Dharma Mahesh: ధర్మ మహేష్.. తన కొడుకు బర్త్‌డే రోజు చేసిందిదే..
Dharma Mahesh Jismat (Image Source: X)
ఎంటర్‌టైన్‌మెంట్

Dharma Mahesh: హీరో ధర్మ మహేష్.. తన కొడుకు బర్త్‌డే రోజు ఏం చేశాడంటే?

Dharma Mahesh: ధర్మ మహేష్.. ఈ మధ్య ఈ పేరు సోషల్ మీడియాలో, టాలీవుడ్ సర్కిల్స్‌లో ఎలా వైరల్ అయిందో తెలియంది కాదు. టాలీవుడ్‌లో ‘సింధూరం’ (Sindhooram), ‘డ్రింకర్ సాయి’ (Drinker Sai) వంటి చిత్రాలలో నటించిన ధర్మ మహేష్ (Dharma Mahesh).. మరికొన్ని చిత్రాలను ప్లాన్ చేసుకుంటున్నారు. సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్‌గా నెటిజన్లకు నోటెడ్ అయిన ధర్మ మహేష్, హీరోగా చేసిన చిత్రాలతో ప్రేక్షకులకు కూడా బాగా పరిచయమయ్యారు. నటుడిగానే కాకుండా, జిస్మత్ జైల్ మండీతోనూ ఆయన ఫేమస్ అయ్యారు. జిస్మత్ మండి స్పెషల్ ఏంటంటే.. ప్రత్యేకమైన జైలు నేపథ్య వాతావరణంతో భోజన అనుభవాన్ని అందించడం. ఇప్పటికే మంచి పేరు తెచ్చుకున్న ఈ రెస్టారెంట్‌‌కు సంబంధించి మరో బ్రాంచ్‌ని ధర్మ మహేష్ తన కొడుకు జగద్వాజ పుట్టినరోజున అమీర్ పేట్‌లో ప్రారంభించారు. భోజన ప్రియులకు మొదటి ఆప్షన్‌గా ఉండేలా మెనూలో ఎప్పటికప్పుడు కొత్తదనం అందిస్తూ.. చికెన్, మటన్, చేపలు, పన్నీర్‌.. ఇలా శాకాహారం, మాంసాహారాలతో మంచి రుచితో అందుబాటులో ఈ మండీని ఉంచుతున్నామని ఈ సందర్భంగా ధర్మ మహేష్ తెలిపారు.

Also Read- Vijayasai Reddy: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి కీలక వ్యాఖ్యలు..!

Gismat నుంచి Jismat‌ గా

ఈ సందర్భంగా నటుడు ధర్మ మహేష్ మాట్లాడుతూ.. జిస్మత్ (Jismat) రెస్టారెంట్ నా కొడుకు జగద్వాజ పట్ల ఉన్న స్వచ్ఛమైన ప్రేమ నుంచి పుట్టింది. దీనిని రీ-బ్రాండింగ్ చేశాముడు. ఇప్పుడు Gismat నుంచి Jismat‌గా మార్చాము. ఇది నాణ్యత, భావోద్వేగం, వారసత్వం ద్వారా ప్రేరణ పొందిన కొత్త దశను సూచిస్తుంది, రుచిని అందిస్తుంది. భావోద్వేగపరంగా, ఈ మార్పు మరింత గొప్పగా సాగుతుంది. ఇక్కడ ప్రతి బిర్యానీ ప్లేట్, మా అతిథుల చిరునవ్వు, ఆహ్లాదాన్ని కలిగి ఉంటాయి. మేము అందించే రుచి, నాణ్యత, ఆప్యాయత ఈ మార్పు మరింత బలంగా పెరుగుతాయి. ఈ పరిణామం రాబోయే దశాబ్దాల పాటు బ్రాండ్‌‌ను బలోపేతం చేస్తుందని విశ్వసిస్తున్నాను’’ అని తెలిపారు.

Also Read- Prabhas Spirit: ప్రభాస్ ‘స్పిరిట్’ షూటింగ్ షురూ.. ప్రత్యేక అతిథిగా హాజరైన మెగాస్టార్ చిరంజీవి..

కుమారుడు జగద్వాజకు అంకితం

ధర్మ మహేష్ కంపెనీ యొక్క మొత్తం బాధ్యతలను తన కుమారుడు జగద్వాజకు అంకితం చేస్తున్నట్లుగా కూడా ఆయన చెప్పుకొచ్చారు. ఈ బ్రాండ్‌ను మరింతగా ప్రజలలోకి తీసుకు వెళ్లేందుకు, ఇతర కార్యకలాపాలు, విస్తరణను దగ్గరుండి పర్యవేక్షిస్తానని ధర్మ మహేష్ తెలిపారు. నాణ్యత విషయంలో అస్సలు రాజీ పడేదే లేదని ఈ సందర్భంగా ఆయన వెల్లడించారు. ప్రస్తుతం ఈ ప్రారంభోత్సవానికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ప్రారంభోత్సవంలో ధర్మ మహేష్ తల్లిదండ్రులు కూడా పాల్గొన్ని జ్యోతి ప్రజ్వలన చేశారు. తన యాక్టింగ్ కెరీర్‌కు సంబంధించి త్వరలోనే అప్డేట్ ఇస్తానని ఈ సందర్భంగా ఆయన చెప్పుకొచ్చారు.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Srinivas Goud: బీసీలకు ప్రత్యేక మంత్రిత్వశాఖ లేదు : మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్

Balakrishna: బోయపాటి నోటి వెంట చిరు, ప్రభాస్ పేరు.. హర్టయిన బాలయ్య!

Tollywood: రషా తడానీ, హర్షాలి.. నెక్ట్స్ టాలీవుడ్‌ను ఊపేసే భామలు వీరేనా?

Sahakutumbanam: తన ఫ్రెండ్ చనిపోతే.. ఆసక్తికర విషయం చెప్పిన బుచ్చిబాబు సానా!

Jailer 2: ‘జైలర్ 2’లో గెస్ట్ రెల్ చేసేది బాలయ్య కాదట.. ఎవరంటే?