AI smart glasses: ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్.. తన డెలివరీ డ్రైవర్ల కోసం సరికొత్త టెక్నాలజీని ఉపయోగించబోతోంది. త్వరలోనే వారికి కృత్రిమ మేధతో పనిచేసే స్మార్ట్ గ్లాసెస్ ను (AI-powered smart glasses) ను అందుబాటులోకి తీసుకురాబోతోంది. గత కొంత కాలంగా ఏఐ స్మార్ట్ గ్లాసెస్ పై హోమ్ వర్క్ చేస్తున్న అమెజాన్.. ఇటీవల ఉత్తర అమెరికాలోని డెలివరీ డ్రైవర్లపై కొత్త ట్రెయిల్స్ కూడా మెుదలుపెట్టింది. ఈ నేపథ్యంలో ఈ ఏఐ స్మార్ట్ గ్లాసెస్ కు సంబంధించిన సమాచారాన్ని అమెజాన్ వర్గాలు బహిర్గతం చేశాయి. ఇంతకీ ఈ ఏఐ గ్లాసెస్ ఎలా పనిచేస్తాయి? వాటి వల్ల డెలివరీ డ్రైవర్లకు కలిగే ప్రయోజనాలు ఏంటీ? ఇప్పుడు చూద్దాం.
ఎలా వర్క్ చేస్తాయంటే?
అమెజాన్ డ్రైవర్లు.. చేతిలో మెుబైల్ ఫోన్, వాహనంలో డెలివరీ ప్యాకేజీ పట్టుకొని ఇంటి అడ్రెస్ ను వెతుక్కొని వెళ్తుంటారు. అయితే ఈ ఏఐ స్మార్ట్ గ్లాసెస్ ఈ పనిని సులభతరం చేయనుంది. ఈ ఆగ్మెంటెడ్ రియాలిటీ (AR) స్మార్ట్ గ్లాసెస్.. పార్సిల్స్ ను స్కాన్ చేస్తుంది. దీని వల్ల కస్టమర్ ఆర్డర్ చేసిన వస్తువును నిర్దారించేందుకు వీలు పడుతుంది. ఆర్డర్ వచ్చిన ఇంటిని ఏ విధంగా చేరుకోవాలో కూడా ఈ గ్లాసెస్ డిస్ ప్లే చేస్తుంది. డెలివరీ ప్రూఫ్ కోసం ఫొటో లేదా వీడియో రికార్డ్ చేసేందుకు కూడా వీలు కల్పిస్తుంది.
Amazon just unveiled their own smart glasses that are being tested by their delivery drivers. These wearables have built-in navigation and can scan packages. pic.twitter.com/GgtGRgjsNz
— Nathie (@NathieVR) October 22, 2025
ఏఐ గ్లాసెస్ లక్ష్యం ఏంటీ?
ప్రతీ డెలివరీని వేగంగా, అత్యంత కచ్చితత్వంతో పూర్తి చేయడమే లక్ష్యంగా అమెజాన్ ఈ ఏఐ గ్లాసెస్ కాన్సెప్ట్ పై వర్క్ చేస్తోంది. నగరాల్లో అడ్రస్ కోసం ఫోన్ ను పదే పదే చెక్ చేయడం, ఇంటి నెంబర్ వెతకడం కోసం సమయం వృథా కాకుండా ఈ గ్లాసెస్ ఉపయోపగపడనున్నాయి. ఒక్కో డెలివరీకి కొన్ని సెకన్ల నుంచి నిమిషాల వరకూ తగ్గించినా.. అది కస్టమర్ల మెప్పు పొందేందుకు ఉపయోగపడుతుందని అమెజాన్ వర్గాలు భావిస్తున్నాయి.
Also Read: Kurnool Bus Fire Accident: బస్సు ప్రమాద మృతులకు రూ.5 లక్షల ఎక్స్ గ్రేషియో.. తెలంగాణ ప్రభుత్వం ప్రకటన
డెలివరి వెస్ట్‌తో కనెక్ట్
ఏఐ అధారిత స్మార్ట్ గ్లాసెస్.. డెలివరీ వెస్ట్ కు కనెక్ట్ అయి ఉంటాయి. డ్రైవర్ గమ్యస్థానానికి చేరుకోగానే గ్లాసెస్ ఆటోమేటిక్ గా యాక్టివేట్ అవుతాయి. ఇవి డెలివరీ వ్యాన్ లో పార్సిల్ ప్యాకేజీ ఎక్కడ ఉందో గుర్తించేందుకు సైతం సాయపడతాయి. కాగా, డెలివరీ వెస్ట్ లో గ్లాసెస్ కు సంబంధించిన ఆపరేషన్ కంట్రోల్ ఉంటుంది. రిమూవబుల్ బ్యాటరీ ఆప్షన్ కూడా ఉంది. బయట లైటింగ్ కు అనుగుణంగా సర్దుబాటు అయ్యే ఫోటోక్రోమిక్ లెన్సులకు సైతం ఈ స్మార్ట్ గ్లాసెస్ సపోర్ట్ చేస్తాయి. ప్రస్తుతం ఉత్తర అమెరికాలోని డెలివరీ డ్రైవర్లపై అమెజాన్ ఈ గ్లాసెస్ ను పరీక్షిస్తున్నారు. వీటిలో అవసరమైన మార్పులు చేసి.. త్వరలోనే భారత్ సహా ఇతర దేశాల్లోనూ దీనిని అందుబాటులోకి తీసుకురావాలని అమెజాన్ వర్గాలు భావిస్తున్నాయి.
