Indiramma Sarees: 18 ఏళ్లు నిండిన ప్రతి మహిళకు ప్రభుత్వ చీర
Indiramma Sarees (imagecredit:swetcha)
నార్త్ తెలంగాణ

Indiramma Sarees: రాష్ట్రంలో 18 ఏళ్లు నిండిన ప్రతి మహిళకు ప్రభుత్వ చీర

Indiramma Sarees: మహిళలు ఆర్థికంగా బలోపేతమైతే కుటుంబాల ప్రగతి సాధ్యమవుతుందని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి(Collector Anudeep Durisetty) అన్నారు. పాలేరు నియోజకవర్గంలోని 4 మండలాల మహిళల కోసం సత్యనారాయణపురం బైపాస్ రోడ్డులోని టీసీవీ రెడ్డి ఫంక్షన్ హాల్‌లో ఆదివారం ఏర్పాటు చేసిన ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి(Minister Ponguleti Srinivasa Reddy) క్యాంప్ కార్యాలయ ఇన్‌ఛార్జ్ తుంబూరు దయాకర్ రెడ్డితో కలిసి మహిళలకు చీరలు అందజేశారు. కలెక్టర్ అనుదీప్ మాట్లాడుతూ, 18 ఏళ్లు నిండిన ప్రతి మహిళకు చీర అందేలా ప్రభుత్వం భారీ స్థాయిలో పంపిణీ కార్యక్రమం చేపట్టిందని తెలిపారు. గ్రామాలలో అర్హులైన మహిళలందరికీ చీరలు అందజేయడంలో ఎలాంటి లోటుపాట్లకు తావు ఇవ్వొద్దని అధికారులకు ఆయన సూచించారు. చీరలను ఇంటింటికీ వెళ్లి అందించాలని సూచించారు. మహిళల పురోగతికి ప్రభుత్వం పలు ఆర్థిక అవకాశాలను కల్పిస్తోందని ఆయన వివరించారు. పెట్రోల్ బంకులు, సోలార్ పవర్ ప్లాంట్లు, ఆర్టీసీ అద్దె బస్సులు, ఇందిరమ్మ క్యాంటీన్లు వంటి రంగాల్లో మహిళా సంఘాలకు అవకాశాలు అందజేస్తున్నామని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు. మహిళల చేతిలో డబ్బు ఉంటే కుటుంబాల వ్యవస్థ బలపడుతుందన్నారు. పాలేరు నియోజకవర్గంలోని 4 మండలాల్లో మొత్తం అర్హులైన 53 వేల మంది మహిళలకు చీరల పంపిణీ సజావుగా జరగేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు.

Also Read: Akhanda 2: యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ను కలిసిన ‘అఖండ 2’ టీమ్.. ఫొటోలు వైరల్!

కోటి చీరలు పంపిణీ చేయడం

తుంబూరు దయాకర్ రెడ్డి మాట్లాడుతూ, స్వర్గీయ ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా కోటిమంది మహిళలకు కోటి చీరలు పంపిణీ చేయడం ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. ఇందిరా మహిళా శక్తి పథకం ద్వారా మహిళల ఆర్థిక స్థిరత్వానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Revanth Reddy) సహకారంతో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి నాయకత్వంలో పాలేరు నియోజకవర్గంలో పెద్ద ఎత్తున సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా సాగుతున్నాయని వివరించారు. ఒక అన్న తన చెల్లికి ఇచ్చే కానుకలా ప్రభుత్వం మహిళలకు చీరలు అందిస్తోందని హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో డీఆర్డివో సన్యాసయ్య, ఆత్మ కమిటీ చైర్మన్ చావా శివరామకృష్ణ, మార్కెట్ కమిటీ చైర్మన్ హరినాథ్ బాబు, తహసీల్దార్లు రాంప్రసాద్, విల్సన్, వెంకటేశ్వర్లు, ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

Also Read: Pakistan Blast: పాకిస్థాన్‌లో భారీ పేలుళ్లు.. సైన్యం టార్గెట్‌గా ఆత్మాహుతి దాడి.. పలువురు మృత్యువాత

Just In

01

45 Official Trailer: శివరాజ్ కుమార్, ఉపేంద్రల అరాచకం.. ఎండింగ్ డోంట్ మిస్!

Akhanda 2: ‘అఖండ 2’ సక్సెస్ మీట్‌కు నిర్మాతలు ఎందుకు రాలేదు? భయపడ్డారా?

Suriya46: ‘సూర్య సన్నాఫ్ కృష్ణన్’‌ను తలపిస్తోన్న సూర్య – వెంకీ అట్లూరి మూవీ టైటిల్!

Vishnu Vinyasam: శ్రీ విష్ణు నెక్ట్స్ సినిమా టైటిల్ ఇదే.. టైటిల్ గ్లింప్స్ అదిరింది!

Minister Seethakka: మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని చంపే కుట్ర: మంత్రి సీతక్క