ChiruAnil Update
ఎంటర్‌టైన్మెంట్

Mega157: ముచ్చటగా మూడోది కూడా ముగించారు

Mega157: మెగాస్టార్ చిరంజీవి (Mega Star Chiranjeevi) హీరోగా బ్లాక్ బస్టర్ హిట్ మెషీన్ అనిల్ రావిపూడి (Anil Ravipudi) దర్శకత్వంలో రూపుదిద్దుకుంటోన్న మోస్ట్ అవైటెడ్ హోల్సమ్ ఎంటర్‌టైనర్ చిత్రం ‘Mega157’. ఇంకా పేరు కన్ఫర్మ్ కానీ ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి, సుష్మిత కొణిదెలకు చెందిన గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్‌తో కలిసి ఈ సినిమాను గ్రాండ్‌గా నిర్మిస్తున్నారు. శ్రీమతి అర్చన సమర్పిస్తున్న ఈ చిత్రం ముచ్చటగా మూడో షెడ్యూల్‌ని (Mega157 Update) కూడా ముగించుకుందని మేకర్స్ తాజాగా అప్డేట్ ఇచ్చారు. రీసెంట్‌గా కేరళలో ఈ సినిమా షూటింగ్ జరుగుతున్నట్లుగా మేకర్స్ తెలిపిన విషయం తెలిసిందే. ఈ షెడ్యూల్‌లో ఒక సాంగ్‌తో పాటు కొంత టాకీపార్ట్ చిత్రీకరణ జరుపుతున్నట్లుగా తెలిపారు.

Also Read- Prabhas: బాహుబ‌లి పాత్ర కోసం.. ప్ర‌భాస్ రోజుకి అన్ని గుడ్లు తీసుకున్నాడా.. డైట్ లిస్ట్ చూస్తే మతి పోవాల్సిందే!

ఇప్పుడా సాంగ్‌తో పాటు కీలకమైన టాకీ పోర్షన్స్‌ని షూట్ చేసుకుని, కేరళ నుంచి హైదరాబాద్ వచ్చినట్లుగా దర్శకుడు అనిల్ రావిపూడి ఓ వీడియోని షేర్ చేశారు. ఈ షెడ్యూల్‌లో షూట్ చేసిన సాంగ్, సీన్స్ చాలా అద్భుతంగా వచ్చాయని మేకర్స్ తెలిపారు. మూడవ షెడ్యూల్‌ పూర్తి చేసుకున్న సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు అనిల్ రావిపూడి ప్రైవేట్ జెట్ ముందు నిలబడి, నవ్వుతోన్న ఫోటోని మేకర్స్ షేర్ చేశారు. ఇటీవల ఈ సినిమాకు సంబంధించి రిలీజ్ చేసిన ప్రోమోలో చిరంజీవి వింటేజ్, స్టైలిష్ లుక్‌లో కనిపించి అలరించిన విషయం తెలిసిందే. దర్శకుడు అనిల్ రావిపూడి స్టైల్‌కి తగినట్లుగా ఈ సినిమా షూటింగ్ జెట్ స్పీడుగా, పక్కా ప్లాన్డ్‌గా జరుగుతోంది. సినిమా మంచి నోస్టాల్జిక్ ఫీల్‌తో ఉండబోతోందని మేకర్స్ కాన్ఫిడెంట్‌ని వ్యక్తం చేస్తున్నారు.

Also Read- Ambati Rambabu: వీరమల్లుపై అంబటి ట్వీట్.. ఏం తాతా ప్రీమియర్ టికెట్స్ దొరకలేదా? అంటూ కామెంట్స్!

ఇదిలా ఉంటే, ఈ కేరళ షూటింగ్‌కి సంబంధించి ఇటీవల ఓ వీడియో లీకైన విషయం తెలిసిందే. ఈ లీక్‌పై మేకర్స్ సీరియస్ అవడమే కాకుండా, వార్నింగ్ కూడా ఇచ్చారు. ఇకపై ఇలాంటివి చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. విక్టరీ వెంకటేష్‌తో ఈ సంక్రాంతికి వచ్చిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా ఎలాంటి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుందో తెలియంది కాదు. బాలయ్య, వెంకీ వంటి సీనియర్ హీరోలతో అనిల్ రావిపూడి బ్లాక్ బస్టర్ అందుకున్నారు. ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవితో కూడా ఆయన మరో బ్లాక్ బస్టర్‌ని తన ఖాతాలో వేసుకుని, మరోసారి అపజయమెరుగని దర్శకుడిగా చరిత్ర సృష్టిస్తారని చిత్ర బృందం చెబుతోంది. అందుకు తగ్గట్టే అనిల్ రావిపూడి ఎప్పటికప్పుడు ఈ సినిమాను వార్తలలో ఉండేలా పక్కా ప్లాన్‌గా అటు చిత్రీకరణను, ఇటు ప్రమోషన్స్‌ను నడిపిస్తుండటం విశేషం. ఈ సినిమాను 2026 సంక్రాంతి బరిలోకి దించేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.

ఇదిలా ఉంటే.. ఈ సినిమా టైటిల్ ఇదే అనేలా.. అనిల్ రావిపూడి ట్వీట్ క్లారిటీ ఇచ్చేస్తుంది. ఆయన ట్వీట్‌లో కేరళ నుంచి హైదరాబాద్ వచ్చినట్లుగా తెలుపుతూ.. ‘మన శంకరవరప్రసాద్ గారు’ అని ప్రత్యేకంగా మెన్షన్ చేశారు. మొదటి నుంచి ఇదే ఈ ప్రాజెక్ట్ టైటిల్ అనేలా వినబడుతోన్న విషయం తెలిసిందే. ఇప్పుడు మరింతగా ఆయన హింట్ ఇచ్చేసినట్లయింది.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Ponguleti Srinivasa Reddy: త్వరలో సాదాబైనామాలకు మోక్షం.. మంత్రి కీలక వ్యాఖ్యలు

Su From So OTT release: ‘ఓటీటీలోకి వచ్చేస్తున్న కామెడీ థ్రిల్లర్.. ఎక్కడంటే?

BRS Party: గులాబీ పార్టీకి డ్యామేజ్.. కంట్రోల్ చేసేందుకు ప్రయత్నం?.. సాధ్యపడేనా..?

Ganesh Nimajjanam 2025: అయ్యో గణపయ్య ఎంత ఘోరం.. నిమజ్జనం చేస్తుండగా.. కింద పడ్డ విగ్రహాలు

Bhatti Vikramarka: విద్యారంగం పై ఊహించని రీతిలో సర్కారు పెట్టుబడులు