Warangal: మ్యాట్రిమోనీలో పరిచయమైన లేడి కిలేడీ
Warangal ( IMAGE credIT: SWETCHA reporter)
నార్త్ తెలంగాణ

Warangal: మ్యాట్రిమోనీలో పరిచయమైన లేడి కిలేడీ.. పెళ్లి చేసుకుని నగలు డబ్బుతో పరార్!

Warangal: పవిత్రమైన మూడు మూళ్ళ బంధమైన పెళ్లి పేరుతో మోసాలకు పాల్పడుతున్న ఘటనలు పెరుగుతున్నాయి. తాజాగా మ్యాట్రిమోనీ సైట్ ద్వారా పరిచయమై, పెళ్లి చేసుకుని కొన్ని రోజులకే ఓ యువతి నగలు, డబ్బుతో ఉడాయించిన ఘటన వరంగల్ జిల్లా పర్వతగిరి మండలంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన
​వివరాల ప్రకారం పర్వతగిరి మండలానికి చెందిన ఓ యువకుడికి మ్యాట్రిమోనీ సైట్ ద్వారా విజయవాడకు చెందిన ఓ యువతితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం పెళ్లి వరకు వెళ్లింది. ఇరువురు పెద్దల సమక్షంలో వివాహం చేసుకున్నారు. పెళ్లయిన కొద్ది రోజులకే అదును చూసుకున్న ఆ కిలాడి మాయ లేడి ఇంట్లో ఉన్న రూ. 2 లక్షల నగదు, 8 తులాల బంగారు ఆభరణాలతో రాత్రికి రాత్రే ఉదయించింది.

Also Read: Warangal Police: డ్రగ్స్‌ రహిత సమాజమే మనందరి లక్ష్యం.. వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ సన్‌ ప్రీత్‌ సింగ్‌!

అంతా మాయ బజార్ నాటకమే అని తెలిసి షాక్ అయిన వరుడు

భార్య కనిపించకపోవడంతో కంగారుపడ్డ వరుడు, ఆమె ఆచూకీ కోసం ప్రయత్నించగా దిమ్మతిరిగే నిజాలు తెలిశాయి. పెళ్లి సమయంలో యువతి వెంట తల్లిదండ్రులు, బంధువులుగా వచ్చిన వారంతా నకిలీ అని, కేవలం పెళ్లి నాటకం ఆడటానికే వచ్చారని తెలుసుకొని బాధితుడు షాక్ కు గురయ్యాడు.

మరో ఇద్దరి ముంచిన మాయ లేడి

ఈ ఘటనపై బాధితులు ఆరా తీయగా సంచలన విషయాలు బయటపడ్డాయి. సదరు మాయ లేడి గతంలోనూ ఇదే తరహాలో మరో ఇద్దరు యువకులను పెళ్లి పేరుతో మోసం చేసినట్లు గుర్తించారు. అమాయక యువకులను టార్గెట్ చేస్తూ, పెళ్లి చేసుకుని ఆపై దోచుకెళ్లడమే ఈమె పనిగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది. ఈ రోజు బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Also Read: Warangal District: హనుమకొండ కలెక్టరేట్ వద్ద ఉద్రిక్తత.. ప్రైవేటు విద్యా సంస్థల నిరసన..?

Just In

01

S Thaman: సినిమా ఇండస్ట్రీలో యూనిటీ లేదు.. టాలీవుడ్‌పై థమన్ ఫైర్

The Raja Saab: ఈసారి బ్యూటీఫుల్ మెలోడీతో.. ప్రోమో చూశారా!

Bigg Boss Buzzz: అబద్దం చెప్పమన్నా చెప్పను.. శివాజీకి షాకిచ్చిన సుమన్ శెట్టి!

Aswini Dutt: 50 సంవత్సరాల వైజయంతి ప్రయాణం.. నిర్మాత అశ్వినీదత్ ఎమోషనల్ లెటర్..!

Dharamshala T20: ధర్మశాల టీ20లో దక్షిణాఫ్రికాపై భారత్ గెలుపు..