Ganapuram project: మెదక్ జిల్లా సింగూరు ప్రాజెక్టు నుండి గణపురం ప్రాజెక్టు(Ganapuram Project)కు సాగునీటిని విడుదల చేయాలని, రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి(Minister Uttam Kumar Reddy)కి మాజీ ఎమ్మెల్యే బీఅర్ఎస్(BRS) నేత పట్లోల్ల శశిధర్ రెడ్డి(Pattolla Shashidhar Reddy) వినతి పత్రం అందించారు.
ఉత్తమ్‌కుమార్ రెడ్డికి విజ్ఞప్తి
సింగూరు ప్రాజెక్టు(Singur Project) నుంచి ఘనపూర్ ప్రాజెక్టు(Ganapuram Project)కు మాకు ఉన్నటువంటి రైపరెండెన్స్ 4.06 టిఎంసి(TMC) ఆఫ్ వాటర్ కంపల్సరిగా ప్రతి సంవత్సరం 12,13 సెల్స్‌లలో విడుదల చేయాలని ఇప్పటికీ జూలై(July) మాసం దగ్గరికి వస్తుంది. మాకు ఉన్నటువంటి వేసినటువంటి నారుమడులు అవన్నీ కూడా ఎండిపోకుండా వెంటనే తక్షణమే మాకు ఉన్నటువంటి రైపరెండెన్స్ ప్రకారం నాకు ఉన్నటువంటి 0.5 వెంటనే సింగూరి నుంచి ఘనపూర్ ప్రాజెక్టుకు విడుదల చేయాలని మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డికి విజ్ఞప్తి చేస్తూ బుధవారం రోజు సెక్రటేరియట్(Secretariat)లో వినతి పత్రం ఇచ్చినట్లు మెదక్(Medak) మాజీ ఎమ్మెల్యే శశిధర్ రెడ్డి తెలిపారు.
Also Read: CM Revanth Reddy: కేసీఆర్ చేసిన అభివృద్ధికి గజ్వేల్ అస్తవ్యస్తం: నర్సారెడ్డి
కేసీఆర్ ఆధ్వర్యంలో సాగునీరు
గత ప్రభుత్వ హయాంలో ఘనపూర్ ప్రాజెక్టు ఆయకట్టుకు మాజీ మంత్రి హరీష్ రావు(Harish Rao) ఆధ్వర్యంలో సాగునీరు విడుదల చేశారని చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) కల్పించుకొని ఘనపూర్ ప్రాజెక్టు కు సాగునీరు అందించే విధంగా ఆదేశాలు ఇవ్వాలని మాజీ ఎమ్మెల్యే శశిధర్ రెడ్డి(Shashidhar Reddy) మంత్రిని కోరారు.
Also Read: Mega157: ముచ్చటగా మూడోది కూడా ముగించారు
