Nara Lokesh: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Power Star Pawan Kalyan) నటించిన ‘హరి హర వీరమల్లు’ (Hari Hara Veera Mallu) సినిమా విడుదలను పురస్కరించుకుని ఏపీ రాష్ట్ర విద్య, ఐటి శాఖల మంత్రి నారా లోకేష్ చిత్ర టీమ్‌కు అభినందనలు తెలిపారు. ఈ మేరకు ఆయన చేసిన పోస్ట్ వైరల్ అవుతోంది. ఫస్ట్ టైమ్ ఓ చారిత్రక యోధుడి పాత్రలో పవన్ కళ్యాణ్ నటించిన ‘హరి హర వీరమల్లు’ చిత్రం జూలై 24న విడుదలయ్యేందుకు సిద్ధమైంది. రెండు తెలుగు రాష్ట్రాలలో జూలై 23న రాత్రి 9 గంటలకే ఈ చిత్ర ప్రీమియర్ పడనుంది. అందుకు సంబంధించి ఇరు రాష్ట్రాలు అనుమతులు కూడా జారీ చేశాయి. ఈ నేపథ్యంలో ఈ సినిమా మంచి విజయం సాధించాలని ప్రముఖులెందరో కోరుకుంటున్నారు. ఆ లిస్ట్‌లో నారా లోకేష్ కూడా చేరారు. పవన్ కళ్యాణ్, నారా లోకేష్ మధ్య ఉన్న అనుబంధం గురించి, రీసెంట్‌గా జరిగిన ఎన్నికలు చెప్పకనే చెప్పేశాయి. పవన్ కళ్యాణ్‌ను సొంతం అన్నలాగా నారా లోకేష్ (Nara Lokesh) భావిస్తుంటారు. అదే విషయం బహిరంగంగానే ఆయన వెల్లడించారు కూడా. ఇప్పుడు కూడా అన్న సినిమా కోసం ఎదురు చూస్తున్నానంటూ ట్వీట్‌లో పేర్కొన్నారు.
Also Read- Shilpa Shirodkar: తను టెన్త్ ఫెయిల్.. భర్త డబుల్ ఎంబీఏ.. నమ్రత చెల్లి గురించి ఈ విషయాలు తెలుసా?
‘‘మా పవన్ కళ్యాణ్ అన్న సినిమా ‘హరి హర వీరమల్లు’ సినిమా విడుదల సందర్భంగా సినిమా నిర్మాణంలో పాలుపంచుకున్నబృందానికి నా అభినందనలు పవర్ స్టార్ పవన్ కళ్యాన్ అభిమానుల్లాగే నేనూ సినిమా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నాను. పవనన్న, ఆయన సినిమాలు ఆయన శ్వాగ్ అంటే నాకు చాలా చాలా ఇష్టం. పవర్ స్టార్ పవర్ ఫుల్ పెర్ఫార్మెన్స్‌తో ‘హరి హర వీరమల్లు’ అద్భుత విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను’’ అని నారా లోకేష్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు. ఈ ట్వీట్‌కు మెగా ఫ్యాన్స్, జనసేన అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అభిమానులమైన మేము కూడా ఇంత గొప్పగా ట్వీట్ చేయలేమన్నా అంటూ నారా లోకేష్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు. దీంతో ఈ ట్వీట్ బాగా వైరల్ అవుతోంది.
Also Read- Watch Video: పవన్ పాటతో దుమ్మురేపిన టెక్కీలు.. ఫారెన్ క్లెయింట్‌కు కళ్లుచెదిరే స్వాగతం!
ధర్మం కోసం పోరాడే యోధుడి పాత్రలో పవన్ కళ్యాణ్ కనువిందు చేయనున్న ఈ సినిమాను నిర్మాత ఎ.ఎం. రత్నం సమర్పణలో మెగా సూర్య ప్రొడక్షన్ పతాకంపై ఎ. దయాకర్ రావు భారీ బడ్జెట్‌తో నిర్మించారు. ఈ పీరియాడికల్ డ్రామాకు ఎ.ఎం. జ్యోతి కృష్ణ, క్రిష్ జాగర్లమూడి దర్శకత్వ బాధ్యతలు నిర్వహించగా.. నిధి అగర్వాల్, బాబీ డియోల్ సినిమాలో కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా స్టోరీ లైన్ గురించి జరుగుతున్న కాంట్రవర్సీపై తాజాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ క్లారిటీ ఇచ్చిన విషయం తెలిసిందే. అలాగే ఈ సినిమాను చూడాలని కనుక కూటమి ఎమ్మెల్యేలు అడిగితే వారి కోసం ప్రత్యేకంగా షో ఏర్పాటు చేయిస్తానని కూడా తన తాజా ఇంటర్వ్యూలో పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు. ఇప్పుడు నారా లోకేష్ ట్వీట్ చూస్తుంటే.. కూటమి ఎమ్మెల్యేలకు షో పడేలానే ఉంది. చూద్దాం.. ఏం జరుగుతుందో..
మా పవన్ అన్న సినిమా #HariHaraVeeraMallu విడుదల సందర్భంగా సినిమా నిర్మాణంలో పాలుపంచుకున్న బృందానికి అభినందనలు. పవర్ స్టార్ అభిమానుల్లాగే నేనూ సినిమా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నాను. పవనన్న, ఆయన సినిమాలు, ఆయన స్వాగ్ నాకు చాలా చాలా ఇష్టం. పవర్ స్టార్ పవర్ ఫుల్ పెర్ఫార్మెన్స్‌తో… pic.twitter.com/NP9rw3eZkR
— Lokesh Nara (@naralokesh) July 23, 2025
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు