Harish Rao(image crediT: twitter)
Politics

Harish Rao: క్యాబినెట్ ఆమోదాలు ఉన్నాయి.. ఆ తరువాతే బ్యారేజీల నిర్మాణం

Harish Rao: క్యాబినెట్​ ఆమోదాలు లభించిన తరువాతే మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నిర్మాణం జరిగిందని మాజీ మంత్రి హరీశ్ రావు (Harish Rao) చెప్పారు. వీటికి సంబంధించి ఆరుసార్లు క్యాబినెట్​ ఆమోదాలు ఉన్నాయని, మూడుసార్లు శాసనసభ ఆమోదం కూడా ఉందని తెలిపారు. ఎప్పుడెప్పుడు ఈ నిర్ణయాలు, ఆమోదాలు జరిగాయన్న సమాచారాన్ని జస్టిస్​ పీసీ ఘోష్ కమిషన్‌కు అందచేశామన్నారు. కమిషన్​ విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో ఏయే వివరాలను అందించామన్నది ఇప్పుడే బయటకు చెప్పలేనన్నారు.

కాళేశ్వరంపై విచారణ జరుపుతున్న కమిషన్ ఎదుట హాజరైన హరీశ్ రావు (Harish Rao) ప్రాజెక్టుకు సంబంధించిన అదనపు సమాచారాన్ని అందించారు. బయటకు వచ్చిన తరువాత మీడియాతో మాట్లాడుతూ, కమిషన్​‌కు ఇచ్చిన సమాచారం వివరాలను ఇవ్వాలని ప్రభుత్వాన్ని అడిగినా ఇవ్వడం లేదన్నారు. పారదర్శకంగా ఉంటే ఆ వివరాలను ఇవ్వాలన్నారు. కమిషన్‌ను తప్పుదోవ పట్టించే విధంగా ప్రభుత్వం వివరాలు ఇచ్చినట్టుగా తమకు అనుమానాలు ఉన్నాయన్నారు. నిజానికి గురువారమే కమిషన్ ఎదుట రావాల్సి ఉండగా (KCR) కేసీఆర్‌కు వైద్య పరీక్షలు ఉండడంతో రాలేక పోయానన్నారు.

మీడియాలో తప్పుడు వార్తలు వస్తున్న నేపథ్యంలో మా వద్ద ఉన్న సమాచారాన్ని కమిషన్​‌కు అందించామన్నారు. ప్రస్తుతం తాము అధికారంలో లేమని చెబుతూ అన్ని డాక్యుమెంట్లు ప్రభుత్వం వద్ద ఉంటాయన్నారు. అప్పట్లో బ్యారేజీల నిర్మాణాలకు సంబంధించి తీసుకున్న క్యాబినెట్​ నిర్ణయాలు, నోట్లు తదితర సమాచారాన్ని ఇవ్వాలని ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి, జీఏడీ కార్యదర్శి, ఇరిగేషన్ కార్యదర్శికి లేఖలు రాసినా వారి నుంచి స్పందన రాలేదన్నారు.

 Also Read: MLA Raja Singh: బీఆర్ఎస్ కాంగ్రెస్‌లో చేరుతున్నట్లు వార్తలొస్తున్నాయి

అది కవర్​ పాయింట్ ప్రజెంటేషన్
కాళేశ్వరంపై ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy)  ఇచ్చింది పవర్​ పాయింట్ ప్రజెంటేషన్​ కాదని, కవర్ పాయింట్ ప్రజెంటేషన్​ అని వ్యాఖ్యానించారు. (Congress Party) కాంగ్రెస్​ పార్టీది 50 సంవత్సరాల ద్రోహ చరిత్ర అని విమర్శించారు. తెలంగాణను ఆంధ్రలో కలిపింది కాంగ్రెస్ (Congress) ​ పార్టీయేనన్నారు. నీళ్లను ఆంధ్రకు వదిలి పెట్టి తెలంగాణకు ద్రోహం చేసింది కాంగ్రెస్ పార్టీయే (Congress  Party) ) ​ అన్నారు. సీఎం అజ్ఞానం, అహంకారంతో మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. నీళ్లకు సంబంధించి శాశ్వత ఒప్పందం చేసుకున్నామంటూ పదే పదే అబద్ధాలు చెప్పడం సిగ్గు చేటన్నారు.

తాత్కాలిక నీటి వినియోగం, నీటి పంపకానికి కూడా సీఎంకు తేడా తెలియదని వ్యాఖ్యానించారు. నీటి వినియోగం కేఆర్​ఎంబీ చేస్తుందని, పంపకం ట్రైబ్యునల్​ చేస్తుందని చెప్పారు. నీటి వినియోగం ఆ ఏడాదికి మాత్రమే పరిమితమై ఉంటుందని చెప్పారు. నీటి పంపకం శాశ్వతమైందన్నారు. శాశ్వత నీటి పంపకానికి తాము సంతకాలు పెట్టామని చెప్పడం పూర్తిగా అవాస్తవమన్నారు. అసమర్థులైన కాంగ్రెస్ నాయకుల వల్లనే నీటి విషయంలో తెలంగాణకు అన్యాయం జరుగుతోందన్నారు. గోదావరి జలాల్లో తెలంగాణకు 968 టీఎంసీలు ఇచ్చింది కాంగ్రెస్సే అని గొప్పలు చెబుతున్న సీఎం కృష్ణా జలాల్లో కేవలం 299 టీఎంసీలు మాత్రమే ఇచ్చి అన్యాయం చేసిన విషయాన్ని ఎందుకు దాచి పెడుతున్నారన్నారు.

మీ ముత్తాతలు కూడా పుట్టలేదు
ఉమ్మడి రాష్ట్రంలో 54 లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చినట్టు సీఎం చెప్పడం హాస్యాస్పదమన్నారు. రేవంత్ రెడ్డి ముత్తాత పుట్టక ముందున్న ఆయకట్టును కూడా ఆయన కలుపుకొని చెబుతున్నారన్నారు. 4‌‌‌‌00 యేళ్ల కింద కాకతీయ, రెడ్డి రాజులు కట్టించిన చెరువులు కూడా కాంగ్రెస్​ . (Congress )కట్టినట్టు చెబుతున్నారన్నారు. నిజాం నవాబులు కట్టిన ప్రాజెక్టులను కూడా తన పార్టీ ఖాతాలో వేసుకున్నారన్నారు. ఆంధ్రప్రదేశ్ ఏర్పాటుకు ముందే ఇక్కడ 16లక్షల ఎకరాలకు నీటి పారుదల సౌకర్యం ఉన్నట్టు చెప్పారు. దీనిని కూడా కలిపేసుకుని 54 లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చినట్టుగా సీఎం చెబుతున్నారన్నారు. బీఆర్​ఎస్​ హయాంలో 17లక్షల ఎకరాలకు కొత్తగా ఆయకట్టు ఇవ్వడంతోపాటు 31లక్షల ఎకరాల స్థిరీకరణ చేసినట్టు చెప్పారు. పదేళ్ల కాంగ్రెస్​ ఇచ్చింది కేవలం ఆరు లక్షల ఎకరాలు మాత్రమే అని తెలిపారు.

 Also Read: Hyderabad Commissioner: లాల్​ దర్వాజాకు సీపీ.. బోనాలకు పటిష్ట బందోబస్తు

వ్యాప్కోస్​ సూచిస్తేనే
వ్యాప్కోస్​ సూచిస్తేనే మేడిగడ్డ దగ్గర బ్కారేజీ కట్టినట్టు హరీశ్​ రావు చెప్పారు. తమ్మిడిహట్టి వద్ద 160 టీఎంసీల నీళ్ల లభ్యత లేదన్నారు. అక్కడ కేవలం 102 టీఎంసీలు మాత్రమే ఉన్నాయని, దాంట్లో కేవలం 44 టీఎంసీలు మాత్రమే తీసుకోవచ్చని తేలిందని చెప్పారు. ఇక, తమ్మిడిహట్టి వద్ద ప్రాజెక్ట్​ నిర్మాణానికి వైల్డ్ లైఫ్​ ఉండటం వల్ల అనుమతులు రాలేదన్నారు. మేడిగడ్డ వద్ద 282 టీఎంసీల నీటి లభ్యత ఉందన్నారు. జలాశయాల సామర్థ్యం, నీటి వినియోగం, ఆయకట్టు, పంపింగ్ సామర్థ్యం, భూసేకరణ పరిహారం పెరిగాయి కాబట్టే అంచనాలు కూడా పెరిగాయన్నారు.

మైక్​ కట్​ చెయ్యొద్దు.. వాయిదా వెయ్యొద్దు
అసెంబ్లీలో చర్చకు తాము సిద్ధంగా ఉన్నామని హరీశ్​ రావు ( Harish Rao)  చెప్పారు. కానీ, మాట్లాడుతున్నప్పుడు మైక్ కట్​ చెయ్యొద్దని, అసెంబ్లీని వాయిదా వేసి పారిపోవద్దన్నారు. రోజులో ఎన్ని గంటలైనా చర్చకు సిద్ధమన్నారు. అధికారంలోకి వచ్చి20 నెలలైందని, ఒక్క చెరువు తవ్వలేదని, ఒక్క చెక్​ డ్యాం కట్టలేదని, ఒక్క ప్రాజెక్టు లేదని, అయినా 283 లక్షల టన్నుల పంట పండిందని సీఎం చెబుతున్నారన్నారు. అది ఎలా సాధ్యమయ్యిందో వివరించాలని డిమాండ్ చేశారు.

 Also Read: Baby Planning: 30 ఏళ్లు దాటాక.. పిల్లలు కష్టమే.. నిపుణుల సలహాలివే!

Just In

01

Telangana Jagruthi: తెలంగాణ జాగృతి సంస్థ నాయకులు ఫైర్.. కారణం అదేనా..?

Crime News: తీరుమారని గంజాయి పెడ్లర్ పై పీడీ యాక్ట్.. ఉత్తర్వులు జారీ!

Crime News: హైదరాబాద్‌లో దారుణం.. మార్ఫింగ్ ఫోటోలతో యవతికి బెదిరింపులు

Teja Sajja: టాలీవుడ్ హీరోల గురించి ఎవరికీ తెలియని విషయం చెప్పిన తేజ సజ్జా.. ఇలా కూడా ఉంటుందా?

Balapur Laddu Auction 2025: బాలాపూర్ లడ్డు సరికొత్త రికార్డ్.. ఈసారి ఎన్ని రూ.లక్షలు పలికిందంటే?