Karuppu Teaser: కోలీవుడ్ స్టార్ హీరో సూర్య గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ రోజు ఆయన బర్త్ డే సందర్భంగా తాను చేస్తున్న నెక్స్ట్ ప్రాజెక్ట్ ని అనౌన్స్ చేశారు. ‘కరుప్పు’ అనే టైటిల్ తో తెరకెక్కిన ఈ చిత్రానికి ఆర్జే బాలాజీ దర్శకత్వం వహించారు. ఈ క్రమంలోనే ఫస్ట్ లుక్ తో పాటు టీజర్ ను కూడా రిలీజ్ చేశారు.
‘కరుప్పు’ టీజర్ రిలీజ్..
టీజర్లో సూర్య మాస్ ఎంట్రీ, డైలాగ్స్ చాలా బాగున్నాయి.. నల్ల చొక్కా, లుంగీ ధరించి, నోట్లో సిగరెట్‌తో పూర్తి మాస్ అవతార్‌లో కనిపిస్తున్నారు. ఆయన ఈ చిత్రంలో ఒక వైపు లాయర్ పాత్రలో కనిపిస్తూనే, మరోవైపు పల్లెటూరి మాస్ కుర్రాడిగా అలరిస్తున్నారు. ఈ చిత్రం సూర్య సినీ కెరీర్ లో 45వ చిత్రంగా రూపొందుతోంది. ఫ్యాన్స్ ఈ కొత్త అవతార్‌పై భారీ అంచనాలు పెట్టుకున్నారు.
Also Read: Pawan Kalyan: దేవుడి దయ ఉంటే ఆ సినిమా చేస్తానంటూ సంచలన కామెంట్స్ చేసిన పవన్ కళ్యాణ్
డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్ పతాకం పై ఎస్.ఆర్.ప్రభు , ఎస్.ఆర్.ప్రకాష్ బాబు ఈ సినిమాని నిర్మిస్తున్నారు. 2024లో షూటింగ్ ప్రారంభమై, 2025 మే నాటికి చిత్రీకరణ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్-ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. విడుదల తేదీని త్వరలో అధికారికంగా ప్రకటించనున్నారు, అయితే దీపావళి 2025 సందర్భంగా ఈ సినిమా థియేటర్లలోకి రావచ్చని సమాచారం.
Also Read: Hari Hara Veera Mallu: పవన్ కళ్యాణ్ సినిమా పైన నా అన్వేష్ సంచలన వీడియో.. అదంతా అబద్ధమా? నిజమా?
సూర్య కు జోడిగా త్రిష
సూర్య కు జోడిగా త్రిష హీరోయిన్‌గా నటిస్తోంది. దాదాపు 20 ఏళ్ళ తర్వాత ఈ జంట మళ్లీ కలిసి నటిస్తుండటం విశేషం. అనఘా రవి, సుప్రీత్ రెడ్డి, నాట్టి నటరాజ్, స్వాసిక, ఇంద్రన్స్, యోగి బాబు, శివద తదితరులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ‘కరుప్పు’ అంటే ‘నలుపు’ అని అర్థం. ఈ సినిమా సామాజిక న్యాయం కోసం పోరాడే ఒక కోర్ట్ డ్రామాగా రూపొందుతోంది. సామాజిక సమస్యలు, కుల వివక్ష, రాజకీయ అంశాలు వంటి ముఖ్య అంశాలను ఈ సినిమాలో చూపించబోతున్నారు.