Prajavani: సోమవారం జిల్లా కలెక్టర్ అండ్ మెజిస్ట్రేట్ అద్వైత్ కుమార్ సింగ్, అదనపు కలెక్టర్లు (స్థానిక సంస్థలు) లెనిన్ వత్సల్ టోప్పో (రెవెన్యూ) కె.అనిల్ కుమార్ అన్ని విభాగాల అధికారులతో కలిసి కలెక్టరేట్ ప్రధాన సమావేశ మందిరంలో ప్రజా వాణి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లా వ్యాప్తంగా వివిధ సమస్యల పరిష్కారం నిమిత్తం ప్రజలు చేసుకున్న దరఖాస్తులను పరిశీలించి వెంటనే పరిష్కరించాలని, సంబంధిత అధికారులకు సూచించారు.
మొత్తం 72 దరఖాస్తులు
నేడు మొత్తం 72 దరఖాస్తులు వచ్చాయని అందులో అందులో రెవిన్యూ శాఖ 35, మున్సిపాలిటీ 13, పంచాయతీ రాజ్ శాఖ 05, జిల్లా అభివృద్ధి సంస్థ 05, గృహ నిర్మాణ శాఖ 03, గిరిజన సంక్షేమ శాఖ 02 చొప్పున వివిధ శాఖలకు దరఖాస్తులు వచ్చాయి. మహబూబాబాద్ మండలం కంబాలపల్లి గ్రామానికి చెందిన పర్వతపోజు సుమలత(Sumalatha) తాను క్రాఫ్ట్ కోర్సు పూర్తి చేసి ఖాళీగా ఉంటున్నానని తనకు కంబాలపల్లి పాటశాలలో ఖాళీగా ఉన్న క్రాఫ్ట్ టీచర్ ఉద్యోగం ఇప్పించాలని కోరారు. మహబూబాబాద్ పట్టణంలోని జగ్జీవన్ రాం నగర్ కాలనీ కి చెందిన అనంతుల కళ్యాణి(Kalyani) మొదటి జాబితాలో తన పేరు మీద ఇందిరమ్మ ఇల్లు మంజూరు అయినదని అట్టి మంజూరు అయినటువంటి ఇందిరమ్మ ఇల్లు ను ఇప్పించాలని కోరారు. సీరోలు మండలం కాంపెల్లి గ్రామానికి చెందిన బానోత్ ప్రవీణ్(Banothu Praveen) తనకు గత సంవత్సరం గిఫ్ట్ డీడ్ క్రింద భూమి రిజిస్ట్రేషన్ అయిందని అట్టి భూమి యొక్క పాసు పుస్తకాలని ఇప్పించాలని కోరారు. గూడూరు మండలం నాయకపల్లి గ్రామానికి చెందిన కోడి స్రావంతి(Kodi Sravanthi) తనకు వికలాంగుల సర్టిఫికేట్ వచ్చి 3 సంవత్సరాలు అవుతున్నప్పటికీ ఇంతవరకు వికలాంగుల పెన్షన్ పొందట్లేదని అట్టి వికలాంగుల పెన్షన్ ఇప్పించాలని కోరారు.
Also Read: Harish Rao: పాలమూరు ప్రాజెక్ట్‌పై ఒక్క అనుమతైనా తెచ్చారా? ప్రభుత్వంపై మాజీ మంత్రి హరీశ్ రావు ఫైర్!
ప్రజావాణి కార్యక్రమం
ఈ ప్రజావాణి కార్యక్రమంలో డీఆర్డిఓ(DRDO) ప్రాజెక్ట్ డైరెక్టర్ జి.మధుసూదన రాజు, జడ్పీ సీఈవో పురుషోత్తం, జిల్లా పశువైద్య అధికారి డాక్టర్ కిరణ్ కుమార్, ఏడి ఎస్ఎల్ఆర్ నరసింహ మూర్తి, జిల్లా ఉద్యానవన అధికారి జి. మరియన్నా, డిపిఓ హరిప్రసాద్, ఎస్సీ,బిసి, ఎస్టీ, మైనార్టీ అధికారులు శ్రీనివాస్, దేశీ రామ్ నాయక్, పరిశ్రమల అధికారి శ్రీమన్నారాయణ, సివిల్ సప్లై డిస్ట్రిక్ట్ మేనేజర్ కృష్ణవేణి, సిపిఓ శ్రీనివాస్, హౌసింగ్ ప్రాజెక్ట్ డైరెక్టర్ హన్మనాయక్, వెల్ఫేర్ అధికారిని సబిత, సివిల్ సప్లై అధికారి రమేష్, ఎంప్లాయిమెంట్ ఆఫీసర్ రజిత, మెప్మా ప్రాజెక్ట్ డైరెక్టర్ విజయ, కలెక్టరేట్ పరిపాలన అధికారి పవన్ కుమార్, పర్యవేక్షకులు మదన్ గోపాల్, రాజేష్, అన్ని విభాగాల జిల్లా అధికారులు పాల్గొన్నారు.
Also Read: Seethakka: సమ్మక్క చిలకలగుట్ట పవిత్రతను కాపాడాల్సిన బాధ్యత మనందరిది : మంత్రి సీతక్క!

