Mahabubabad District: ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను పరిశీలించి తమ పరిధిలో ఉంటే సత్వరమే పరిష్కరించాలని ఇంచార్జ్ కలెక్టర్ లెనిన్ వత్సల్ టోప్పో అన్నారు. అన్ని విభాగాల జిల్లా అధికారులతో కలిసి ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంచార్జీ కలెక్టర్ మాట్లాడుతూ జిల్లావ్యాప్తంగా వివిధ సమస్యల పరిష్కారం నిమిత్తం ప్రజలు చేసుకున్న దరఖాస్తులను పరిశీలించి తమ పరిధిలో ఉంటే వెంటనే పరిష్కరించాలని, లేనిపక్షంలో సంబంధిత విభాగాల కు పంపి చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.
ప్రజావాణి దరఖాస్తులు
ఈ వివిధ విభాగాలకు చెందిన మొత్తం (66) ప్రజావాణి దరఖాస్తులు వచ్చాయన్నారు, బూర్గు పాడు గ్రామము డోర్నకల్ మండలం మహబూబాబాద్ జిల్లా (Mahabubabad district) చెందిన కొందరు రైతులు బూర్గు పాడు చెరువు అలుగు నుండి ఉయ్యాలవాడ చెరువు కు వెళ్లే గొలుసు కట్టు కాలువ అక్రమంగా ధ్వంసం చేసి కాలువ భూమిని కబ్జా చేశారని న్యాయం చేయాలని దరఖాస్తు చేశారు. బానోతు.మహేష్ అనే బొల్లెపల్లి గ్రామ సర్పంచ్ గూడూరు మండలం, మహబూబాబాద్ జిల్లాలో మా గ్రామంలో గ్రామ పంచాయతీ భవనం లేదని, మా గ్రామానికి పంచాయతీ భవనం మంజూరు చేయాలని కోరారు.
పాసు బుక్ మంజూరు చేయాలి
చిన్న వంగర గ్రామం పెద్ద వంగర మండలం జిల్లా మహబూబాబాద్‌కు (Mahabubabad) చెందిన ఒక్క మహిళ గత పది సంవత్సరాల నుండి ఇప్పటి వరకు ధరణిలో కలిగిన సాంకేతిక కారణాలు వలన నాకు ఎల్ పి ఎస్ ల్యాండ్ పట్టాదారు పాసుబుక్ రాలేదని నాకు పట్టాదారు పాసు బుక్ మంజూరు చేయాలని కోరారు. ఈ ప్రజావాణి కార్యక్రమంలో జెడ్పి సీఈవో పురుషోత్తం, బీసీ,మైనారిటీ సంక్షేమ శాఖ అధికారి శ్రీనివాస్, ఎల్డిఎం యాదగిరి, వెల్ఫేర్ అధికారిని సబిత, మెప్మా ప్రాజెక్ట్, సివిల్ సప్లై కృష్ణవేణి, డీఎస్ఓ రమేష్, కలెక్టరేట్ పరిపాలన అధికారి పవన్ కుమార్, అన్ని విభాగాల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
Also Read: Mahabubabad District: బినామీ రైతుల పేర్లతో వరి దందా.. అధికారుల మౌనమే అక్రమాలకు కారణమా?

