Kurnool Bus Accident *( image credit: swetcha reporter)
నార్త్ తెలంగాణ

Kurnool Bus Accident: కర్నూల్ బస్సు ప్రమాదం.. బాధితులకు అవసరమైన సహాయక చర్యలు ముమ్మరం : కలెక్టర్ బి. ఎం. సంతోష్

Kurnool Bus Accident: కర్నూలు జిల్లా కల్లూరు మండలం చిన్నటేకూరు గ్రామ సమీపంలో  తెల్లవారుజామున జరిగిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ప్రమాద ఘటనలో (Kurnool Bus Accident) మృతిచెందిన, క్షతగాత్రుల కుటుంబ సభ్యులకు అవసరమైన సహాయక చర్యలు చేపట్టినట్లు జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టర్ బి. ఎం. సంతోష్ తెలిపారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ఉదయం గద్వాల జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు తో కలిసి ప్రమాద ఘటన స్థలాన్ని కలెక్టర్ పరిశీలించారు. హైదరాబాదు నుంచి బెంగళూరు బయలుదేరిన కావేరి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో మొత్తం 41 మంది ప్రయాణికులతో పాటు డ్రైవర్, క్లీనర్ ఉన్నట్లు తెలిసిందన్నారు. ఈ ఘటనలో 20 మంది ప్రయాణికులు మృతి చెందినట్లు ప్రాథమికంగా తెలిసిందన్నారు. వైద్య సిబ్బంది బస్సులోని మృతదేహాలను వెలికి తీసి పోస్టుమార్టం నిమిత్తం కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు చెప్పారు.

 Also Read: Kurnool Bus Accident: కర్నూలు బస్సు ప్రమాదం.. రాష్ట్రపతి, ప్రధాని దిగ్భ్రాంతి.. సీఎం చంద్రబాబు, పవన్ సంతాపం

తెలంగాణ నుంచి 13 మంది

క్షతగాత్రులు కర్నూలు ప్రభుత్వాసుపత్రి తో పాటు పలు ప్రైవేట్ ఆస్పత్రిలోనూ చికిత్స పొందుతున్నట్లు తెలిపారు. పోస్టుమార్టం నివేదికను బట్టి మృతదేహాలను వారి కుటుంబ సభ్యులకు అప్పగించడం జరుగుతుందన్నారు. బస్సులో తెలంగాణ నుంచి 13 మంది, ఆంధ్రప్రదేశ్ నుంచి 12 మంది, ఇతర రాష్ట్రాల నుంచి మిగతావారు ప్రయాణిస్తున్నట్లు ప్రాథమిక సమాచారం మేరకు తెలిసిందన్నారు. కర్నూలు జిల్లా యంత్రాంగానికి జోగులాంబ గద్వాల జిల్లా పోలీస్, అధికార యంత్రాంగం పూర్తి సహాయ, సహకారాలు అందించడమే కాక బాధిత కుటుంబ సభ్యులకు అవసరమైన సమాచారం అందించేందుకు గద్వాలలోని కలెక్టరేట్, పోలీసు కార్యాలయాల్లో కంట్రోల్ రూమ్, హెల్ప్ డెస్క్ ఫోన్ నెంబర్లను అందుబాటులో ఉంచామన్నారు.

జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టరేట్ కంట్రోల్ రూమ్ నెంబర్: 9502271122

జోగులాంబ గద్వాల జిల్లా హెల్ప్ డెస్క్ నంబర్స్: 9100901599, 9100901598

జోగులాంబ గద్వాల జిల్లా పోలీస్ కార్యాలయ కంట్రోల్ రూమ్ నెంబర్: 8712661828

కర్నూలు ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి కంట్రోల్ రూమ్ నెంబర్: 9100901604

Also ReadAI smart glasses: అమెజాన్ క్రేజీ ఆవిష్కరణ.. డెలివరీ డ్రైవర్లకు ఏఐ స్మార్ట్ గ్లాసెస్.. క్షణాల్లో డోర్ వద్దకే పార్సిల్స్!

Just In

01

NIMS Hospital: నిమ్స్ ఆసుపత్రిలో అక్రమ నియామకాలు.. శాంతి కుమారి కమిటీ రిపోర్ట్‌లో సంచలనాలు..?

Twitter toxicity: సినిమాలపై ట్విటర్‌లో ఎందుకు నెగిటివిటీ పెరుగుతుంది?.. ట్విటర్ టాక్సిక్ అయిపోయిందా?

Ashanna: మావోయిస్టు పార్టీ ఆరోపణలను ఖండించిన ఆశన్న

Viral Video: అయ్యప్ప మాల దీక్షను తీసుకుని మద్యం సేవించిన స్వామి.. వీడియో వైరల్

Ramchandra Rao: జూబ్లీహిల్స్‌లో రెండు రాష్ట్రాల నేతలు కలిసి పని చేస్తాం..?