Warangal Commissionerate(image credit:x)
తెలంగాణ

Warangal Commissionerate: మావోలకు ఎదురు దెబ్బ.. లొంగిపోయిన 14 మంది మావోయిస్టులు!

Warangal Commissionerate: ఒకవైపు ఆపరేషన్ కాగర్ పేరుతో మావోయిస్టులను తుడముట్టించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపడుతుండగా మరోవైపు వరుసగా మావోయిస్టు సభ్యులు పోలీసులకు లొంగిపోతుండడం ఆ పార్టికి మరో ఎదురు దెబ్బగా మారుతుంది. తెలంగాణ పోలీస్ ఆధ్వర్యంలో ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, వరంగల్ కమిషనరేట్ పోలీసుల సమక్షంలో అజ్ఞాతంలో ఉన్న మావోయిస్టులను లొంగిపోవాలని కోరుతూ నిర్వహిస్తున్న పోరు కన్నా ఊరు మిన్న, మన ఊరికి తిరిగి రండి అనే పిలుపుతోపాటు ఆదివాసీ అభివృద్ధి మరియు సంక్షేమ కార్యక్రమాల ద్వారా ఆపరేషన్ చేయూత పేరుతో లొంగిపోయిన నిషేదిత మావోయిస్టు సభ్యులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సదుపాయంతో మావోయిస్టులు లొంగిపోతున్నారు.

Also read: AP CM Chandrababu: ప్రణాళిక ప్రకారమే దాడి.. పహల్గాం ఉగ్రదాడిపై సీఎం సీరియస్!

ఈ క్రమంలోనే గురువారం నిషేధిత సీపీఐ మావోయిస్టు పార్టీ కి చెందిన 14 మంది సభ్యులు మల్టీజోన్ ఐజిపి ఎదుట వరంగల్ కమీషనరేట్ లో లొంగిపోయారు. మల్టీజోన్ ఐజిపి చంద్రశేఖర్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం హింసాత్మక నక్సలిజం మార్గాన్ని వదిలిపెట్టి కుటుంబంతో కలిసి ప్రశాంతమైన జీవితాన్ని గడపాలని నిర్ణయించుకొని వివిధ హోదాలో పనిచేస్తున్న 14 మంది నిషేధిత సీపీఐ మావోయిస్టులు ఏరియా కమిటీ సభ్యులు (ఎసిఎం)- 02, పార్టీ సభ్యులు (పీఎం) – 07, మిలిషియా కమాండర్ 01, మిలిషియా సభ్యులు – 04, మొత్తం 14 మంది లొంగిపోయారన్నారు. ఏవోబిఎస్జెడ్సి (AOBSZC) డివిజనల్ కమిటీలో పని చేసిన గాలికొండ ఏరియా కమిటీకి చెందిన ఏరియా కమిటీ సభ్యుడు మడవి అంద @ రాజేష్, కేంద్ర కమిటీ సభ్యుడు గాజర్ల రవి @ ఉదయ్ కి చెందిన ప్రొటెక్షన్ టీం లో పని చేసిన ఏరియా కమిటీ సభ్యురాలు సోడి కోసి.

పలు మావోయిస్టు పార్టీ డివిజన్ కమిటీలలో పని చేసినటువంటి పార్టీ సభ్యులు అయిన మరకం హిడుమే, మడకం జోగి @ కోవాసి జోగి, పోడియం భూమిక @ సోడి కోసి @ వెన్నెల, సోడి బుద్రి @ బద్రి, మడవి పూజే, హేమ్లా సోను, సోడి రమేష్ @ భీమా మరియు మిలిషియా సభ్యులుగా పని చేసిన అట్టం బుద్ర, కోవాసి ఇడుమ, కోర్సా లాలు, హేమ్లా సుక్కు @ అర్జున్, కోర్సా సుక్కులు లొంగిపోవారని ఐజి పేర్కొన్నారు.

Also read: Kalima In Islam: కల్మా పేరుతో ఉగ్రవాదుల ఊచకోత.. ఇంతకీ అది ఏం చెబుతుందో తెలుసా?

లొంగిపోయిన వారు మావోయిస్టు పార్టీ సభ్యులు అగ్రనాయకుల ఆదేశాల మేరకు ఛత్తీస్గఢ్ మరియు ఒరిస్సా రాష్ట్రలలో అనేక పలు విధ్వంసకర సంఘటనలు, పోలీసులపై దాడి చేసిన ఘటనలు సహా అమాయక ప్రజలను ఇన్ఫార్మర్ల నెపంతో హత్య చేసిన పలు సంఘటనలలో పాలోన్నారని ఆయన తెలిపారు.

గత సంవత్సర కాలంగా తెలంగాణ రాష్ట్ర పోలీసులు చేపట్టిన నక్సల్ వ్యతిరేక కార్యక్రమాల్లో భాగంగా జనవరి, 2024 నుండి ఈ రోజు వరకు పలు ఎదురు కాల్పులలో 18 మంది సాయుధ మావోయిస్టులు, వారిలో ముగ్గురు (03) రాష్ట్ర కమిటీ సభ్యులు ఎన్కౌంటర్ అయ్యారు.

జనవరి, 2025 నుండి నేటి వరకు వివిధ స్థాయిలలో పని చేస్తున్న 12 మంది మావోయిస్టులు అరెస్ట్ అయ్యారు. ఒక రాష్ట్ర కమిటీ సభ్యురాలితో పాటు మొత్తం 250 మంది మావోయిస్టులు స్వచ్చందంగా పోలీసుల ఎదుట లొంగిపోయి, జనజీవన స్రవంతిలో కలిశారని ఆయన తెలిపారు. భారత దేశంలోనే అత్యుత్తమమైన సరెండర్ పాలసీని తెలంగాణా రాష్ట్రంలో అమలు చేయడం జరుగుతున్నది. అందులో భాగంగా లొంగిపోయిన నక్సలైట్లకు, వారి పునరావాసం కొరకు అనేక సదుపాయాలు తెలంగాణ ప్రభుత్వం కల్పిస్తుందన్నారు.

 

 

Just In

01

Donald Trump: భారత్‌పై ట్రంప్ యూటర్న్.. మోదీ ఎప్పటికీ ఫ్రెండే అంటూ.. దగ్గరయ్యేందుకు తాపత్రయం!

SIIMA Awards 2025: సైమా 2025 విజేతలు ఎవరంటే?.. ఖుషీ అవుతున్న ఆ హీరోల ఫ్యాన్స్

Telangana Jagruthi: తెలంగాణ జాగృతి సంస్థ నాయకులు ఫైర్.. కారణం అదేనా..?

Crime News: తీరుమారని గంజాయి పెడ్లర్ పై పీడీ యాక్ట్.. ఉత్తర్వులు జారీ!

Crime News: హైదరాబాద్‌లో దారుణం.. మార్ఫింగ్ ఫోటోలతో యవతికి బెదిరింపులు