Pakistan Blast: పాకిస్థాన్ మరోమారు బాంబుల మోతతో దద్దరిల్లింది. ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్ (Khyber Pakhtunkhwa province) రాజధాని పేషావర్ (Peshawar)లో గల పారా మిలటరీ ఫోర్స్ (Pakistani paramilitary force) ప్రధాన కార్యాలయాన్ని ఉగ్రవాదులు లక్ష్యంగా చేసుకున్నారు. వారు జరిపిన ఆత్మహుతి దాడిలో ముగ్గురు సైనికులు ప్రాణాలు కోల్పోగా పలువురు గాయపడినట్లు పాక్ సైన్యాధికారులు ధ్రువీకరించారు. ఆత్మాహుతిదారులు కాల్పులు జరుపుకుంటూ ఫ్రంటియర్ కోర్ ప్రధాన కార్యాలయంలోకి దూసుకొచ్చారని ఓ అధికారి (Senior official) స్పష్టం చేశారు.
పేషావర్ పోలీసుల సమాచారం ప్రకారం.. ముగ్గురు వ్యక్తులు (Terrorists) కాల్పులు జరిపి ఫ్రంటియర్ కోర్ ప్రధాన కార్యాలయం (Frontier Corps Head Quarters)లోకి ప్రవేశించారు. అనంతరం తమను తాము పేల్చుకున్నారు. మెుదటి ఆత్మాహుతి దారుడు ప్రధాన గేటు వద్ద దాడి చేయగా.. మరో ఇద్దరు కాంపౌండ్ లోకి చొరబడినట్లు పోలీసు ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. హెడ్ క్వార్టర్స్ లోపల ఇంకా ఉగ్రవాదులు ఉండే ఛాన్స్ ఉందని ఆయన అనుమానం వ్యక్తం చేశారు.
🚨 Blast IN Pakistan Peshawar
⚡ CCTV captures the exact moment a suicide bomber detonates at the entrance of the FC Headquarters in Peshawar.
The blast is massive. Chaos everywhere.
Pakistan’s internal security crisis is unraveling on camera in real time.
More updates coming… pic.twitter.com/zRz6g13Vqw— INDIAN (@hindus47) November 24, 2025
Also Read: Pakistan Fake News: భారత్‌పై పాక్ మీడియా దుష్ప్రచారం.. కొట్టిపారేసిన ఫ్రెంచ్ నౌకాదళం
ప్రస్తుతం పోలీసులు, భద్రతా దళాలు పారా మిలటరీ కార్యాలయాన్ని ముట్టడించి క్షుణ్ణంగా తనిఖీలు జరుపుతున్నట్లు సదరు అధికారి తెలిపారు. మరోవైపు ఫ్రంటియర్ కోర్ కార్యాలయానికి వెళ్లే అన్ని మార్గాలను భద్రతా బలగాలు మూసివేశాయి. మరోవైపు భద్రతా బలగాల డిప్యూటీ కమాండెంట్ జావేద్ ఇక్బాల్ (Javed Iqbal) దాడి ఘటనపై స్పందించారు. ‘ఆత్మాహుతి దాడిలో ముగ్గురు పారామిలటరీ సిబ్బంది మృతి చెందారు. మరో ఐదుగురు గాయపడ్డారు. వీరిలో ఇద్దరు లేడీ రీడింగ్ ఆస్పత్రి (Lady Reading Hospital)లో చికిత్స పొందుతున్నారు’ అని వివరించారు. అయితే ఈ దాడికి సంబంధించి ఏ ఉగ్రవాద సంస్థ ఇప్పటివరకూ బాధ్యత వహించలేదు.
Suicide blast at FC headquarters main gate, three FC personnel martyred Police and FC commandos have killed 3 attackers, clearance operation underway, CCP O Dr. Mian Saeed- PAK MEDIA#Peshawar #Pakistan pic.twitter.com/vwPU5xWaKK pic.twitter.com/MJ3sd1qxXv
— Chaudhary Parvez (@ChaudharyParvez) November 24, 2025
