Harish Kalyan: హ‌రీష్ క‌ళ్యాణ్ నెక్ట్స్ ఫిల్మ్‌కు పవర్ ఫుల్ టైటిల్
Harish Kalyan Dashamakan (Image Source: X)
ఎంటర్‌టైన్‌మెంట్

Harish Kalyan: హ‌రీష్ క‌ళ్యాణ్ నెక్ట్స్ ఫిల్మ్‌కు పవర్ ఫుల్ టైటిల్.. ప్రోమో అదిరింది

Harish Kalyan: ‘పార్కింగ్’, ‘లబ్బర్ పంతు’ వంటి చిత్రాలతో హీరోగా మంచి పేరును సంపాదించుకుని, యంగ్ హీరోగా దూసుకెళుతోన్న హరీష్ కళ్యాణ్ (Harish Kalyan) తదుపరి సినిమాకు సంబంధించి మాసివ్ అప్డేట్‌ను మేకర్స్ వదిలారు. ఆయన నెక్ట్స్ చేయబోయే చిత్ర టైటిల్‌తో పాటు ప్రోమోను శనివారం మేకర్స్ విడుదల చేశారు. ఈ ప్రోమో చూస్తుంటే.. హరీష్ కళ్యాణ్ ఈసారి మాస్ హీరో అనిపించుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లుగా అర్థమవుతోంది. ఈ చిత్రానికి ‘దాషమకాన్’ (Dashamakan) అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఐడీఏఏ ప్రొడ‌క్ష‌న్స్‌, థింక్ స్టూడియోస్ బ్యాన‌ర్స్‌పై రూపుదిద్దుకుంటోన్న ఈ మాస్ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌‌‌ను వినీత్ వ‌ర‌ప్ర‌సాద్ స్వీయ ద‌ర్శ‌క నిర్మాణంలో రూపొందిస్తున్నారు. తెలుగు, త‌మిళ భాష‌ల్లో ఈ సినిమా రూపొందుతోంది. ఇక టైటిల్ ప్రకటిస్తూ విడుదల చేసిన ప్రోమో (Dashamakan Title Promo)ని గమనిస్తే..

Also Read- Akhanda 2: ‘ఓజీ’ రేంజ్‌లో కలెక్షన్స్ రాబడితేనే.. కొండంత బ్రేకీవెన్ టార్గెట్!

రెండు షేడ్స్ ఉన్న పాత్రలో

భారీ ట్రాఫిక్‌ను చూపిస్తూ ప్రోమో మొదలైంది. పేరు మోసిన రౌడీకి చెందిన కిరాయి రౌడీలు హీరోని వెతుక్కుంటూ.. అతను ఎక్కడ ఉన్నాడో, అతన్ని ఎలా తీసుకురావాలో.. మెయిన్ రౌడీని అడుగుతున్నారు. ఆ మెయిన్ రౌడీ.. హీరో గురించి చెబుతూ.. వాడు అక్కడికే వస్తున్నాడు. మీ మధ్యలో నుంచి వెళుతున్నాడు.. రోజ్ కలర్ బన్నీ వేసుకున్నాడు అని చెబుతుంటే.. హీరో తాపీగా ఆ విలన్ల మధ్యలో నుంచే వెళుతుండటం.. మాస్‌కి సరికొత్త నిర్వచనం చూపించినట్లుగా భావించవచ్చు. హీరో స్ట్రయిట్‌గా బాత్‌ రూమ్‌లోకి వెళ్లగా, మిగతా విలన్లు కూడా అతడ్ని వెంబడించి బాత్ రూమ్‌లోకి వెళతారు. అతను ఎప్పుడు బయటకు వస్తే అప్పుడు వేసేయడానికి రెడీగా ఉంటారు. అంతలోనే అటు వైపు నుంచి మెయిన్ రౌడీ.. ఎక్కడున్నారురా అని అడగగానే.. ‘వాడు బచ్చగాడు అన్నా.. దాషమకాన్‌లో ఉన్నాం.. వేసేసి కాల్ చేస్తాం’ అని విలన్ చెప్పగానే.. అక్కడికి ఎందుకు వెళ్లారురా? అని అటు వైపు నుంచి కాల్ కట్ అవుతుంది. అన్నని వేసేశారురా.. అంటూ వాయిస్.. అంతే హీరో ఫేస్‌ని అద్దంలో నుంచి రివీల్ చేసిన తీరు, అక్కడి నుంచి మొదలైన ర్యాప్.. చివరిలో చేతిలో చురకత్తిని తిప్పుతున్న తీరు, ఆ కత్తి మైక్‌గా మారడం చూస్తుంటే.. హరీష్ కళ్యాణ్ ఇందులో రెండు షేడ్స్ ఉన్న పాత్రలో నటించినట్లుగా అర్థమవుతోంది.

Also Read- Actress Hema: నా కేసు కొట్టేశారు.. పోయిన నా పరువును తీసుకొచ్చిస్తారా?

పక్కా మాస్ యాక్షన్ మూవీ

ఈ టైటిల్ ప్రోమో ఆసక్తికరంగా ఉండటమే కాకుండా, సినిమాపై అమాంతం అంచనాలను పెంచేసింది. హరీష్ కళ్యాణ్ ఇప్పటి వరకు చేయని భిన్నమైన రోల్ ఇదని చెప్పొచ్చు. పక్కా మాస్ యాక్షన్ మూవీలా అనిపిస్తోంది. ఓ వైపు మ్యూజిక్ బ్యాండ్‌తో పాట‌లు పాడితే.. మ‌రో వైపు మాస్ అవ‌తార్‌లో హరీష్ కళ్యాణ్ ఇందులో యాక్ష‌న్‌తో దుమ్మురేపుతున్నాడు. ఈ చిన్న ప్రోమోతోనే సినిమాపై హైప్ వచ్చేలా చేయడంలో మేకర్స్ సక్సెస్ అయ్యారు. హ‌రీష్ క‌ళ్యాణ్ స‌ర‌స‌న ప్రీతి ముకుంద‌న్ (Preity Mukhundhan) (‘కన్నప్ప’ ఫేమ్) హీరోయిన్‌గా న‌టిస్తోన్న ఈ సినిమాలో స‌త్య‌రాజ్‌, సునీల్ కీల‌క పాత్ర‌ల్లో క‌నిపించ‌బోతున్నారు. బ్రిట్టో మైకేల్ సంగీతాన్నిఅందిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన మ‌రిన్ని వివ‌రాల‌ను త్వరలోనే మేకర్స్ తెలియ‌జేయనున్నారు.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

MSG Boxoffice: ‘మన శంకరవరప్రసాద్ గారు’ నాలుగు రోజుల్లో బ్రేక్ ఈవెన్ దాటేశారు..

Labour Card: లేబర్ కార్డు అంటే ఏమిటి..? ఈ కార్డుతో కలిగే లాభాలేంటో తెలిస్తే మీరు షాక్ అవ్వడం ఖాయం..?

Slumdog Movie: పూరీ, సేతుపతి సినిమా టైటిల్ వచ్చేసింది.. ఏం ఉంది మామా..

CM Revanth Reddy: ప్రభుత్వానికి, ఆర్మీకి మధ్య సమస్యలు చర్చలతోనే పరిష్కారమవుతాయి: సీఎం రేవంత్ రెడ్డి

Bangladesh: బంగ్లాదేశ్‌లో మరో దారుణం.. ఓ ఉపాధ్యాయుడి ఇంటికి నిప్పు పెట్టిన దుండగులు