BRS Protest: సింగూరు ప్రాజెక్టు నుంచి మెదక్ జిల్లాలోని ఘనపూర్ ప్రాజక్టుకు సాగునీటిని వదులాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మెదక్ కలెక్టరేట్ ఎదుట ధర్నా చేశారు. జిల్లా పార్టీ అధ్యక్షురాలు పద్మా దేవేందర్ రెడ్డి ఆధ్వర్యంలో మెదక్,నర్సాపూర్ నియోజకవర్గం లోని రైతులు, బీఆర్ఎస్ పార్టీ నేతలు, కార్యకర్తలతో ధర్నా నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం క్రాస్ హాలిడే ప్రకటించి ఎకరాకు 25 వేల నష్టపరిహారం ఘనపూర్ ప్రాజక్టు ఆయకట్టు రైతులకు ఇవ్వాలని డిమాం డ్ చేశారు. సింగూరు ప్రాజెక్టు రిపేరు పేరుతో ఘనపూర్ ప్రాజక్టు ఆయకట్టు 26,625 ఎకరాలకు సాగు నీరు విడుదల చేయడం లేదని మండి పడ్డారు. ఒక్కో ఎకరాకు 25 వేలు ప్రభుత్వం చెల్లించాలని, రెండు సంవత్సరాలు రిపేరు జరుగుతే నాలుగు పంటలు రైతులు నష్టపోతారని సునీత లక్ష్మారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.
Also Read: BRS Harish Rao Protest: రోడ్లపై పరిగెత్తి.. సచివాలయం వద్ద బైఠాయించి.. హరీశ్ నేతృత్వంలో హైడ్రామా!
నీటిని విడుదల చేయించాలని డిమాండ్
సభకు అధ్యక్షత వహించిన మాజీ ఎమ్మెల్యే టిఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు పద్మాదేవేందర్ రెడ్డి మాట్లాడుతూ ఇక్కడి నుండి ప్రార్థించే వహిస్తున్న ఎమ్మెల్యే నర్సాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి ఆవుల రాజిరెడ్డిలు సీఎం రేవంత్ రెడ్డి వద్దకు వెళ్లి నీటిని విడుదల చేయించాలని డిమాండ్ చేశారు. ఇక్కడి పాలకులు అసలు పట్టించుకోవడం లేదని పరోక్షంగా ఎమ్మెల్యే రోహిత్ రావును విమర్శించారు. ధర్నాలో బీఆర్ఎస్ పార్టీ నియోజక వర్గ ఇంచార్జి తిరుపతి రెడ్డి, మెదక్ మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ మల్లికార్జున్ గౌడ్, రైతు నాయకులు సోములు, మామిల్ల ఆంజనేయులు,దేవేందర్ రెడ్డి,మాజీ జెడ్పీ వైస్ చైర్మన్ లావణ్యారెడ్డి,తదితరులు పాల్గొన్నారు.ధర్నా అనంతరం మెదక్ అదనపు కలెక్టర్ నాగేశ్ కు పద్మా దేవేందర్ రెడ్డి,నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి రైతు నాయకులతో కలిసి వినతి పత్రం అందించారు.
Also Read: Farmers Protest: యూరియా కోసం రోడ్డెక్కిన రైతులు.. స్తంభించిన రోడ్లు.. ఎక్కడంటే..?

