్గయ్య
నా ఐదు ఎకరాల పొలం ఎందుతుంది. సకాలంలో వర్షాలు లేక, ప్రాజెక్ట్ ఉన్న నీళ్లు రాక నాకు ఉన్న 5 ఎకరాల పొలం ఎందుతుంది. లక్ష రూపాయలకు పైగా పెట్టుబడి పెట్టిన అన్ని మట్టిలో కలిసే సమయం వచ్చింది. మా బాధ ఎవరు పట్టించుకోవడం లేదు. ఇప్పటికైన ప్రభుత్వం కరించి సాగునీటిని విడుదల చేసి మమ్మల్ని ఆదుకోవాలని రైతు కోరారు.
Also Read: Janasena: జనసేన ఎమ్మెల్యేకు చుక్కలు చూపిస్తున్న టీడీపీ నేతలు!