Ambati Rambabu on HHVM
ఎంటర్‌టైన్మెంట్

Ambati Rambabu: వీరమల్లుపై అంబటి ట్వీట్.. ఏం తాతా ప్రీమియర్ టికెట్స్ దొరకలేదా? అంటూ కామెంట్స్!

Ambati Rambabu: రాజకీయాలన్నాక శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరని అంటుంటారు. అది నిజమే అని మరోసారి నిరూపించారు వైసీపీ నాయకుడు అంబటి రాంబాబు. మొన్నటి వరకు పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) అంటే విరుచుకుపడిన అంబటి రాంబాబు (Ambati Rambabu).. సడెన్‌గా ఇప్పుడు మారిపోయారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘బ్రో’ (Bro Movie) సినిమా టైమ్‌లో ఒక మినిస్టర్ హోదాలో ఉన్న అంబటి రాంబాబు.. ఆ సినిమాను ఎంత వరకు కిల్ చేయాలో అంతా చేశారు. మరీ దారుణంగా సినిమా కలెక్షన్స్ చెప్పే మంత్రిగా పేరు పొందారంటే, ఎంతగా ఆయన ఆ సినిమా కోసం డ్యూటీ చేశారో అర్థం చేసుకోవచ్చు. అదే కాదు.. సమయం వచ్చినప్పుడల్లా, పదవిలో ఉన్నప్పుడు, దిగిపోయిన తర్వాత కూడా పవన్ కళ్యాణ్‌పై ఇష్టం వచ్చినట్లుగా విమర్శలు గుప్పిస్తూనే ఉన్నారు. 2019 ఎన్నికల టైమ్‌లో పవన్ కళ్యాణ్ పేరు చెప్పి ఓట్లు అడిగిన అంబటి.. గెలిచిన తర్వాత ఆయనని దూషించడమే పనిగా పెట్టుకున్నారు. అలాంటి వ్యక్తి ఇప్పుడు సడెన్ రూటు మార్చి.. పవన్ కళ్యాణ్ ‘హరి హర వీరమల్లు’ (Hari Hara Veera Mallu) సినిమాకు కనకవర్షం కురవాలని ట్వీట్ వేయడంతో.. అంతా ఆశ్చర్యపోతున్నారు.

Also Read- Nara Lokesh: పవన్ అన్న సినిమా కోసం వెయిటింగ్.. నారా లోకేష్ ట్వీట్ వైరల్!

తాజాగా పవన్ కళ్యాణ్ ‘హరి హర వీరమల్లు’ సినిమాపై అంబటి రాంబాబు చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది. ఈ ట్వీట్‌లో ‘‘పవన్ కళ్యాణ్‌గారి ‘హరి హర వీరమల్లు’ సూపర్ డూపర్ హిట్టై, కనక వర్షం కురవాలని కోరుకుంటున్నాను’’ అని పేర్కొన్నారు. దీంతో నెటిజన్లు, మెగా ఫ్యాన్స్ ఆశ్చర్యపోతున్నారు. పనిలో పనిగా కామెంట్స్‌తో కుమ్మేస్తున్నారు. ఇందులో కొన్ని సరదాగా చేసిన కామెంట్స్ ఉంటే, మరికొన్ని ఆయన పర్సనల్ వ్యవహారాలపై ఉండటం విశేషం. మరీ ముఖ్యంగా పవన్ కళ్యాణ్ నిన్న (మంగళవారం) కూటమి ఎమ్మెల్యేలు కోరుకుంటే వారి కోసం ‘హరి హర వీరమల్లు’ స్పెషల్ షో వేస్తానని ప్రకటించారు. అలాగే ఈ రోజు (బుధవారం) సాయంత్రం 9 గంటలకు ప్రీమియర్ షోలు పడుతున్నాయి. ఈ షోలకు హాట్ కేకుల్లా టికెట్స్ అమ్ముడైపోయాయి. దీనిని ఆసరాగా తీసుకుని, ‘ఏం తాతా ప్రీమియర్‌కి టికెట్స్ దొరక్క ఇలా కాకా పడుతున్నావా?’ అంటూ చేసిన కామెంట్ బాగా వైరల్ అవుతోంది.

Also Read- Karuppu Teaser: బర్త్ డే స్పెషల్.. ‘కరుప్పు’ టీజర్ రిలీజ్.. నల్ల చొక్కా, లుంగీతో అదరగొట్టిన సూర్య

ఇంకొన్ని కామెంట్స్‌ని పరిశీలిస్తే..
‘అలాగే సినిమాల్లోకి రావాలనే మీ కోరిక నెరవేరాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నా’
‘సర్ సినిమా చూసి వచ్చిన తర్వాత రివ్యూ ఇవ్వటానికి మీరు ఉన్నారు కదా ఎప్పటిలాగే…. అధికార పదవిలో ఉన్నా కూడా మీరు చేసింది ఇదేగా ఒకప్పుడు’
‘ఎల్లుండి కలెక్షన్ డీటెయిల్స్ మీరే చెప్పాలి తాత’
‘ఏంటి మాట మారుతుంది. ఏమన్నా సఖ్యత కుదిరిందా. సఖ్యత కోసమా.’
‘గత ఏడాది కూటమి హిట్…ఈ ఏడాది సినిమా హిట్…జగనన్నకు ఫటాఫట్….’

‘అంబటి ఏంటిది.. నీ ట్విట్టర్ అకౌంట్ హ్యాక్ కాలేదు కదా..’
‘అది జరగదు అని తెలిసి కావలి అని వేసావ్ కదా అంబటి అంకుల్’
‘ఎంత కలెక్షన్స్ వచ్చినా ఏం లాభం బాబాయ్…జగన్ లా దాచుకోలేడు మావాడు..మళ్ళీ ప్రజలకే ఇస్తాడు..’

ఇలా ఉన్నాయ్ కామెంట్స్. మొత్తంగా అయితే, అంబటిలో బీభత్సమైన మార్పు వచ్చిందని, ఇది ఏ దిశగా అడుగులు వేయడానికో తెలియాల్సి ఉందంటూ రాజకీయ విమర్శకులు కూడా కొందరు ఈ ట్వీట్‌పై వ్యాఖ్యానించడం విశేషం. ‘హరి హర వీరమల్లు’ సినిమాను నిర్మాత ఎ.ఎం. రత్నం సమర్పణలో మెగా సూర్య ప్రొడక్షన్ పతాకంపై ఎ. దయాకర్ రావు భారీ బడ్జెట్‌తో నిర్మించారు. ఈ పీరియాడికల్ డ్రామాకు ఎ.ఎం. జ్యోతి కృష్ణ, క్రిష్ జాగర్లమూడి దర్శకత్వ బాధ్యతలు నిర్వహించారు.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Ganja Racket: గంజాయి బ్యాచ్ అరెస్ట్! .. ఎలా దొరికారో తెలుసా?

Huzurabad Gurukulam: గురుకులంలో విద్యార్థులకు టార్చర్?.. ప్రిన్సిపాల్, ఓ పోలీస్ ఏం చేశారంటే?

Sujeeth Birthday: సుజీత్ బర్త్‌డే.. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ ట్వీట్ చూశారా?

Bottu Gambling: చిత్తు-బొత్తు ఆడుతున్న ఏడుగురి అరెస్ట్.. ఎంత డబ్బు దొరికిందంటే?

Mega Jathara: అసలైన మెగా జాతర సంక్రాంతి నుంచి మొదలు కాబోతోంది.. మెగా నామ సంవత్సరం!