Meenakshi natrajan (imagecredit"swetcha)
తెలంగాణ

Meenakshi natrajan: బీజేపీ పాలనలో పేదల ఓట్లు గల్లంతు.. మీనాక్షి నటరాజన్!

Meenakshi natrajan: స్వాతంత్రం కోసం గాంధీ చేసిన విధంగానే జనహితం కోసమే తాము కూడా పాదయాత్ర చేస్తున్నామని ఏఐసీసీ రాష్ట్ర ఇంచార్జి మీనాక్షి నటరాజన్(AICC Meenakshi Natarajan) అన్నారు. జనహిత పాదయాత్ర కార్యక్రమంలో భాగంగా అందోలు మండలం సంగుపేట వద్ద గార్డెన్ లో నిర్వహించిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆమే మాట్లాడారు. బిసి(BC) లకోసం 42 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)తో సహా ఢిల్లీలో మూడు రోజులపాటు ధర్నా చేపడుతున్నామన్నారు. దేశానికి తెలంగాణ(Telanagana) రాష్ట్రం రోల్ మోడల్ గా నిలిచేలా కాంగ్రెస్ ప్రభుత్వ పాలన కొనసాగుతుందని చెప్పారు. కేంద్ర దర్యాప్తు సంస్థలు బిజెపి చేతిలో కీలుబొమ్మలుగా మారాయని ఆమె ఆరోపించారు.

బిజెపి పాలనలో పేదల ఓట్లు గల్లంతు అవుతున్నాయని అన్నారు. బీహార్ రాష్ట్రంలో 65 లక్షల ఓట్లను తొలగించాలని దొంగచాటుగా గెలిచేందుకు బిజెపి(BJP) కుట్రలు చేస్తుందని మీనాక్షి నటరాజ్ ఆరోపించారు. బిజెపి ప్రభుత్వం దేశ సంపదను ఉన్నత వర్గాలకు దోచిపెడుతుందని ఆమె విమర్శించారు. స్వాతంత్రం కోసమే గాంధీ(Gandhi) చేసిన విధంగా తామ కూడా జనహితం కోసమే పాదయాత్ర చేపడుతున్నామన్నారు నాయకులు కూడా ప్రజల్లోకి నేరుగా వెళ్తేనే సమస్యలు తెలుస్తాయని ఆమె తీర్చి చెప్పారు వారి సమస్యలను పరిష్కరించేందుకు అవకాశం ఉంటుందన్నారు. ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను కార్యకర్తలు గడపగడపకు వివరించాలని కోరారు.

కాళేశ్వరం ప్రాజెక్టులో పెద్ద ఎత్తున అవినీతి: పీసీసీ చీఫ్
కాళేశ్వరం ప్రాజేక్టు(Kaleshwaram Project)లో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని, కేసీఆర్‌(KCR)ను దోషిగా జస్టిస్ పీసీ ఘోష్‌ కమిషన్‌(Justice PC Ghosh Commission) తేల్చి చెప్పిందని పీసీసీ అధ్యక్షుడు మహేష్‌ కుమార్‌ గౌడ్‌(Mahesh Kumar Goud) కీలక వ్యాఖ్యాలు చేశారు. ప్రాజెక్ట్‌ పేరుతో లక్షల కోట్ల రూపాయలు వృధా చేసి రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారని కమిషన్‌ తేల్చి చెప్పిందన్నారు. జనహిత పాదయాత్ర కార్యక్రమంలో భాగంగా అందోలు మండలం సంగుపేట వద్దనున్న లక్ష్మిదేవీ గార్డెన్స్‌లో నిర్వహించిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రాజెక్టు విషయంలో ఇంజనీర్లు చెప్పినా కేసీఆర్‌(KCR) వినకుండా తన సొంత లాభం కోసం, తనకి ఇష్టం ఉన్న చోట ప్రాజెక్టును కట్టించారన్నారు.

ప్రాజెక్టు నిర్మాణం రూ.40 వేల కోట్లు కాగా, కమిషన్‌ల కోసం రూ.లక్షన్నర కోట్లకు పెంచారని, రూ. లక్ష కోట్ల అవినీతికి పాల్పడ్డారని ఆయన ఆరోపించారు. ప్రాజెక్టు ఫిల్లర్లు కుంగితే ఏమైతదని కేటీఆర్‌ ఎద్దేవా చేసి మాట్లాడారని, కూలుతున్న ఇంట్లో మీ కుటుంబాన్ని ఉంచుతారా అని ఆయన ప్రశ్నించారు. ఈ ఫార్ములా కారు రేసు(E Formula Car Race)లో కేటీఆర్‌(KTR) అడ్డంగా దొరికాడని, ప్రభుత్వ సోమ్ము తిన్నది ఏవరైనా కక్కాల్సిందేనన్నారు. ప్రతిపక్షాలు చేసిన కుట్రల వలన ఇతర పార్టీల ఎమ్మెల్యేలను పార్టీలోకి తీసుకొవాల్సి వచ్చిందని, ఆ నియోజకవర్గాల్లో కొంత మేరకు ఇబ్బందులున్నాయన్నారు.

Also Read: Bhadrachalam: పుణ్యక్షేత్రంలో పాడు పనులు.. నిద్రపోతున్న నిఘా వ్యవస్థ

18 వేల కోట్ల ఆదాయం
కాంగ్రెస్ పార్టీలో ఉండడం కొత్తేమి కాదని, ఎన్ని గ్రూపులున్నా పార్టీ నిర్ణయానికి కార్యకర్తలు, నాయకులు ఒక్కటై పార్టీ గెలుపు కోసం పాటుపడాలన్నారు. గ్రూపుల వలన పార్టీకి నష్టం జరగకుండా చూసుకునే బాధ్యత మాదేనన్నారు.పీసీసీ కార్యవర్గ కూర్పులో 85 శాతం పాతవారికి 15 శాతం కొత్తవారికి అవకాశాలు కల్పించామని, పార్టీలో పాత నీరుతో పాటు కొత్త నీరు కూడా ఉండాని, పాత,కొత్త కలయికతో పార్టీ పటిష్టంగా ఉంటుందన్నారు. పార్టీ కోసం కష్టపడిన వారికి తగిన గుర్తింపు ఉంటుందన్నారు. కార్యకర్తలు లేకుంటే ప్రభుత్వమే లేదన్నారు. కేసీఆర్‌(KCR) చేతగాని తనంవల్లనే బనకచర్ల ప్రాజెక్టు(Banakacharla Project) చేపడితే, తాము కేంద్రానికి ఫిర్యాదు చేసి అడ్డుకున్నామన్నారు.

రాష్ట్రాన్ని రూ.8 లక్షల కోట్ల అప్పుల కుప్పగా మార్చారని, నెలకు రూ.18 వేల కోట్ల ఆదాయం వస్తే, ఇందులో రూ.6500 కోట్ల వడ్డీని చెల్లిస్తున్నామని, కానీ ఆర్థికపరమైన ఇబ్బందులున్నా సంక్షేమ పథకాల(Welfare schemes)ను మాత్రం ఆపడం లేదన్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సీ.దామోదర్‌ రాజనర్సింహ(Min Damodar Rajanarsimha), ఎంపీ సురేష్‌ షేట్కార్(MP Suresh Shetkar), పీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ జగ్గారెడ్డి(Jagga Reddy), ఎమ్మెల్యే సంజీవరెడ్డి(Mla Sanjeva Reddy), మాజీ మంత్రి చంద్రశేఖర్, రాజనర్సింహ పౌండేషన్‌ చైర్‌ పర్సన్‌ త్రిష రాజనర్సింహ, సంగారెడ్డి, మెదక్‌ గ్రంథాలయ సంస్థ చైర్మన్‌లు అంజయ్య, సువాసిని రెడ్డి, మహిళా నాయకురాలు గిరిజాషేట్కార్‌తో పాటు తదితరులు ఉన్నారు.

డిగ్రీ కళాశాలలో AICC మీనాక్షి నటరాజన్ శ్రమదానం
జోగిపేట లోని నెహ్రూ మెమోరియల్ డిగ్రీ కళాశాల(Nehru Memorial Degree College) ప్రాంగణంలో విద్యార్థులతో కలసి ఏఐసీసీ రాష్ట్ర ఇంచార్జి మీనాక్షి నటరాజన్, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్(PCC Mahesh Kumar Goud) ,మంత్రి దామోదర్ రాజనర్సింహలు శ్రమదానం నిర్వహించారు. శ్రమదానం కార్యక్రమంలో ఎన్ఎస్ఈ యూత్ కాంగ్రెస్(Youth Congress) స్థానిక నాయకులతో కలిసి శ్రమదానం నిర్వహించి కళాశాల ప్రాంగణంలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మంత్రి దామోదర్ రాజనర్సింహ కళాశాల మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తామని చెప్పారు.

Also Read: Rahul Gandhi: రిటైర్ అయినా వదిలిపెట్టను.. ఈసీ అధికారులకు రాహుల్ గాంధీ తీవ్ర హెచ్చరిక

Just In

01

SCU: సుజీత్ సినిమాటిక్ యూనివర్స్.. దర్శకనిర్మాతలు క్లారిటీ ఇచ్చేశారుగా..!

Arjun Das: ఓరి నీ అభిమానం చల్లగుండా.. మరీ ఇంత పెద్ద మెసేజ్ ఏంటయ్యా?

Sandeep Raj: ‘ఓజీ’ విడుదల వేళ.. 8 సంవత్సరాల క్రితం చేసిన ట్వీట్‌‌‌తో సంచలనం!

O Cheliya Teaser: హీరో శ్రీకాంత్ వదిలిన ‘ఓ.. చెలియా’ టీజర్ ఎలా ఉందంటే?

Connplex Cinemas: ‘ఓజీ’ సినిమాతో హైదరాబాద్‌లో మరో లగ్జరీ మల్టీప్లెక్స్‌ ప్రారంభం.. వివరాలివే!