Operation Muskan: ఆపరేషన్ ముస్కాన్ ద్వారా చిన్నారులకు విముక్తి!
Operation Muskan (imagecredit:swetcha)
నార్త్ తెలంగాణ

Operation Muskan: ఆపరేషన్ ముస్కాన్ ద్వారా 177 చిన్నారులకు విముక్తి!

Operation Muskan: ఆపరేషన్ ముస్కాన్ 11వ విడత ద్వారా వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో వివిధ ప్రాంతాల్లో పనులు చేస్తున్న 177 చిన్నరులకు విముక్తి కలిగించినట్లు వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్(Commissioner Sunpreet Singh) తెలిపారు. గత నెల జులై మొదటి తారీఖు నుండి నెలాకరు వరకు కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు వరంగల్ పోలీస్ కమిషనరేట్ పోలీసులు బాలల సంరక్షణ విభాగం, చైల్డ్ లైన్(Child Line), కార్మిక శాఖతో కలిసి ఆపరేషన్ ముస్కాన్(Operation Muskan) కార్యక్రమంలో భాగంగా వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని హనుమకొండ(Hanumakonda), వరంగల్(Warangal), జనగామ జిల్లాల్లో వివిధ ప్రాంతాల్లో సంయుక్తంగా నిర్వహించిన తనిఖీల్లో బాల కార్మికులు, బడి మానేసిన 177 మంది బాలబాలికలను గుర్తించి వారిని బాలల సంరక్షణ గృహానికి తరలించడం జరిగింది.

బాలల న్యాయ చట్టం
ఇందులో 149 మంది బాలలు, 28 మంది బాలికలు వున్నారు. బాలల సంరక్షణ గృహానికి తరలించిన వారిలో తెలంగాణ(Telangana)తో, ఇతర రాష్ట్రాలకు 97మంది చిన్నారులు ఉన్నట్లుగా గుర్తించడం జరిగింది. ఈ తనిఖీల్లో గుర్తించిన 171 చిన్నారులను వారి తల్లిదండ్రులకు అప్పగించడమైదని పోలీస్ కమిషనర్ తెలిపారు. ఈ తనిఖీలు కొనసాగుతాయని, ఎవరైనా చిన్నారులతో వెట్టి చాకిరీ చేయించుకునే యాజమానుల పట్ల కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు. ఇలాంటి చర్యలకు పాల్పడిన వారిపై బాలల న్యాయ చట్టం అనుసరించి చిన్నారులను పనిలో పెట్టుకున్న యాజమాన్యంకు రెండు సంవత్సరాల జైలు శిక్ష, 50వేల రూపాయల జరిమానా విధించడం జరుగుతుందని వరంగల్ పోలీస్ కమిషనర్ హెచ్చరించారు.

Also Read: Viral News: మొగుడి హత్యకు భార్య పక్కా ప్లాన్.. అడవిలో బిగ్ ట్విస్ట్

విశ్రాంత ఉద్యోగులు ఆరోగ్యంపై శ్రద్ద పెట్టాలి
పదవీవిరమణ చేసిన పోలీస్‌ అధికారులు తమ వ్యక్తిగత ఆరోగ్యం పట్ల శ్రద్ద వహించాలని వరంగల్‌(Warangal) పోలీస్‌ కమిషనర్‌ తెలిపారు. వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌ సుధీర్ఘ కాలం పని చేసి పదవీవిరమణ చేసిన పోలీస్‌ అధికారులను వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ ఘనంగా సత్కరించి జ్ఞాపికలను అందజేసారు. పదవీ విరమణ పొందిన వారిలో, ఏ.ఎస్.ఐ వివిఎల్ ఎన్ మూర్తి9Murthy), హెడ్ కానిస్టేబుల్ జె. కేశవ్(Keshav), కానిస్టేబుల్ యం. ఎల్లయ్య(M.Ellaiah), నాల్గవ తరగతి ఉద్యోగి కె. యాదయ్య(K.Yadaya) వున్నారు.

ఈ సందర్బంగా పోలీస్‌ కమిషనర్‌ మాట్లాడుతూ మీ సేవలు నేటి తరం పోలీసులకు అదర్శంగా నిలుస్తుందని, నేటి ఈ ప్రశాంత వాతావరణానికి మీ సేవలే కారణమని, మీ అందించిన సేవలు మరువమని పోలీస్‌ కమిషనర్‌ తెలిపారు. ఈ కార్యక్రమములో అదనపు డిసిపి, శ్రీనివాస్(Srinivass), ఆర్. ఐలు నాగయ్య, సతీష్, ఆర్. ఎస్. ఐ శ్రవణ్ తో పాటు పదవీ విరమణ పొందిన సిబ్బంది కుటుంబ సభ్యులు పాల్గోన్నారు.

Also Read: Meenakshi natrajan: బీజేపీ పాలనలో పేదల ఓట్లు గల్లంతు.. మీనాక్షి నటరాజన్!

Just In

01

45 Official Trailer: శివరాజ్ కుమార్, ఉపేంద్రల అరాచకం.. ఎండింగ్ డోంట్ మిస్!

Akhanda 2: ‘అఖండ 2’ సక్సెస్ మీట్‌కు నిర్మాతలు ఎందుకు రాలేదు? భయపడ్డారా?

Suriya46: ‘సూర్య సన్నాఫ్ కృష్ణన్’‌ను తలపిస్తోన్న సూర్య – వెంకీ అట్లూరి మూవీ టైటిల్!

Vishnu Vinyasam: శ్రీ విష్ణు నెక్ట్స్ సినిమా టైటిల్ ఇదే.. టైటిల్ గ్లింప్స్ అదిరింది!

Minister Seethakka: మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని చంపే కుట్ర: మంత్రి సీతక్క