Rare Mineral In Karre Gutta ( image CREDIT: AL OR GROK3 OR TWIITTER)
నార్త్ తెలంగాణ

Rare Mineral In Karre Gutta: అధికారికంగా 30 లక్షలు.. అనధికారికంగా కోటిపైనే చెట్లను నరికేందుకు స్కెచ్!

Rare Mineral In Karre Gutta: తెలంగాణ ఛత్తీస్‌గఢ్ సరిహద్దు ప్రాంతంలో నిక్షిప్తమై ఉన్న కర్రెగుట్టల్లో రేర్ ఖనిజం ఉందంటూ అటు కేంద్ర ప్రభుత్వం ఇటు చత్తీస్గడ్ ప్రభుత్వాలు ప్రత్యేకమైన ప్రణాళిక రచించి ముందుకు వెళ్తున్నాయి. ఆపరేషన్ కగార్ (Operation Kagar)  లో భాగంగా మావోయిస్టులు తలదాచుకున్నారనే నేపథ్యంలో ఆపరేషన్ కర్రెగుట్టలు పేరిట మావోయిస్టులను ఏరి వేసే పనిలో అటు కేంద్ర ప్రభుత్వం ఇటు ఛత్తీస్‌గఢ్ (Chhattisgarh)ప్రభుత్వాలు భద్రతా బలగాలతో జల్లెడ పట్టి మట్టుపెట్టాయి.

అనతి కాలంలోనే కర్రెగుట్టల ప్రాంతం నుంచి మావోయిస్టులు తమ ఉనికిని చాటుకునేందుకు అక్కడి నుంచి చాకచక్యంగా తప్పించుకు వెళ్ళిపోయారు. దాదాపు కేంద్రం, ఛత్తీస్‌గఢ్ (Chhattisgarh) రాష్ట్ర భద్రతా బలగాలు దాదాపు 12 వేల నుంచి 20వేల వరకు కర్రెగుట్టల ప్రాంతంలో మోహరించాయి. అంతేకాకుండా ఎన్ఐఏ చీఫ్ తఫన్ డేక సైతం అక్కడ పరిస్థితులపై పర్యవేక్షించేందుకు వచ్చారంటే కర్రెగుట్టల ప్రాంతంలో ఏం జరుగుతుందో అర్థం చేసుకునే పరిస్థితి నెలకొంది. ఎట్టకేలకు అటు ఆపరేషన్ సింధూర్… ఇటు ఆపరేషన్ కగార్ లను ఒక్కసారి కేంద్ర ప్రభుత్వం రద్దు చేసుకోవడం అప్పట్లో చర్చనీయాంశంగా మారింది.

 Also Read: Mulugu District: హిడ్మా తప్పించుకున్నాడా? కర్రెగుట్టల వద్ద మళ్లీ కూంబింగ్

అందుకేనా పర్యాటక ప్రాంతం..?
ఆపరేషన్ కగార్(Operation Kagar)నిర్వహిస్తున్న సమయంలో మావోయిస్టులు ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం నుంచి తెలంగాణ.. ఛత్తీస్‌గఢ్ (Chhattisgarh) రాష్ట్రాల సరిహద్దు ప్రాంతమైన, మావోయిస్టులకు స్వర్గధామం అయిన కర్రెగుట్టల ప్రాంతానికి మావోలు చేరుకున్నారు. నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ద్వారా విషయం తెలుసుకున్న కేంద్ర ఛత్తీస్‌గఢ్ రాష్ట్ర భద్రత బలగాలు మూకుమ్మడిగా కర్రెగుట్టలకు ప్రాంతానికి చేరుకున్నాయి. ఆ క్రమంలో జరగాల్సిన చర్యంత జరిగిపోయింది. ఆ తర్వాత అతికొద్ది సమయంలోనే మావోయిస్టు కార్యకలాపాలపై ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసిన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ (Home Minister Amit Shah)షా కర్రెగుట్టల ప్రాంతాన్ని దేశంలోనే అతిపెద్ద పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు ప్రణాళిక రూపొందించాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

ఈ నేపథ్యంలో అధికారులు వడివడిగా అడుగులు వేస్తూ కర్రెగుట్టల ప్రాంతాన్ని పర్యాటక రంగంగా తీర్చిదిద్దేందుకు శాయశక్తుల పనిచేస్తున్నారు. అయితే కర్రెగుట్టల ప్రాంతంలో రేర్ ఖనిజం ఉందని కేంద్ర ప్రభుత్వం గుర్తించిందా.. అంటే అందుకు అవుననే సమాధానం వెలువడుతోంది. కర్రెగుట్టల ప్రాంతంలో రేర్ ఖనిజం ఉన్నదని కేంద్ర ప్రభుత్వం 2014లోనే గుర్తించినట్లుగా చర్చలు కూడా సాగుతున్నాయి. ఆ క్రమంలోనే అటు మావోయిస్టుల కార్యకలాపాలను రూపుమాపడంతో పాటు దేశంలోనే అతిపెద్ద పర్యాటక రంగంగా తీర్చిదిద్దేందుకు, కర్రెగుట్టల ప్రాంతంలో నిక్షిప్తమై ఉన్న 97 రకాల సహజ వనరుల లను సైతం కాపాడుకునేందుకు కేంద్ర ప్రభుత్వం పెద్ద ప్రణాళికనే రూపొందించినట్లుగా తెలుస్తోంది.

పర్యాటక ప్రాంతం చేస్తే 30 లక్షల చెట్లను నరికి వేయాలా…?
కర్రెగుట్టల ప్రాంతాన్ని దేశంలోనే అతిపెద్ద పర్యాటక రంగంగా తీర్చిదిద్దేందుకు అక్కడ ఉన్న 30 లక్షల చెట్లను నరికి వేయాలా…? అనే ప్రశ్నలు తెరపైకి వస్తున్నాయి. పర్యాటక రంగం చేయాలంటే చెట్లను నరకాల్సిందేనా.. అంటూ ఆదివాసి ప్రాంతాల ప్రజలు కేంద్ర ఛత్తీస్‌గఢ్ (Chhattisgarh) రాష్ట్రాల ను ప్రశ్నిస్తున్నారు. ఆదివాసి, ఏజెన్సీ ప్రాంతాల్లో అత్యవసరమైన పాఠశాలలు, వైద్యశాలలు నిర్మించాలంటే అటవీ శాఖ నుంచి సరైన అనుమతులు లభించడం లేదు. దీంతో ప్రత్యామ్నాయ వసతుల కల్పన కోసం కంటైనర్లను ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు అందుబాటులోకి తీసుకొస్తున్నాయి. ఆదివాసి లకు వసతుల కల్పన కోసం మహా అంటే 300 గజాల నుంచి 400 గజాల స్థలం మేరకు అవసరం ఉంటుంది. అలాంటి వాటికి అటవీ శాఖ నుంచి అనుమతులు కఠినతరమైతే మరి అభివృద్ధి పేరుతో అధికారికంగా 30 లక్షల చెట్లను… అనధికారికంగా కోటిపైగా చెట్లను కేంద్ర ప్రభుత్వం నరికించే ప్రక్రియ చర్యను ఏమంటారో… సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉంది.

5 వ షెడ్యూల్ లో పది రాష్ట్రాల్లో 97 రకాల సహజ వనరులు.. ఆరవ షెడ్యూల్లో ఐదు రాష్ట్రాల్లో 28 రకాల వనరులు
ఐదవ షెడ్యూల్లో ఏజెన్సీ ఆదివాసి ప్రాంతాల రాష్ట్రాలు దాదాపు పది ఉంటాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, చత్తీస్గడ్, మధ్యప్రదేశ్, ఒరిస్సా, మహారాష్ట్ర, హిమాచల్ ప్రదేశ్, ఝార్ఖండ్, రాజస్థాన్, గుజరాత్ రాష్ట్రాల్లో 97 రకాల సహజ వనరులు ఉన్నాయని చరిత్ర చెబుతోంది. అదేవిధంగా ఆరవ షెడ్యూల్లోని అస్సాం మేఘాలయ మిజోరం రాష్ట్రాల్లో 28 రకాల సహజ వనరులు ఉన్నట్లుగా లెక్కలు చెబుతున్నాయి. అయితే ఫిఫ్త్ షెడ్యూల్, సిక్స్త్ షెడ్యూల్ లలో మొత్తం రాష్ట్రాలు 14 ఉన్నాయి.

అందులో తెలంగాణ.. ఛత్తీస్‌గఢ్ (Chhattisgarh) రాష్ట్ర సరిహద్దు ప్రాంతమైన కర్రెగుట్టల అటవీ ప్రాంతంలో రేర్ ఖనిజం ఉన్నట్లుగా కేంద్ర ప్రభుత్వం గుర్తించినట్లు తెలుస్తోంది. ఈ మేరకే అభివృద్ధి మంత్రం జపిస్తూ దేశంలోనే అతిపెద్ద పర్యాటక ప్రాంతంగా కర్రెగుట్టల ను తీర్చిదిద్దేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోంది. ఇదే జరిగితే ఇటు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం.. అటు ఛత్తీస్‌గఢ్ రాష్ట్ర ప్రభుత్వాలకు మంచి పేరు ప్రఖ్యాతలు గడించనున్నాయి. అయితే అభివృద్ధి దేశానికి అవసరమే అయినప్పటికీ ఆదివాసీ ప్రాంతాల ఏజెన్సీ గ్రామాల్లోని పాఠశాలలు, వైద్యశాలలో నిర్మించేందుకు ఎందుకు ఇంత కఠినతరమైన అటవీశాఖ వ్యవహరిస్తోందని ఆదివాసి గ్రామాల ప్రజలు నిలదీస్తున్నారు.

 Also Read:Warangal Commissionerate: మావోలకు ఎదురు దెబ్బ.. లొంగిపోయిన 14 మంది మావోయిస్టులు! 

Just In

01

The Raja Saab: ప్రభాస్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ‘ది రాజాసాబ్’ ట్రైలర్ వచ్చేది ఎప్పుడంటే?

Warangal District: హన్మకొండలో అతిపెద్ద దుర్గామాత మట్టి విగ్రహం.. ఎత్తు ఎంతో తెలుసా..!

Guinness Record: గిన్నిస్ రికార్డ్ బద్దలు కొట్టిన.. ఇండియన్ స్టీల్ మ్యాన్.. 261 కేజీలను అలవోకగా!

Nagarjuna Akkineni: ప్రతి దానిలోకి మమ్మల్ని లాగొద్దు.. హైకోర్టును ఆశ్రయించిన నాగార్జున

Local Body Elections: స్థానిక ఎన్నికల కోసం ప్రభుత్వం జీవో పై కసరత్తు.. మరోవైపు అధికారులకు ట్రైనింగ్!