Medchal District Crime: రాను రాను మానవత్వం మంట గలిసిపోతున్నాయి. ప్రేమించినవాడి కోసం కట్టుకున్న భర్తను, కన్నతల్లినే కడతేరుస్తున్నారు. చదువుకోవాల్సిన వయసులో యువత పెడదోవన వెళుతూ.. కన్నవారి ప్రాణాలనే తీస్తున్నారు. కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన తల్లిని కన్నకూతురే కిరాతంగా హతమార్చింది. నువ్వు చేసేది తప్పు అని మందలించినందుకు కనికరం లేకుండా.. కర్కశంగా కడతేర్చింది. తల్లితో ఉన్న బంధాన్ని మరిచి.. ప్రియుడి సహకారంతో అతి కిరాతకానికి ఒడిగట్టింది. కన్న పేగు బంధాన్ని, పెంచిన ప్రేమను మరిచి కసాయిలా మారింది ఓ కూతురు. తన సుఖానికి అడ్డు వస్తుందని అతి దారుణానికి ఒడిగట్టింది.
మేడ్చల్ జిల్లా జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటుచేసుకుంది. కన్నతల్లిని కన్న కూతురే హత్య చేసింది. బాలనగర్ (Balanagar) డీసీపీ సురేష్ కుమార్ (DCP Suresh Kumar) తెలిపిన వివరాల ప్రకారం.. జీడిమెట్ల పరిధిలోని లాల్ ( Bahadur Nagar) బహదూర్ నగర్ లో (Anjali) అంజలి తన ఇద్దరు కూతుర్లతో నివాసం ఉంటోంది. అంజలి ఎవరంటే చాకలి ఐలమ్మ ముని మునవరాలు. ఆమె మహిళా మండలిలో కూడా పనిచేస్తుంది. ఈనెల 19న తన పెద్ద కూతురు కనిపించడం లేదని (Jeedimetla Police) జీడిమెట్ల పోలీసులకు తల్లి అంజలి ఫిర్యాదు చేసింది. దీంతో మిస్సింగ్ కేసు నమోదు చేసి పోలీసుల దర్యాప్తు చేపట్టారు.
Also Read: Corruption Cases: ఆరు నెలల్లోనే.. 122 కేసులు రిజిస్టర్!
(Nalgonda) నల్లగొండ కు చెందిన తన ప్రియడు శివ తో కలిసి ఉంటోందని తెలుసుకున్న పోలీసులు (Police) ఈ నెల 20వతేదిన మైనర్ బాలికను తీసుకువచ్చి రెండు కుటుంబాల సఖ్యతతో అమ్మాయిని తల్లి అంజలికి అప్పగించారు. 8 నెలల కిందట నల్గొండకు చెందిన శివతో బాలికకు పరిచయం ఏర్పడి, ప్రేమకు తీసింది. దాంతో ఆమె తల్లి అంజలి.. పదో తరగతికే ప్రేమ ఏంటని మందలించింది. వారం కిందట శివతో వెళ్లిపోయిన బాలిక, 3 రోజుల కిందటే ఇంటికి తిరిగొచ్చింది. అప్పటినుంచి తల్లి కూతుర్ల మధ్య మనస్పర్ధలు పెరిగాయి. తల్లిని అడ్డు తొలగించుకునేందుకు ప్రియుడితో కలిసి ఆమెను చంపేందుకు ప్లాన్ చేసింది.
ఈక్రమంలో రాత్రి తల్లి (Anjali) అంజలి(39) ఇంట్లో ఒంటరిగా ఉన్న విషయాన్ని గమనించి ప్రియుడు (Shiva) శివతో పాటు తన తమ్ముడిని పిలిచిన మైనర్ బాలిక తన చున్నీతో తల్లి మెడకు వెనుకనుంచి బిగించడంతో పాటు తలపై ఇనుప రాడ్ తో కొట్టి హత్య చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పదో తరగతి చదువుతున్న మైనర్ బాలికతో పాటు (Shiva) శివని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నట్లు పోలీసులు తెలిపారు.
Also Read: Commercial Flat: గచ్చిబౌలిలో రికార్డ్ ధరలు.. రూ.65.02 కోట్ల మేర ఆదాయం!