CM Revanth (imagecredit:swetcha)
నార్త్ తెలంగాణ

CM Revanth: త్వరలో కొల్లాపూర్‌లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన

CM Revanth: రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి నాగర్‌కర్నూల్(Nagarkurnool) జిల్లాలోని కొల్లాపూర్(Kollapur) అసెంబ్లీ నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు, ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్న నేపథ్యంలో అందుకు అవసరమైన పూర్తి స్థాయిలో పకడ్భందీగా ఏర్పాట్లు చేయనున్నట్లు జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్(Collector Badawat Santosh) తెలిపారు. ఈ మేరకు కొల్లాపూర్ నియోజకవర్గంలో ముఖ్యమంత్రి పర్యటించనున్న ప్రాంతాలలో కలెక్టర్ సంతోష్, జిల్లా స్థాయి అధికారులతో కలిసి ఏర్పాట్లను పర్యవేక్షించారు. పెంటవెల్లి మండలం జటప్రొల్లో నిర్వహించనున్న బహిరంగ సభకు సంబంధించి అవసరమైన ఏర్పాట్లతో పాటు హెలీప్యాడ్, సభావేదిక, వీఐపీలు, ప్రజలకు సంబంధించి ఏర్పాట్లను కలెక్టర్ బాదావత్ సంతోష్, స్వయంగా పరిశీలించి అధికారులకు అవసరమైన సలహాలు, సూచనలు చేశారు.

అధికారులకు బాధ్యతలు
ఈ సందర్భంగా కలెక్టర్ బాదావత్ సంతోష్ మాట్లాడుతూ కొల్లాపూర్ నియోజకవర్గంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Revanth Reddy)పలు అభివృద్ధి పనులతో పాటు ఇప్పటికే పూర్తయిన పనులకు సంబంధించి ప్రారంబోత్సవాలు, నూతనంగా చేపట్టే వివిధ అభివృద్ధి పనులకు సంబంధించి శంకుస్థాపనలు చేస్తారని వివరించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి హాజరయ్యే ఈ కార్యక్రమానికి సంబంధించి ఇప్పటికే చేపట్టాల్సిన ఏర్పాట్లపై ఆయా శాఖల అధికారులకు బాధ్యతలు అప్పగించడంతో పాటు సభ పూర్తయ్యేంత వరకు చేపట్టాల్సిన పనుల గురించి సమన్వయంతో విధులు నిర్వర్తించేలా సూచించినట్లు పేర్కొన్నారు.

Also Read: MLC Kavitha: పోస్ట్ కార్డు ఉద్యమాన్ని ప్రారంభించిన కవిత.. బస్తీమే సవాల్

ప్రజాప్రతినిధుల వివరాలు సిద్దం
ముఖ్యమంత్రితో పాటు పలువురు మంత్రులు, ప్రజాప్రతినిధులు, నాయకులు హాజరు కానున్నందున సభాస్థలి వద్ద ఏర్పాట్లను కూడా సిద్దం చేసేందుకు ప్రణాళిక ప్రకారం ముందుకెళ్తున్నామన్నారు. దీంతో పాటు ముఖ్యమంత్రి వచ్చే సమయంలో హెలీప్యాడ్ ఏర్పాట్లు చేయడంతో పాటు వారికి స్వాగతం పలికే ప్రజాప్రతినిధుల వివరాలను కూడా సిద్దం చేస్తున్నట్లు కలెక్టర్ సంతోష్ తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రాకను విజయవంతం చేసి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఇప్పటి నుంచే అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని కలెక్టర్ బాదావత్ సంతోష్ స్పష్టం చేశారు. కలెక్టర్ వెంట కొల్లాపూర్ ఆర్డీవో బన్సీలాల్, ఎంపీడీవో దేవేందర్, ఎమ్మార్వో విజయ్ సింహ, అధికారులు, ప్రజాప్రతినిధులు, సిబ్బంది తదితరులు ఉన్నారు.

Also Read: Errolla Srinivas: కాంగ్రెస్ నేతలు నోరు తెరిస్తే బూతులే.. ఎర్రోళ్ల శ్రీనివాస్

 

Just In

01

Gopichand33: యాక్షన్ మోడ్‌లో గోపీచంద్.. తాజా అప్డేట్ ఇదే..

Premaledhani: ‘ప్రేమ లేదని’ గ్లింప్స్ విడుదల.. ఎలా ఉందంటే?

Taapsee Pannu: ముంబైలోనే ఉన్నా.. ఆ ప్రచారాలు ఆపండి

Jubilee Hills Bypoll: ఆ రెండు పార్టీల మధ్యే పోటీ!.. జూబ్లీహిల్స్ క్షేత్రస్థాయి పరిస్థితి ఇదే!

OG Movie: ఓటీటీలోనూ ఊచకోత మొదలెట్టిన ‘ఓజీ’.. 8 దేశాల్లో టాప్ 1 ప్లేస్‌లో!