Air India Crash
జాతీయం, లేటెస్ట్ న్యూస్

AirIndia Report: కరెక్ట్ కాదు.. ప్రాథమిక రిపోర్ట్‌పై పైలట్ల అసోసియేషన్ అభ్యంతరం

AirIndia Report: ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఎయిరిండియా బోయింగ్ డ్రీమ్‌లైనర్ విమాన ప్రమాద దుర్ఘటనపై ఎయిర్‌క్రాఫ్ట్‌ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్‌ బ్యూరో (ఏఏఐబీ) ప్రాథమిక రిపోర్టును విడుదల చేసిన విషయం తెలిసిందే. ఒక సెకన్ తేడాతో రెండు ఇంజిన్‌‌లకు సంబంధించిన ఫ్యూయల్ కంట్రోల్‌ స్విచ్‌లు ఒకదాని తర్వాత ఒకటి ఆగిపోయాయని, వాటిని తిరిగి రన్‌ చేసేందుకు పైలట్లు ప్రయత్నించినట్టు పేర్కొంది. ఒక ఇంజిన్ పాక్షికంగా పనిచేయగా, రెండో ఇంజిన్ పనితీరులో రికవరీ లేదని ప్రిలిమినరీ రిపోర్టులో వెల్లడైంది. అయితే, ఈ రిపోర్టుపై ఎయిర్ లైన్ పైలట్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ALPA) తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. పైలట్లు తప్పు చేశారనే కోణంలోనే దర్యాప్తు నడుస్తోందంటూ అసంతృప్తి వ్యక్తం చేసింది. ప్రమాదానికి గురైన విమానాన్ని 15,638 గంటల ఫ్లయింగ్ అనుభవం ఉన్న సుమీత్ సబర్వాల్, 3,403 గంటల ఫ్లయింగ్ అనుభవం ఉన్న కో-పైలట్ క్లైవ్ కుందర్ (వయసు 32) నడిపారని ప్రస్తావించింది.

ఏఎల్‌పీఏ ఇండియా అధ్యక్షుడు కెప్టెన్ సామ్ థామస్ మాట్లాడుతూ, దర్యాప్తు ముందు నుంచే పైలట్లే తప్పు చేశారని ఊహించుకుంటూ సాగుతోందని, దీనిని తీవ్రంగా ఖండిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. అలాగే, ఈ దర్యాప్తు కూడా చాలా రహస్యంగా సాగుతోందని, విచారణలో పాల్గొంటున్న వ్యక్తుల అర్హతలపై కూడా అనుమానాలు ఉన్నాయని ఆయన సందేహం వ్యక్తం చేశారు. అత్యంత కీలకమైన దర్యాప్తుల్లో సరైన అర్హతలు ఉన్న నిపుణులను భాగస్వామ్యం చేయడంలేదని సామ్ థామస్ ఆరోపించారు. జూలై 10న వాల్ స్ట్రీట్ జర్నల్‌లో వచ్చిన కథనంలో ఫ్యూయల్ కంట్రోల్ స్విచ్‌లు పొరపాటున పొజిషన్ మారినట్లు’ ప్రచురించడంపై అసోసియేషన్ విస్మయం వ్యక్తం చేసింది. ఈ సమాచారం బయటవాళ్లకు ఎలా వెళ్లిందని ప్రశ్నించింది.

Read Also- Lords Test: లార్డ్స్‌లో పంత్ సంచలనం.. క్రికెట్ దిగ్గజం వివ్ రిచర్డ్స్ రికార్డ్ బ్రేక్

ఎవరూ సంతకం చేయలేదు
ప్రిలిమినరీ రిపోర్టుపై ఎవరూ సంతకం చేయకపోవడంపై కూడా ఏఎల్‌పీఏ అనుమానం వ్యక్తం చేసింది. రిపోర్టును మీడియాకు లీక్ చేశారని మండిపడింది. పైలట్ల ప్రతినిధులను కనీసం ఆబ్జర్వర్‌గానైనా దర్యాప్తులో భాగస్వామ్యం చేయాలని విజ్ఞప్తి చేసింది. “దర్యాప్తులో పాల్గొనడానికి మమ్మల్ని అనుమతిస్తే, దర్యాప్తు పారదర్శకంగా సాగుతుంది” అని పేర్కొంది. కాగా, పౌర విమానయాన మంత్రి రామ్ మోహన్ నాయుడు శనివారం మీడియాతో మాట్లాడుతూ, ఇది కేవలం ప్రాథమిక నివేదిక మాత్రమేనని అన్నారు. ఈ రిపోర్టు ఆధారంగా ప్రజలు, మీడియా తుదినిర్ణయానికి రావొద్దని కోరారు. పైలట్లు, సిబ్బందిపై తనకు పూర్తి విశ్వాసం ఉందని ఆయన వ్యాఖ్యానించారు.

Read Also- Viral News: గుహలో రష్యన్ మహిళ, ఇద్దరు పిల్లలు.. కర్ణాటకలో షాకింగ్ ఘటన

ఏఏఐబీ ప్రాథమిక నివేదిక ఇదే
ఏఏఐబీ ప్రిలిమినరీ రిపోర్ట్ ప్రకారం, జూన్ 12న ఎయిరిండియా బోయింగ్ డ్రీమ్‌లైనర్ విమానం టేకాఫ్ అయిన కొన్ని సెకన్లలోనే రెండు ఫ్యూయల్ కంట్రోల్ స్విచ్‌లు రన్ నుంచి కట్ ఆఫ్‌కు మారిపోయాయని పేర్కొంది. ఈ కారణంగా ఇంజిన్లు ఆగిపోయినట్టు పేర్కొంది. కాక్‌పిట్ వాయిస్ రికార్డర్‌లో నమోదైన పైలట్ల సంభాషణను కూడా ప్రస్తావించింది. ‘నువ్వు ఫ్యూయల్ ఎందుకు ఆపావ్?’ అని ఒక పైలట్ ప్రశ్నించగా.. ‘నేను అలా చేయలేదు’ అంటూ మరో పైలట్ సమాధానం ఇచ్చాడు. అయితే, స్విచ్‌లను పొరపాటున తాకారా లేక ఉద్దేశపూర్వకంగా మార్చారా అన్నది మాత్రం రిపోర్టులో స్పష్టంగా పేర్కొనలేదు. అంతేకాదు, ఫ్యూయల్ కంట్రోల్ గేట్స్ సరిగా ఉండకపోవచ్చని కూడా సందేహాలు వ్యక్తం చేశారు.

 

Just In

01

Bhatti Vikramarka: విద్యారంగం పై ఊహించని రీతిలో సర్కారు పెట్టుబడులు

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ గురించి బ్లాక్ బస్టర్ న్యూస్ చెప్పిన దేవీ శ్రీ ప్రసాద్..

Telangana Politics: కాంగ్రెస్‌లో ఉత్కంఠం.. ఏఐసీసీలో కవిత ఎపిసోడ్..?

Harish Rao: పాలకులే నెగిటివ్ మైండ్ సెట్.. అభివృద్ధి ఎలా సాధ్యం..?

Ashish Warang death: ప్రముఖ నటుడు కన్నుమూత.. సోకసంద్రంలో ఇండస్ట్రీ