Akhanda 2: నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) అభిమానులు, సినీ ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్న చిత్రం ‘అఖండ 2: తాండవం’ (Akhanda2: Thaandavam). డిసెంబర్ 5న పాన్ ఇండియా స్థాయిలో ప్రపంచవ్యాప్తంగా విడుదలయ్యేందుకు సిద్ధమైన ఈ చిత్ర ప్రమోషన్స్‌ని మేకర్స్ యమా జోరుగా నిర్వహిస్తున్నారు. ముంబై, వైజాగ్, కర్ణాటక అనంతరం ప్రమోషన్స్ యూపీకి చేరాయి. అవును, ఈ చిత్ర బృందం తాజాగా ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి (UP CM) యోగి ఆదిత్యనాథ్ (Yogi Adityanath)ను మర్యాదపూర్వకంగా కలిసింది. సినిమా విడుదల నేపథ్యంలో ఆయన బ్లెస్సింగ్స్ తీసుకునేందుకు జరిగిన ఈ భేటీ.. దేశవ్యాప్తంగా సినీ, రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తించింది. ‘అఖండ 2’ టీమ్, ముఖ్యమంత్రి కార్యాలయంలో యోగి ఆదిత్యనాథ్‌ను కలిసి, ఆయన ఆశీస్సులు తీసుకుంది. ఈ సందర్భంగా సినిమాలోని ముఖ్యమైన అంశమైన ‘అఖండ త్రిశూలం’ను సీఎం యోగికి ప్రత్యేక కానుకగా బహూకరించారు.
Also Read- Dharma Mahesh: కాంట్రవర్సీ హీరో ధర్మ మహేష్.. తన కొడుకు బర్త్‌డే రోజు ఏం చేశాడంటే?
సీఎంకు గిఫ్ట్‌గా ‘అఖండ త్రిశూలం’
‘అఖండ త్రిశూలం’ (Akhanda Trishul) అందుకున్న యోగి ఆదిత్యనాథ్ తన సంతోషాన్ని వ్యక్తం చేస్తూ.. టీమ్ సభ్యులతో ఆప్యాయంగా మాట్లాడి, వారికి ఆల్ ది బెస్ట్ చెప్పారు. యోగిని కలిసిన బృందంలో ప్రముఖ నటులు, నిర్మాతలు, సాంకేతిక నిపుణులు పాల్గొన్నారు. నందమూరి బాలకృష్ణతో సహా టీమ్ మొత్తం ముఖ్యమంత్రిని కలవడంతో సినిమాపై అంచనాలను మరింతగా పెంచేశారు. ఈ సినిమా ఆధ్యాత్మికత, సనాతన హైందవ ధర్మం నేపథ్యంలో తెరకెక్కిన విషయం తెలిసిందే. ఈ విషయాన్ని సీఎంతో షేర్ చేసుకోవడంతో.. ఆయన ఆనందం వ్యక్తం చేస్తూ.. ఈ సినిమాకు ఎలాంటి సాయం చేయడానికైనా సిద్ధమని చెప్పినట్లుగా తెలుస్తోంది. ఇది నిజంగా గుడ్ సైన్ అనే చెప్పుకోవాలి. ‘అఖండ’ ఫస్ట్ పార్ట్ సాధించిన అఖండ విజయం నేపథ్యంలో, సీక్వెల్ ‘అఖండ 2’పై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పుడు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ వంటి శక్తివంతమైన నాయకుడిని కలవడం ద్వారా, ఈ సినిమాకు నార్త్ ఇండియన్ మార్కెట్లో కూడా మంచి ప్రచారం లభిస్తుందని భావించవచ్చు.
Also Read- Bigg Boss Telugu 9: ఇమ్మానుయేల్ చేతుల్లో పవరాస్త్ర.. ఈ వారం ఎలిమినేషన్ ఆపుతాడా?
సినిమా బలాన్నే ప్రమోషన్‌గా..
‘అఖండ 2: తాండవం’ సినిమా డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ప్రస్తుతం ఈ చిత్రం ప్రమోషన్ కార్యక్రమాలు ఓ రేంజ్‌లో, పక్కా ప్లాన్‌తో టీమ్ చేస్తోంది. ఈ భేటీని గమనిస్తే.. ‘అఖండ 2’ మేకర్స్ తమ సినిమా యొక్క ఆధ్యాత్మిక, ధార్మిక అంశాలతోనే సినిమా ప్రమోషన్స్‌ని ప్లాన్ చేసినట్లుగా తెలుస్తోంది. సీఎం యోగి ఆశీస్సులు తమ సినిమా విజయానికి తోడ్పడతాయని టీమ్ సభ్యులంతా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. యూపీ సీఎంతో ‘అఖండ 2’ టీమ్ భేటీ, త్రిశూలం బహుమతి వ్యవహారం ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. ఈ సినిమా తొలి భాగం అందించిన ఉత్కంఠ, యాక్షన్ నేపథ్యంలో, సీక్వెల్ ఏ స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకుంటుందో అని సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఈ ఉత్కంఠకు తెరపడాలంటే డిసెంబర్ 5 వరకు వెయిట్ చేయాల్సిందే. బోయపాటి శ్రీను (Boyapatri Srinu) దర్శకత్వంలో ఈ సినిమా రూపుదిద్దుకుంది.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు
