Watch Video: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మిగతా హీరోలకు ఫ్యాన్స్ ఉంటే ఆయనకు మాత్రం భక్తులు ఉంటారని పలువురు అంటుంటారు. ప్రస్తుతం ఏపీ డిప్యూటీ సీఎం (Andhra Pradesh Deputy CM)గా సేవ చేస్తున్న పవన్ కు అటు రాజకీయంగానూ పెద్ద ఎత్తున కార్యకర్తలు ఉన్నారు. అటువంటి పవన్ పాటకు టెక్కీలు డ్యాన్స్ చేస్తున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఆఫీసుకు వచ్చిన ఫారెన్ క్లెయింట్ (Foreign Client) ను ఆకట్టుకునేందుకు టెక్కీలు ఇలా డ్యాన్స్ చేసి అదరగొట్టారు.
పవన్ పాటకు అదిరిపోయే స్టెప్పులు
ప్రస్తుతం వైరల్ అవుతున్న టెక్కీల డ్యాన్స్ వీడియో.. ఎప్పుడు, ఎక్కడ జరిగిందన్న దానిపై స్పష్టత లేదు. అయితే వీడియోను గమనిస్తే.. వారు తమ ఫారెన్ క్లెయింట్ కోసం అలా చేస్తున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. తొలుత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ‘గుడుంబా శంకర్’ (Gudumba Shankar) చిత్రంలోని ‘కిళ్లీ కిళ్లీ’ (Killi Killi Song) పాటకు సాఫ్ట్ వేర్ ఉద్యోగులు డ్యాన్స్ చేశారు. ఈ పాటను పవన్ స్వయంగా పాడటం విశేషం. అమ్మాయిలు, అబ్బాయిలు కలిసి సాంగ్ బీట్ కు మ్యాచ్ అయ్యేలా స్టెప్పులు వేసి.. ఫారెన్ క్లెయింట్ ను వారు ఎంతగానో ఇంప్రెస్ చేయడాన్ని వీడియోలో గమనించవచ్చు. ఆ పాట తర్వాత ‘మెయిన్ తెరా బాయ్ ఫ్రెండ్’ అనే హిందీ పాటకు ఒక మగ సాఫ్ట్ వేర్ ఉద్యోగి సోలోగా డ్యాన్స్ చేసి ఆకట్టుకున్నాడు. ఒక నిమిషం 48 సెకన్ల నిడివి కలిగిన ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.
Also Read: New NCERT book: విద్యార్థుల పాఠ్యపుస్తకంలో శుభాంశు శుక్లా సందేశం.. ఇంతకీ ఏం చెప్పారంటే?
నెటిజన్ల భిన్నాభిప్రాయాలు
కొందరు ఈ వీడియోను చూసి ఎంజాయ్ చేస్తుంటే మరికొందరు మాత్రం తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. ‘ఇది భారతీయ ఆతిథ్యాన్ని చూపించడంలో తేలికైన మార్గం. ఫారెన్ క్లెయింట్ తో బంధాన్ని పెంపొందించేందుకు ఇది సాయ పడుతుంది’ అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. అయితే మరికొందరు.. టెక్కీలు చేసిన పనిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ‘విదేశీ క్లెయింట్ కోసం భారత ఉద్యోగులను బలవంతంగా డ్యాన్స్ చెయించడం అస్సలు బాగోలేదు. ఇలాంటి చర్యలు.. భారతీయ ఆఫీసులపై తప్పుడు అభిప్రాయాలను కలిగిస్తాయి. పనిలో సిన్సియారిటీ ఉండదని.. వర్క్ చేయడానికి అనర్హులు అన్న భావనను విదేశీయులకు కలిగిస్తాయి’ అంటూ ఓ నెటిజన్ అభిప్రాయపడ్డారు. మరొకరు స్పందిస్తూ ఇది భారతీయ కార్యాలయాలపై తప్పుడు అభిప్రాయాలను కలిగిస్తాయని పేర్కొన్నారు.
India should stop chaprification of corporate offices
This is so pathetic to see Indian girls dancing in office an d welcoming a foreign client and the becahra client also forced to dance.
Such showcasing will only make other countries feel Indian offices are causal and not… pic.twitter.com/gpA9kXY4GJ
— Woke Eminent (@WokePandemic) July 21, 2025