Hari Hara Veera Mallu: ఈ మధ్య కాలంలో చాలా మంది సినిమాలు చూడకుండా రివ్యూ లు ఇచ్చేస్తున్నారు. దీని వలన నిర్మాతలు నష్ట పోతున్నారు. మొన్నటి వరకు బెట్టింగ్ యాప్స్ పైన పోరాడిన నా అన్వేష్ ఇప్పుడు రూట్ మార్చి మూవీ రివ్యూ ఇచ్చే వాళ్ళ పని పట్టాలని కొత్తగా ప్రయత్నించాడు. ప్రముఖ య్యూటుబర్ నా అన్వేష్ ప్రస్తుతం సౌత్ ఆఫ్రికాలో ఉన్నాడు. అక్కడ అతను పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కిన హరిహరవీరమల్లు సినిమాలపై సంచలన వీడియో షేర్ చేశాడు. అయితే, అదిరిపోయే ట్విస్ట్ కూడా ఇచ్చాడు. వీడియో ఓపెన్ చేయగానే మొదటి సినిమా రివ్వ్యూ చేస్తున్నట్లు చెప్పాడు. సినిమా అదిరింది.. సూపర్ హిట్ అంతే.. ఇక థియేరటర్‌లో మోత మోగిపోద్ది.. గూస్ బమ్స్ పక్కా అని రివ్వ్యూ ఇచ్చాడు.
Also Read: Hari Hara Veera Mallu: పవన్ కళ్యాణ్ సినిమా పైన నా అన్వేష్ సంచలన వీడియో.. అదంతా అబద్ధమా? నిజమా?
అంతే కాదు, హరిహర వీరమల్లులో బాలయ్య బాబు కూడా ఉన్నాడని బిగ్ ట్విస్ట్ ఇచ్చాడు. ఇది చూసిన ఫ్యాన్స్ కూడా షాక్ అవుతున్నారు. మా అన్న సినిమాలో పవన్ ఉండటం ఏంటి ? అని కొందరు అంటున్నారు. అతను ఇంకా మాట్లాడుతూ సినిమాలో విజయనగరం సామ్రాజ్యం గురించి ఉందని.. హిస్టారిక్ కథలో పవన్ బాగా నటించాడని నా అన్వేష్ తన మాటల్లో చెప్పుకొచ్చాడు.
అయితే, చివరిలో అదంతా నిజం కాదని .. ఇప్పుడు మీరు విన్నది ఫేక్ అని బిగ్ ట్విస్ట్ ఇచ్చాడు నా అన్వేష్. సినిమా చూడకుండా సినిమా రివ్యూలు ఇవ్వడం చాలా తప్పు అని ఈ వీడియో ద్వారా చెప్పాడు. అసలు అతను సినిమానే చూడలేదని చెప్పాడు మూవీ రివ్యూలు ఇచ్చే వారికి బుద్ది చెప్పాలని,ఇలా ఈ వీడియో చేశానని చెప్పి ఓ బిగ్ షాక్ ఇచ్చాడు.