KPHB Toddy Adulteration ( IMAGE credit: twitter)
హైదరాబాద్

KPHB Toddy Adulteration: కల్తీ కల్లు ఘటనపై ప్రభుత్వం సీరియస్

KPHB Toddy Adulteration: కూకట్ పల్లిలో కల్తీ కల్లు సంఘటనలో 50 మందికి పైగా ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా, ఇప్పటికే ఏడుగురు బాధితులు మృత్యువాత పడ్డారు. ఈ ఘటనను ప్రభుత్వం సీరియస్‌గా తీసుకున్నది. ఈ క్రమంలో కల్తీ కల్లు సరఫరా చేసిన దుకాణాలపై తెలంగాణ ప్రభుత్వం సీరియస్ యాక్షన్ తీసుకునేందుకు ఆదేశాలు జారీ చేయడంతో (Balanagar Police) బాలానగర్ ఎక్సెస్ పోలీసులు  కూకట్ పల్లిలోని షంషిగూడ, హైదర్ నగర్, (Hyder Nagar) భాగ్య నగర్, సర్దార్ పటేల్ నగర్, సాయిచరణ్ కాలనీలోని కల్లు దుకాణాలను సీజ్ చేసి సీల్ వేశారు. కల్తీ కల్లుతో పలువురు అస్వస్థతకు గురైన వెంటనే కల్లు దుకాణాలకు వెళ్లి శాంపిల్స్ సేకరించిన అధికారులు, కల్లు లో మత్తు పదార్థాలు పెద్ద మోతాదులో కలిసినట్టు రుజువు అవడంతో శుక్రవారం సీజ్ చేశారు.

 Also Read: Mahesh Kumar Goud: కాంగ్రెస్ చేసిన పనికి కల్వకుంట్ల కవిత రంగులు

బాలానగర్ ఎక్సైజ్ సీఐ సస్పెండ్

ఘటనపై ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ శాఖ సైతం సీరియస్‌గా విచారణ జరుపుతున్నది. కల్లీ కల్లు విక్రయాలను నివారించడంలో విఫలం అవడంతో బాలానగర్ ఎక్సైజ్ (CI Venu Kumar) సీఐ వేణు కుమార్‌ను సస్పెండ్ చేశారు. అదే విధంగా జిల్లా టాస్క్ ఫోర్ అధికారి నర్సిరెడ్డి, ఈఎస్ ఫయాజ్, ఏఈఎస్ మాదవయ్య, ఏఈఎస్ జీవన్ కిరణ్‌ల పాత్రపై కూడా అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.

కల్లు డిపోలపై కన్నేసి పెట్టండి

మరోవైపు, కల్లు డిపోలపై కట్టుదిట్టమైన నిఘా పెట్టాలని ఎక్సైజ్, ప్రొహిబిషన్ కమిషనర్ హరికిరణ్ (Harikiran)​ ఆదేశాలు జారీ చేశారు. కల్లు కంపౌండ్ల నిర్వహణ, కల్లు వినియోగం, కల్తీ, అమ్మకాల్లో జరుగుతున్న తప్పిదాలపై ఎప్పటికప్పుడు సమీక్షిస్తుండాలన్నారు. కూకట్​‌పల్లి (Kukatpally) కల్తీ కల్లు సృష్టించిన విషాదం నేపథ్యంలో ఆయన ఆబ్కారీ భవన్‌లో ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్లతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, కల్తీ కల్లు విక్రయాలు జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలన్నారు.

విధుల్లో నిర్లక్ష్యం వహించినందు వల్లనే (Balanagar Excise) బాలానగర్ ఎక్సైజ్​ సీఐని సస్పెండ్​ చేయాల్సి వచ్చిందని చెప్పారు. దీనిని గుణపాఠంగా తీసుకుని అన్ని జిల్లాల్లో సిబ్బంది కల్తీ కల్లు, నాటు సారా తయారీ, అమ్మకాలు, రవాణాపై ఉక్కుపాదం మోపాలని సూచించారు. నాటు సారా, కల్తీ కల్లును అరికట్టటానికి దాడులను ముమ్మరం చేయాలన్నారు. ఇక, కానిస్టేబుల్ నుంచి హెడ్​ కానిస్టేబుల్​ ప్రమోషన్ల కోసం జోన్ల వారీగా జాబితాలను సిద్ధం చేసి ఇవ్వాలని సూచించారు.

 Also Read: Harish Rao: క్యాబినెట్ ఆమోదాలు ఉన్నాయి.. ఆ తరువాతే బ్యారేజీల నిర్మాణం

Just In

01

Bhatti Vikramarka: విద్యారంగం పై ఊహించని రీతిలో సర్కారు పెట్టుబడులు

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ గురించి బ్లాక్ బస్టర్ న్యూస్ చెప్పిన దేవీ శ్రీ ప్రసాద్..

Telangana Politics: కాంగ్రెస్‌లో ఉత్కంఠం.. ఏఐసీసీలో కవిత ఎపిసోడ్..?

Harish Rao: పాలకులే నెగిటివ్ మైండ్ సెట్.. అభివృద్ధి ఎలా సాధ్యం..?

Ashish Warang death: ప్రముఖ నటుడు కన్నుమూత.. సోకసంద్రంలో ఇండస్ట్రీ