Vijayasai Reddy: పవన్ కళ్యాణ్ పై విజయసాయి రెడ్డి కీలక వ్యాఖ్యలు
Vijayasai Reddy (imagecredit:twitter)
Political News, ఆంధ్రప్రదేశ్

Vijayasai Reddy: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి కీలక వ్యాఖ్యలు..!

Vijayasai Reddy: ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ (Pawan Kalyan)తో నాకు 20 ఏళ్ల స్నేహ బంధం ఉందని మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి (Vijayasai Reddy) అన్నారు. ఏ రోజూ పవన్ కళ్యాణ్‌ను ఒక్క మాట అనలేదని.. భవిష్యత్తులో కూడా ఆయనను ఏమి అననని ఇదే నా దృఢ సంకల్పమని అన్నారు. మనిషి స్వభావం, సందర్బాన్ని భట్టి ఏం చేయాలో నిర్ణయించుకోవాలని అన్నారు. ఈ ఒక్క సంవత్సరకాలంలో ప్రస్తుతమున్న సందర్బాన్ని బట్టి.. నేను రాజకీయాలకు దూరంగా ఉన్నానని ఆయన అన్నారు. మళ్లీ నా అవసరం వస్తే.. తప్పకుండా రాజకీయాల్లోకి వస్తానని తెలిపారు.

Also Read: Singur Project: సింగూరు ప్రాజెక్టు ఖాళీపై ఆందోళన వద్దు: ఈఎన్‌సీల బృందం

పవన్ కళ్యాణ్‌తో నాకు..

ఈ సందర్భంగా విజయసాయి రెడ్డి మాట్లాడుతూ.. నేను ఏ రాజకీయ పార్టీలో చేరాలనేది ఇప్పటి వరకు నిర్ణయించుకోలేదని అన్నారు. కొందరు నాపై రకరకాలుగా అనుకున్నారని, కొందరు బీజేపీ(BJP)లో, మరికొందరు తెలుగుదేశం పార్టీ(TDP)లో చేరిపోతున్నానని వార్తలు పుట్టిస్తున్నారు. అటు చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu), పవన్ కళ్యాణ్ (Pawan Kalyan)లతో చేతులు కలిపానని కూడా అంటున్నారు. కానీ ఒక్కటి మాత్రం చెప్తాను.. పవన్ కళ్యాణ్‌తో నాకు 20 ఏళ్ల స్నేహ బంధం ఉంది. కాకపోతే మా స్నేహం వేరు, రాజకీయం వేరని అన్నారు. నేను ఏ రోజూ పవన్ కళ్యాణ్‌ను ఒక్క మాట అనలేదు, భవిష్యత్తులో కూడా అనను.. ఇది నా దృఢ సంకల్పం. రాజకీయం విషయానికి వస్తే.. నేను ఏ పరిస్ధితిలో అయితే నిష్క్రమించానో, అవవరమైతే, అలాంటి సందర్భం వస్తే మళ్లీ రాజకీయాల్లోకి రావడానికి సిద్దంగా ఉన్నానని అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ (Congress) పార్టీ నుండి కానీ, కమ్యునిస్టుల నుంచిగానీ నాకు ఎలాంటి ఆహ్వానం రాలేదని తెలిపారు. ఒకవేళ ఆహ్వానం వచ్చినా.. ఆ పార్టీలలో చేరనని క్లారిటీగా చెప్పారు. ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలు సోషల్ మాధ్యమాలలో వైరల్ అవుతున్నాయి.

Also Read: Bigg Boss Telugu 9: ఫ్యామిలీ టైమ్ ఇంకా అయిపోలేదు.. తనూజకు గట్టిగా పడ్డాయ్

Just In

01

Collector Rahul Sharma: మినీ మేడారం జాతరకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలి.. కలెక్టర్ రాహుల్ శర్మ!

Hyderabad Crime: క్షణికావేశం..బంధాన్ని తుంచేసింది..పెగ్గు కొసం అన్నను చంపిన తమ్ముడు.. నాచారంలో దారుణ ఘటన!

The RajaSaab: ప్రభాస్ ‘ది రాజాసాబ్’ మొదటి వారం వసూళ్లు ఎంతంటే?.. కింగ్ సైజ్ బ్లాక్‌బాస్టర్..

Dragon Movie: ఎన్టీఆర్ సినిమాలో బాలీవుడ్ స్టార్ యాక్టర్.. వరుసగా రెండోసారి..

Bapatla SP: సైబర్ మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.. ఆ జిల్లా ఎస్పీ కీలక సూచనలు!