Errolla Srinivas (imagecredit:swetcha)
Politics

Errolla Srinivas: కాంగ్రెస్ నేతలు నోరు తెరిస్తే బూతులే.. ఎర్రోళ్ల శ్రీనివాస్

Errolla Srinivas: కాంగ్రెస్ నేతలు రాజకీయాలను భ్రష్టు పట్టిస్తున్నారని, ఆ పార్టీ నేతలు మూతులు తెరిస్తే బూతులే అని టీఎస్ఎంఎస్ఐడీసీ మాజీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్(Errolla Srinivas) మండిపడ్డారు. తెలంగాణ భవన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ నాయకులను ఎలా సంభోదించాలో అర్థం కావడం లేదని, సంస్కారం మరచిపోయి వాళ్ళు విలువలు లేకుండా వ్యవహరిస్తున్నారని అన్నారు. గాంధీ భవన్‌(Gandhi Bhavan) ను గలీజు భవన్‌గా మార్చారని మండిపడ్డారు. గాంధీ ఆత్మ ఘోషించేలా వ్యవహరిస్తున్నారన్నారు. సబ్జెక్టు లేకనే కేసీఆర్(KCR), కేటీఆర్(KTR), హరీష్ రావు(Harish Rao)ల పై చవక బారు మాటలు మాట్లాడుతున్నారని అన్నారు.

వార్డు మెంబెర్‌కు ఎక్కువ ఎంపీకి తక్కువ
కాంగ్రెస్ నేతలకు చర్చ వద్దు రచ్చ కావాలన్నారు. చామల కిరణ్ కుమార్ రెడ్డి ఎంపీ కావడం భువనగిరి ప్రజల కర్మ అన్నారు. బేసిన్‌ల గురించి తెలియని చామల హరీష్ రావును విమర్శించడమా? వార్డు మెంబెర్‌కు ఎక్కువ ఎంపీకి తక్కువ అని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఎంపీ చామలకు చాటాకంతా దిమాక్ కూడా లేదని అన్నారు. తెలంగాణ(Telangana) మీద ప్రేమ లేని వారే కేసీఆర్‌(KCR)ను విమర్శిస్తారన్నారు. పందొమ్మిది నెలల పాలనలో తెలంగాణ కు అన్నింటా కాంగ్రెస్ అన్యాయం చేసిందన్నారు. చంద్రబాబు నీళ్లను తరలించుకుపోతుంటే ఆయన గురించి మాట్లాడకుండా కేసీఆర్ పై విమర్శలా? అని ఫైర్ అయ్యారు.

Also Read: KPHB Toddy Adulteration: కల్తీ కల్లు ఘటనపై ప్రభుత్వం సీరియస్

అస్తిత్వం మీద కాంగ్రెస్ నేతలు దాడి
హరీష్ రావు మాట్లాడేంత వరకు కాంగ్రెస్ నేతలు బనక చర్ల మీద మొద్దు నిద్ర వీడలేదని దుయ్యబట్టారు. కాంగ్రెస్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్లలో పస లేదని, పీపీటీ(PPT)లకు పవర్ ఖర్చు దండగ అన్నారు. అబద్దాల పునాదుల మీద కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిందన్నారు. పెర్సంటేజ్‌లు, కమీషన్లు కాంగ్రెస్ పాలనలో నిత్యకృత్యమయ్యాయన్నారు. తెలంగాణ అస్తిత్వం మీద కాంగ్రెస్(Congress)( నేతలు దాడి చేస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణ అస్తిత్వం కోసం మరో ఉద్యమం రాక తప్పదని పేర్కొన్నారు. ఆనాడైనా ఈనాడైనా తెలంగాణకు మొదటి ద్రోహి కాంగ్రెస్ పార్టీయే అన్నారు. సమావేశంలో నాయకులు మన్నె గోవర్ధన్ రెడ్డి, బొమ్మెర రామమూర్తి, కురువ విజయ్ కుమార్, అల్లీపురం వెంకటేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు.

Also Read: AirIndia Report: కరెక్ట్ కాదు.. ప్రాథమిక రిపోర్ట్‌పై పైలట్ల అసోసియేషన్ అభ్యంతరం

 

Just In

01

Gopichand33: యాక్షన్ మోడ్‌లో గోపీచంద్.. తాజా అప్డేట్ ఇదే..

Premaledhani: ‘ప్రేమ లేదని’ గ్లింప్స్ విడుదల.. ఎలా ఉందంటే?

Taapsee Pannu: ముంబైలోనే ఉన్నా.. ఆ ప్రచారాలు ఆపండి

Jubilee Hills Bypoll: ఆ రెండు పార్టీల మధ్యే పోటీ!.. జూబ్లీహిల్స్ క్షేత్రస్థాయి పరిస్థితి ఇదే!

OG Movie: ఓటీటీలోనూ ఊచకోత మొదలెట్టిన ‘ఓజీ’.. 8 దేశాల్లో టాప్ 1 ప్లేస్‌లో!