Collector Adwait Kumar Singh: ధాన్యం కొనుగోళ్ల నిర్వహణలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాని జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్(Advait Kumar Singh) అధికారులను ఆదేశించారు. మంగళవారం జిల్లా కలెక్టర్ అండ్ మెజిస్ట్రేట్ అద్వైత్ కుమార్ సింగ్ జిల్లాలో ధాన్యం కొనుగోళ్ల కేంద్రాల నిర్వహణపై విస్తృతంగా పర్యటించారు. మండలంలోని మూడుపూగల్, అయోధ్య, ఆమనగల్, ఐకెపి, సహకార శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు.
వేరువేరుగా ఏర్పాటు..
కేంద్రాల వద్ద రైతుల సౌకర్యార్థం త్రాగునీరు టెంట్స్ చైర్స్ సదుపాయాలు కల్పించాలని, సన్న వడ్లు, దొడ్డు వడ్లు కేంద్రాలను వేరువేరుగా ఏర్పాటు చేయాలన్నారు. కొనుగోళ్లు చేసి వెంట వెంటనే తరలించాలని వాతావరణ మార్పులు తదితర అంశాలపై రైతులకు సమాచారం అందించాలని సూచించారు. రవాణా చేయు విషయంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని, రైతు వివరాలు ఆన్లైన్ లో నమోదు చేసి డబ్బులు త్వరితగతిన వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు.
Also Read: Satish death Case: సీఐ మృతి కేసు దర్యాప్తు వేగవంతం.. సీసీటీవీ ఫుటేజీ పరిశీలించగా అర్థమైంది ఏంటంటే?
వేయింగ్ మిషన్స్ అందుబాటులో..
కేంద్రాలలో గన్ని సంచులు, తార్పాలిన్లు, మ్యాచ్చర్ మిషన్, ప్యాడీ క్లీనర్స్, వేయింగ్ మిషన్స్ అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు. కేంద్రాలలో ధ్యానం వచ్చే వివరాలు రిజిస్టర్ గన్ని సంచుల రిజిస్టర్, రైతుల వారి కొనుగోళ్ల చెల్లింపుల రిజిస్టర్,రవాణా, స్టాక్ రిజిస్టర్, లను పరిశీలించి రైతులతో మాట్లాడారు. ప్రత్యేక అధికారులు, అన్ని కేంద్రాలను పరిచిలించి రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ తనిఖీల్లో ఏడీఏ శ్రీవాసరావు, తహసిల్దార్ రాజేశ్వరరావు, ఏవో తిరుపతి రెడ్డి, సంబంధిత అధికారులు ఉన్నారు.
Also Read: Family Politics: మొన్న షర్మిల.. నిన్న కవిత.. నేడు రోహిణి.. పార్టీల్లో ఆడబిడ్డలకే గెంటివేతలు!
