Nagarkurnool Survey (imagcredit:swetcha)
నార్త్ తెలంగాణ

Nagarkurnool Survey: చెంచులపై కేద్రం ఫోకస్.. వారి అభివృద్ధికి రెండేళ్ల ప్రత్యేక ప్రణాళికలు

Nagarkurnool Survey: తరాలు మారినా, దశాబ్దాలు కరిగిపోతున్నా చెంచుల తలరాతలు మారడం లేదు. కాగితాల్లో ప్రణాళికలు, పథకాలుSchemes)అమలవుతున్నాయే తప్ప చెంచుల ఆయుర్దాయంతో పాటు జనాభా(Population) కూడా క్రమక్రమంగా తగ్గుతూ వస్తోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పలు రకాల పథకాలు అమలు చేస్తున్నప్పటికీ క్షేత్రస్థాయిలో ఆశించినంతగా అమలు కావడం లేదు. ఫలితంగా చెంచులు అభివృద్ధికి దూరంగా నల్లమల(Nallamalla Forest) అడవుల్లోనే మగ్గిపోతున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమం అమలు చేస్తుంది. రాబోయే రెండు సంవత్సరాల చెంచుల జీవన ప్రమాణాల్లో మార్పు తీసుకురావడమే లక్ష్యంగా అత్యంత నిరుపేద కుటుంబాలను గుర్తించే ప్రక్రియకు శ్రీకారం చుట్టింది. నాగర్‌కర్నూల్(Nagarkurnool) జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో చేపడుతున్న ఈ కార్యచరణతో అయినా కందనూలు నల్లమల చెంచులు తమ అభివృద్ధిపై ఆశగా ఎదురు చూస్తున్నారు.

అత్యంత నిరుపేదల గుర్తింపు: రెండేళ్ల కార్యాచరణ

నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గం పదర, అమ్రాబాద్(Amrabad) మండలాల పరిధిలోని 15 గ్రామాల్లో అత్యంత పేదరికాన్ని అనుభవిస్తున్న ప్రజల జీవన ప్రమాణాలను పెంచేందుకు అధికారులు చర్యలు చేపడుతున్నారు. ఇందులో భాగంగా ఆయా మండలాల్లోని 440 కుటుంబాలను గుర్తింపు ప్రక్రియను అధికారులు చేపట్టారు. కేంద్ర ప్రభుత్వ అధికారులు, బంగ్లాదేశ్ ప్రపంచ అభివృద్ధి సంస్థ(Bangladesh World Development Organization), పేదరిక నిర్మూలన సాధికారిత మిషన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతోంది.‌ నిరుపేదల సంక్షేమమే ధ్యేయంగా, ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రతి పేద ప్రజల అందేలా అన్ని శాఖల అధికారులు అణగారిన వర్గాల, పేదల అభ్యున్నతి కోసం జిల్లా స్థాయిలో అధికారులు కార్యాచరణ చేపడుతున్నారు. దీనికోసం నిజమైన పేదవారినే గుర్తించనున్నారు. ఈ క్రమంలో ఇప్పటివరకు ఆధార్ కార్డు(Aadhar card), రేషన్ కార్డులు(Rustian card), లేని పేదలకు వెంటనే మంజూరు చేస్తారు. అధికారులే నమోదు ప్రక్రియను చేపట్టి వారికి వెంటనే అందజేయడం ప్రత్యేకత. రానున్న రెండు సంవత్సరాల్లోనే ఈ నిరుపేదల అభ్యున్నతికి జిల్లా యంత్రాంగం అన్ని రకాల చర్యలు తీసుకొంటుంది.

Also Read: Medchal District Crime: చాకలి ఐలమ్మ మనవరాలి హత్య.. కన్నతల్లినే చంపిన కూతురు!

ప్రపంచ బ్యాంక్‌ ఆధ్వర్యంలో

సర్వేలో భాగంగా ఈ మండలాల్లోని చెంచుల అభ్యున్నతికి ప్రణాళికలు రూపొందించటం, అటవీ ఉత్పత్తులపై ఆధారపడి జీవనం సాగించే వారికి ఏ రకంగా ఆర్థికంగా వెసులుబాటు ఉంటుందనేది పరిశీలిస్తున్నారు. అలాగే చెంచుల అవసరాలను గుర్తించటం, ఉపాధి అవకాశాలను కల్పించేందుకు ప్రణాళిక రూపొందించనున్నారు. కాగా ఈ ప్రక్రియ ఆశించినంతగా ముందుకు సాగడం లేదు. కేంద్ర ప్రభుత్వం, ప్రపంచ బ్యాంక్‌(World Bank) ఆధ్వర్యంలో చెంచుల్లాంటి అత్యంత పేదలను అభివృద్ధి చేసే ప్రక్రియలో స్థానిక అధికారులు నిర్లక్ష్యం వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఇటీవల ఈ ప్రక్రియను పరిశీలించిన పేదరిక నిర్మూలన సాధికారత మిషన్ సభ్యులు పి ఉషారాణి(Usharani) అసంతృప్తి వ్యక్తం చేయడం గమనార్హం. దీంతో చెంచుల జీవన ప్రమాణాల పెంపు, ప్రభుత్వ పథకాల వర్తింపు కాగితాలకే పరిమితమవుతాయన్న అనుమానాలు కలుగుతున్నాయి. ఇలాగే జరిగితే రెండేళ్ల కాలం కాగితాలతో మారిపోతుందే గానీ దశాబ్దాల చెంచుల తలరాత చరిత్రకే పరిమితమవుతోందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Also Read: HYDRAA: హద్దులు దాటుతున్న హైడ్రా?.. ఓఆర్ఆర్ బయటకు వెళ్లి మరీ..

 

Just In

01

BRS Party: గులాబీ పార్టీకి డ్యామేజ్.. కంట్రోల్ చేసేందుకు ప్రయత్నం?.. సాధ్యపడేనా..?

Ganesh Nimajjanam 2025: అయ్యో గణపయ్య ఎంత ఘోరం.. నిమజ్జనం చేస్తుండగా.. కింద పడ్డ విగ్రహాలు

Bhatti Vikramarka: విద్యారంగం పై ఊహించని రీతిలో సర్కారు పెట్టుబడులు

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ గురించి బ్లాక్ బస్టర్ న్యూస్ చెప్పిన దేవీ శ్రీ ప్రసాద్..

Telangana Politics: కాంగ్రెస్‌లో ఉత్కంఠం.. ఏఐసీసీలో కవిత ఎపిసోడ్..?