Bigg Boss Telugu 9: ఇమ్ము పవరాస్త్రతో.. ఎలిమినేషన్ ఆపుతాడా?
Bigg Boss Telugu 9 Day 77 (Image Source: YT)
ఎంటర్‌టైన్‌మెంట్

Bigg Boss Telugu 9: ఇమ్మానుయేల్ చేతుల్లో పవరాస్త్ర.. ఈ వారం ఎలిమినేషన్ ఆపుతాడా?

Bigg Boss Telugu 9: బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లో 77వ రోజు (Bigg Boss Telugu Season 9 Day 77) ఆదివారం ఎంటర్‌టైన్‌మెంట్ డోస్ కాస్త ఎక్కువగానే ఉంది. ఫ్యామిలీ టైమ్‌తో పాటు ఎలిమినేషన్ కూడా ఈ సండే ఉంటుందనే విషయం తెలిసిందే. శనివారం కొంతమంది హౌస్‌మేట్స్‌కు సంబంధించిన ఫ్యామిలీ మెంబర్స్ సందడి చేసిన విషయం తెలిసిందే. ఈ ఆదివారం మిగిలిన వారి ఫ్యామిలీల వ్యక్తులు స్టేజ్‌పై సందడి చేశారు. ఆ సందడి అనంతరం, ఈ వారం నామినేషన్స్‌లో ఉన్న వారందరూ సేఫ్ అవగా, ఫైనల్‌గా సంజన, దివ్య మాత్రమే ఎలిమినేట్ అయ్యేందుకు మిగిలారు. శనివారం ఇమ్ము సేఫ్ అయిన విషయం తెలిసిందే. మరి సంజన (Sanjjanaa), దివ్య (Divya Nikitha)లలో ఎవరు ఎలిమినేట్ అయ్యారనేది తెలియాల్సి ఉంది. మరోవైపు ఎలిమినేషన్‌కు సంబంధించి ఇమ్ము (Emmanuel)కు నాగార్జున పవర్ ఇచ్చినట్లుగా తాజాగా వచ్చిన ప్రోమోలలో తెలుస్తుంది. ఆ పవర్‌ను ఇమ్మానుయేల్ వాడాడా? లేదా? అనేది కూడా తెలియాల్సి ఉంది. ఇక ఈ సండే ఎపిసోడ్‌కు సంబంధించి వచ్చిన ప్రోమోస్ విషయానికి వస్తే..

Also Read- Rajini and Kamal: రజనీకాంత్, కమల్ హాసన్ ప్రాజెక్ట్‌కు ఈ కష్టాలేంటి? దర్శకుడే లేడా?

సుమన్ శెట్టి లైఫ్‌లోని టాప్ సీక్రెట్ ఇదే..

సండే ఎంటర్‌టైన్‌మెంట్ అంటూ వచ్చిన ప్రోమోలో.. కింగ్ నాగార్జున బ్లాక్ టీ షర్ట్‌లో అదిరిపోయే ఎంట్రీ ఇచ్చిన నాగార్జున (King Nagarjuna), రావడమే సుమన్ శెట్టికి ఓ టాస్క్ ఇచ్చారు. ‘మీ లైఫ్‌లోని టాప్ సీక్రెట్ చెబితేనే.. మీ ఫ్యామిలీ మెంబర్స్‌ని స్టేజ్ మీదకు పిలిపిస్తా’ అని చెప్పడంతో.. ఇంట్లో నైట్ షూటింగ్ అని చెప్పి.. ఫ్రెండ్స్‌తో కలిసి పార్టీలకు వెళతాను సార్.. అని చెప్పగానే సుమన్ డాటర్, సన్‌ని స్టేజ్ మీదకు పిలిచారు నాగార్జున. వారితో పాటు కమెడియన్ శ్రీనివాస్ రెడ్డి కూడా వచ్చారు. సుమన్ శెట్టి, వారి ఫ్యామిలీ మధ్య ఆసక్తికర సంభాషణ నడుస్తోంది. శ్రీనివాస్ రెడ్డి హౌస్‌మేట్స్‌కు కొన్ని సూచనలు చేస్తున్నారు. అనంతరం తనూజ కోసం ‘ముద్దమందారం’ సీరియల్ హరిత, పవన్ సాయి స్టేజ్ మీదకు వచ్చి.. తనూజ ఆట విషయంలో ఆమె తండ్రి చాలా హ్యాపీగా ఉన్నట్లుగా చెప్పారు. వారి మధ్య కొంత ఎమోషనల్ బాండింగ్ నడుస్తోంది.

సంజనకు ఫ్యామిలీ పంచ్

ఫ్యామిలీ వైబ్స్ అంటూ వచ్చిన ప్రోమోలో రీతూకి సంబంధించి బిగ్ బాస్ ఫేమ్ అఖిల్, జతిన్ అనే అతను వచ్చారు. బయటకు వచ్చాక జతిన్‌తో జాగ్రత్తగా ఉండాల్సి వస్తుందని డిమోన్‌కు అఖిల్ సూచన చేస్తున్నాడు. ఆ తర్వాత సంజన ఫ్యామిలీ స్టేజ్ మీదకు వచ్చింది. వారి మధ్య సంజన హౌస్‌లో చేసిన దొంగతనంపై కామెడీ నడుస్తోంది. డిమోన్ పవన్ ఫ్యామిలీకి సంబంధించి వాళ్ల నాన్న, బ్రదర్ స్టేజ్ మీదకు వచ్చారు. వారి మధ్య ఎమోషనల్ బాండింగ్ నడుస్తోంది. పవన్ వాళ్ల ఫాదర్ హెల్త్‌కు సంబంధించి పవన్ అడుగుతున్నారు. అందరూ మంచిగా ఆడండి అని చెప్పి పవన్ వాళ్ల ఫాదర్ చెబుతున్నారు.

Also Read- Harish Kalyan: హ‌రీష్ క‌ళ్యాణ్ నెక్ట్స్ ఫిల్మ్‌కు పవర్ ఫుల్ టైటిల్.. ప్రోమో అదిరింది

ఇమ్ము చేతుల్లో ఎలిమినేషన్..

ఎలిమినేషన్ ట్విస్ట్ అంటూ వచ్చిన ప్రోమోలో ‘సంజన అండ్ దివ్య మీరిద్దరూ గార్డెన్ ఏరియాలోని ఎలిమినేషన్ జోన్ లోకి వచ్చేయండి’ అని నాగార్జున చెప్పారు. వారిద్దరూ ఆ జోన్‌లోకి వచ్చిన మిషన్ గన్స్ పట్టుకుని నిలబడి ఉన్నారు. ఈలోపు హౌస్‌లోని ఇమ్ముతో మాట్లాడుతూ.. ‘ఇమ్మానుయేల్.. సంజన, దివ్య ఎలిమినేషన్‌కు దగ్గరలో ఉన్నారు. నీ చేతిలో పవరాస్త్ర ఉంది. దానిని ఉపయోగించి ఈ వారం ఎలిమినేషన్‌ను నువ్వు క్యాన్సిల్ చేయవచ్చు. అంటే, ఈ వారం ఎలిమినేషన్ ఉండదు. ఈ పవరాస్త్రకు ఉన్న మూడో పవర్ వాడతావా? లేదంటే ఆడియెన్స్ జడ్జిమెంట్ ఫైనల్ అని వదిలేస్తావా?’ అని నాగార్జున అడిగారు. ఇమ్ము ఆలోచించుకుంటున్నారు. మొత్తంగా చూస్తే.. ఈ వారం ఎలిమినేషన్ మొత్తం ఇమ్ము చేతుల్లోనే ఉన్నట్లుగా తెలుస్తుంది. తన మమ్మీ అని పిలిచే సంజన కూడా ఎలిమినేషన్‌లో ఉంది కాబట్టి.. ఇమ్ము పవరాస్త్ర వాడి.. ఎలిమినేషన్ లేకుండా చేశాడనేలా టాక్ నడుస్తుంది. ఏ విషయం తెలియాలంటే.. ఇంకాస్త టైమ్ వెయిల్ చేయాల్సిందే.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Chamal Kiran Kumar Reddy: ట్రిపుల్ఆర్ మూసీ రీజువెనేషన్ కు కేంద్రం సహకరించాలి : ఎంపీ చామల కిరణ్​కుమార్ రెడ్డి

Srinivas Goud: బీసీలకు ప్రత్యేక మంత్రిత్వశాఖ లేదు : మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్

Balakrishna: బోయపాటి నోటి వెంట చిరు, ప్రభాస్ పేరు.. హర్టయిన బాలయ్య!

Tollywood: రషా తడానీ, హర్షాలి.. నెక్ట్స్ టాలీవుడ్‌ను ఊపేసే భామలు వీరేనా?

Sahakutumbanam: తన ఫ్రెండ్ చనిపోతే.. ఆసక్తికర విషయం చెప్పిన బుచ్చిబాబు సానా!